సర్వేపల్లి రామయ్య Vs జిల్లా కలెక్టరు చిత్తూరు సివిల్ అప్పీల్ 7461-2009 SC తీర్పు 2019-03-14

వికీసోర్స్ నుండి

భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానము
సివిల్ అప్పిలేట్ జ్యూరిస్ డిక్షన్
సివిల్ అప్పీలు నంబరు 7461/2009

సర్వేపల్లి రామయ్య (మృతుడు), వారసులు మరియు ఇతరులు,

- అప్పీలుదారులు

మరియు

జిల్లా కలెక్టరు, చిత్తూరు, మరియు ఇతరులు,

- ప్రతివాదులు

తీర్పు:

ఆర్.భానుమతి, జె.

1. 22-02-2006 నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిట్ పిటీషన్ నెం. 1495/2004 లో, అప్పీలు దారులకు జిల్లా కలెక్టరు రైతువారీ పట్టా జారీ చేయుటకు తిరస్కరిస్తూ ఇచ్చిన సింగిల్ జడ్జి ఆర్డరును, స్థిరపరుస్తూ, డివిజన్ బెంచి ఇచ్చిన ఆర్డరుపై ప్రస్తుత అప్పీలు వెలువడినది.

2. వారి పూర్వీకులు, 13.12.1940 లో, శ్రీ హాతీరాంజీ మఠం నుండి టి. డి.నెం. 464 గల 6.00 ఎకరాల విస్తీర్ణం గల మెట్ట భూమికి శాశ్వత పట్టాను పొందియున్నారని, మరియు అప్పటి నుండి వారి ఆధీనంలోనే వున్నదని, అప్పీలు దారుల కేసు, సర్వే నం.234 నందలి ఇనాము నం.464 లోబడిన 6.00 ఎకరాల విస్తీర్ణం గల భూమికి 29.09.1980 తారీఖు గల రైతువారీ పట్టాను పొందినామని అప్పీలు దారుల కేసు అదేవిధంగా, అప్పీలు దారులు 14.12.1980 లో ఇనాము నెం.464, సర్వే నం.234 సంబంధించి 5.00 ఎకరాల విస్తీర్ణం గల వేరొక పట్టాను పొందియున్నారు. అప్పీలు దారులు శ్రీ సర్వేపల్లి రామయ్య, 29.09.1980 నాటి డిప్యూటీ తాసిల్దారు ఉత్తర్వులు ద్వారా పొందిన పట్టాను, రెవెన్యూలో ఎంట్రీలు వేసి, ఆచరణలోకి పెట్టుటకు తిరుపతి, రూరల్, తాశిల్దారుకు ఉత్తర్వులు కోరుతు రిట్ నెం. 2759/1980, హైకోర్టులో వేసినారు. ఇట్టి రిట్ పిటీషన్ ను హైకోర్టు, 19.03.1980 నాటీ ఆర్డరులో, అధికారులను, సంబంధిత రికార్డుల వలన సంతృప్తులైన, యెడల, అట్టి పట్టా అసలైనదా కాదా పరిశీలించి, అసలైనదైతే దానిని ఆచరణలో పెట్టాలని, ఉత్తర్వులు ఇవ్వబడినవి. .

3: 20.06.1990 తేదీ గల ఆర్.ఒ.సీ.సీ.213/89 ద్వారా, తిరుపతి, రూరల్, మండల రెవెన్యూ ఆఫీసరు, అప్పీలుదారుడు సర్వేపల్లి రామయ్యకు రైతు వారీ పట్టా జారీ చేస్తూ ఇచ్చిన ఆర్డరును ఆచరణ పెట్టు, విషయంలో వివరణ కోరుతూ జిల్లా కలెక్టరును, అడిగినారు. జిల్లా కలెక్టరు ఆచరణకు అనుమతి ఇవ్వలేదు. పైగా, 14.03.1991 నాటి ఆంధ్రజ్యోతి, తెలుగు దినపత్రికలో ఆర్.ఒ.సి.నెం.బి9.00701/1980, 12.03.1991 తేదీ గల ప్రకటన ద్వారా, చిత్తూరు జిల్లా, చంద్రగిరిలో, శ్రీ షేక్ కాసుమయ్య గారు, ఇనాము డెప్యూటీ తాసిల్దారుగా, 1980వ సం.లో జారీ చేసిన రైతు వారీ పట్టాలు, మరియు తదుపరి విక్రయ పత్రాలు చెల్లనేరవని ప్రకటించినారు.

4: రైతు వారీ పట్టా ఆచరణకు, జిల్లా కలెక్టరు అనుమతి ఇవ్వనందున, అప్పీలు దారుడు రిట్ పీటీషన్ నెం. 29664 & 29665/1995 వేసినారు, అందులో గత రిట్ నెం. 2759/1990 సమర్పించిన అంశములనే తిరిగి వేయటం జరిగినది. జిల్లా కలెక్టరుకు, విచారణ జరిపి, అప్పీలుదారునకు అవకాశం ఇస్తూ, సరియైన ఆర్డరు ఇవ్వవల్సిందిగా, 28.11.2001లో రిట్ పిటీషన్లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. అప్పీలు దారునికి అవకాశం ఇచ్చి, విచారణ నిర్వహించి జిల్లా కలెక్టరు జనవరి 2003లో ఆర్డరు ఇస్తూ, 03.09.1984లో ఇచ్చిన ప్రకటన ప్రకారం, సెక్షను 2 - A కి లోబడి ఇట్టి భూమి 'పెద్దచెరువు టేంక్'గా వర్గీకరణ చేయుబడుట వలన, అప్పీలు దారుడు పట్టా జారీకొరకు చేసిన దరఖాస్తు తిరస్కరించబడినది మరియు సర్వేపల్లి రామయ్యకు, డెప్యూటీ తాసిల్దారు ఇచ్చిన పట్టాలు కల్పితమైనవని, ఆర్డరు ఇవ్వడమైనది.

5: జిల్లా కలెక్టరు ఆర్డరును సవాలు చేస్తూ, అప్పీలుదారులు వేసిన రిట్ నెం. 5807/2003ను, సింగిల్ జడ్జి కొట్టి వేస్తూ, జిల్లా కలెక్టరు, పట్టా స్వభావం గురించి, రికార్డుచేసిన విషయములు అవి నకిలి పట్టాలని నిర్ధారించినది. ఖచ్చితమైన ఆధారాలను గుర్తించినదిగా, వెల్లడించినారు. సింగిల్ జడ్జి, దీనికి కొనసాగింపుగా, ఇనాము రద్దు ఏక్టు, సెక్షను 2 - A కి లోబడి, అందలి నిషేధానికి లోబడి టేంక్ బెడ్ భూములు అవి ప్రభుత్వానికి చెందును. పరాధీనముగాని, స్వాధీనముగాని చేయరాదు, అని వెల్లడించినారు. అప్పీలులో డివిజను బెంచి, గౌరవ సింగిల్ జడ్జి ఆర్డరును నిర్ధారించుచూ, 'పెద్దచెరువు టేంక్'గా వర్గీకరించబడిన భూములు, సెక్షను 2 - A, ఇనాము రద్దు ఏక్టుకు లోబడి, అందున్న నిషేధము దృష్ట్యా, వాటిని బదలాయించుటకూడదు. కొనసాగింపుగా, డివిజన్ బెంచి, ఇనాము రద్దు ఏక్టుకు లోబడి, 03.09.1984లో ఇచ్చిన ప్రకటనను అప్పీలు దారుడు సవాలు చేయలేదు, కలెక్టరు ఇచ్చిన ఆర్డరులో, 03.09.84 గెజిట్ ప్రకటనలో పేజీ నెం.20 లో నమోదైన ఎంట్రీ గూర్చి ప్రత్యేక సూచన చేస్తూ, ఆ సర్వే నం.234 లోని భూములు పెద్ద చెరువు టేంకు, చెప్పినప్పటికీ, అటువంటి గెజిట్ ప్రకటనను సవాలు చేయకుండా, కలెక్టరు ఆర్డరును రద్దు చేయమని కోరరాదు.

6: అప్పీలుదారుని సీనియర్ అడ్వకేటు శ్రీ ఎస్. గురుకృష్ణ, తన వాదన వినిపిస్తూ, 29.09.1980 మరియు 04.12.1980 నాటీ ఆర్డరులలో, అప్పీలు దారునికి అనుమతించిన రైతు వారి పట్టా ఉత్తర్వులను, ఏక్టు, సెక్షన్ 3(4) లోబడి, చట్టరీత్యా, ప్రభుత్వంగాని, ఏ ఇతరులుగాని సవాలుచేయలేదు కనుక, అట్టి ఆర్డరులు అంతిమ తీర్పులేనని వాదించినారు, మరియు, రైతువారీ పట్టాకు ఉత్తర్వులు ఇస్తూ, ఇనాము తాశిల్దారు ఇచ్చిన ఆర్డరు విషయంలో, ప్రతివాదులు విరుద్ధమైన వైఖరి అవలంభించారు. హైకోర్టు ఆర్డరు రీత్యా, దర్యాప్తు కొనసాగించుటలో, కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించలేదని, అట్టి జిల్లా కలెక్టరు ఆర్డరును రద్దుచేయకుండా, హైకోర్టు పొరపాటు చేసిందని, వాదించారు.

7: ప్రభుత్వ వకీలు తమ వాదన వినిపిస్తూ, 03.09.1984 నాటి, చిత్తూరు, జిల్లా గెజిట్ నందు సర్వే నం.234లో వున్న 113.67½ ఎకరాల భూమిని 'పెద్దచెరువు టేంక్' పోరంబోకుగా వర్గీకరణ చేయుట జరిగినదనియు, మరియు అట్టి గెజిట్ ప్రకటనకు ముందు వున్న ఎటువంటి పట్టాలుగానీ, ఎటువంటి భూమికి గాను ఎవరి దగ్గర వున్నా, అవి లేనట్టేనని మరియు చెల్ల నేరవని, చెప్పినారు. ఆధారాలను పరిగణిస్తూ, జిల్లా కలెక్టరు, అట్టి భూమి 'టేంక్' పోరంబోకు'గా వర్గీకరణ చేయబడిన దన్న , వారి ఆర్డరు సరియైనదేననియు, అప్పీలు దారుడు ఆ భూమిపై హక్కుకోరరాదనియు, పైగా వారు 03.09.1984 నాటి గెజిట్ ప్రకటనను, సవాలు చేయలేదు.

8: చిత్తూరు జిల్లా, తిరుపతి రూరల్ మండలానికి చెందిన తీరుచానూరు గ్రామం మైనర్ ఇనాము గ్రామం ఐనందున, ఇది ఆంధ్రప్రదేశ్ ఇనాము (ఎబోలిషన్ & కన్వర్షన్ ఇన్ టు రైతువారీ) ఏక్టు, 1956 (ఇనాము ఎబోలిషన్ ఏక్టు) లోబడి వుంటుంది. ఇట్టి గ్రామంలోని సర్వే నం. 234 లో గల మొత్తం భూమి 'పెద్దచెరువు టేంక్ పోరంబోకుగా వర్గీకరించబడినది. అన్ని సామాజిక ప్రభుత్వ పోరంబోకు భూములు ఇనా ఎబోలిషన్ చట్టం, సెక్షన్ 2 - Aకి చేరి వుంటాయి. ఈ భూములు, చట్టానికి లోబడి, ఎట్టి వ్యక్తులకు గాని రైతు వారీ పట్టాలు ఇచ్చుటకు లభ్యముగాలేవు. ఇది ఇనాము గ్రామం ఐనందున, కలెక్టరు ఆఫీసునందలి అప్పటి ఇనాము డెప్యూటీ తాశీల్దారు, చిత్తూరు, మొత్తం 113-67½ ఎకరాల భూమిని ఇనాము రద్దు చట్టం సెక్షను 3 - ఎ క్రింద, పేజి 20 లో, 03.09.1984 నాటి జిల్లా గెజిట్ లో 'టేక్' పోరంబోకు' గా ప్రకటించుట జరిగినది. ఇనాము తాశిల్దారు సదుద్దేశంతోనే, పైన చెప్పిన విషయం గుర్తించక, పొరపాటున, సర్వే నం.234 లోని 54.00 ఎకరాల భూమిని, చిత్తూరు జిల్లా గెజిట్, 03.09.1984 నాడు పేజీ 19లో 'ఇనాము మెట్ట' గా చెప్పుట జరిగింది, కానీ అది చెల్లదు.

9: ఇంతకు ముందు గుర్తించినట్లుగా, 29.09.1980 మరియు 14.12.1980 నాటి ఉత్తర్వులు ఆధారంగా, రైతు వారీ పట్టా జారీ గురించి, అప్పీలు దారుడు కోరుచున్నాడు. 20.06.1990లో, ఆర్.ఒ.సి.నెం.213/89 గల ఉత్తర్వు ద్వారా, మండల రెవెన్యూ ఆఫీసరు వివరణ కోరగా, జిల్లా కలెక్టరు, 14.03.1991 లో ఆర్.ఒ.సి.నెం.B.00701/1990 ద్వారా, 12.03.1991 ఆంధ్రజ్యోతి దిన పత్రిక ప్రకటన ద్వారా, చిత్తూరు జిల్లా, చంద్రగిరి, ఇనాము డెప్యూటీ తాశీల్దారుగా శ్రీ షేక్ కాసుమయ్య గారు వుండగా జారీ చేసిన రైతు వారీ పట్టాలు చెల్లవనియు, క్రయ దస్తావేజులు కూడ చెల్లవనియు, ప్రకటించినారు. అప్పటి జిల్లా కలెక్టరు చిత్తూరు, 28.07.1994 నాటి ఆర్.ఒ.సీ.ఇ2/201/1990, 23.08.1994 ఆంధ్రజ్యోతి తెలుగు దిన పత్రికా ప్రకటన ద్వారా అప్పటి ఇనాము డెప్యూటీ తాశీల్దారు శ్రీ షేక్ చిన కాసుమయ్య అక్రమ పట్టాలు జారీ చేసినారనియు అవి మోసపూరితమైనవి, చెల్లవని, ప్రకటించినారు. 23.08.1984 నాటి పత్రికా ప్రకటనలో, 29.09.1980 నాటి ఐ.ఇ.నెం.303/77 తో ఇవ్వబడినట్లుగా చెప్పబడి, ఈ కేసులో అప్పీలుదారులు ఆధార పడుతున్నారో, అట్టి దానిని అప్పీలు దారుడు సర్వేపల్లి రామయ్యపేరుతో 23.08.1984 నాటి పేపరు ప్రకటనలో సీరియల్ నెంబరు 1 (ఒకటిగా) గా చూపబడినది.

10: ఇక్కడ గుర్తించవల్సిన విషయం ఏమనగా ఏ డాక్యుమెంటు ఆధారంగా భూమి మీద హక్కు కోరుచున్నాడో, అట్టిది 31.12.1940లో శ్రీ హాతీ రాంజీ, మఠం, తిరుపతి వారు ఇచ్చినట్లు చెప్పబడుతున్న తాకీదు ప్రతివాదుల వాదన ప్రకారం తిరుపతి శ్రీ హాతీ రాంజీ, మఠం వారికీ అటువంటి భూమిపై తాకీదు గానీ, శాశ్వత పట్టాను గానీ ఇచ్చే హక్కు లేనే లేదు. చాలా కేసులలో, గమనించినది ఏమంటే, హాతీ రాంజీ, మఠం వారు, అట్టి తాకీదు గాని, శాశ్వత పట్టాలు గానీ ఎన్నడూ ఇవ్వలేదు. అవి పుట్టించబడినవని లేదా కల్పితములు మరియు అప్పీలు దారులు ఆధారపడుతున్న శాశ్వత పట్టా చెల్లదు, ఆధారపడ దగ్గ డాక్యుమెంటు కాదు.

11: డాక్యుమెంట్లు పరిశీలించిన మీదట, డెప్యూటీ తాశిల్దారు రిపోర్టును బట్టి, అప్పీలుదారుడు సర్వే నం. 234 లోని భూమిపై, కల్పిత పత్రాలు ఆధారంగా, భూమిపై హక్కు కోరుచున్నట్లుగా, అవి ఇనాము డెప్యూటీ తాశిల్దారు, చంద్రగిరి, అధికార రికార్డులో, లేవని జిల్లా కలెక్టరు నిర్ధారించినారు. 03.09.1984 నాటి అధికారికి జిల్లా గెజిట్ నెం. 9, ప్రకటించినట్లుగా, తిరుచానూరు గ్రామంలోని సర్వే నం.234 లోని మొత్తం 113.67 ½ ఎకరాల మొత్తం భూమిని, ఇనాము ఎబోలిషన్ ఏక్టు, సెక్షన్ 2- A లో బడి, “పెద్దచెర్వు టేంకు" గా వర్గీకరించబడినదని జిల్లా కలెక్టరు సరిగానే చెప్పుట జరిగింది. జిల్లా కలెక్టరు సరియైనట్లుగా చెప్పినట్లు, సర్వే నంబరు 234లో గల మొత్తం విస్తీర్ణం భూమిని 'టేంకు భూమిగా వర్గీకరణ జరిగిన సంధర్బంలో ఇనాము రద్దు చట్టం లోబడి రైతువారీ పట్టా మంజూరుకు ఎట్టి భూమీ లభ్యతలో లేవు మరియు రైతు వారీ పట్టా ఇచ్చే ప్రశ్న లేదు. అట్టి భూమి పెద్ద చెరువు టాంకుగా వర్గీకరించబడుటవలన అది ప్రభుత్వానికి చెందుతుందని, సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచి, తమ న్యాయమైన తీర్పు ద్వారా, ఇనాము రద్దు ఏక్టు సెక్షన్ 2- A కి లోబడి, నిషేధం వలన, రైతు వారీ పట్టాలు జారీ చేసే ప్రశ్న తలఎత్తదు. అని చెప్పటం జరిగింది.

12: అప్పీలు దారుల తరపున, 03.09.1984 నాటి గెజిట్ ప్రకటనలో పేజీ నంబరు 9లో, ఫారమ్ II సబ్ సెక్షన్ (3), ఇనాము రద్దు చట్టం లో బడి సర్వే నంబరు 234 నందలి, 54.00 ఎకరాల భూమి 'మెట్ట'గా వర్గీకరించిన విషయంపై, ఎక్కువగా ఆధారపడటం జరిగింది. చట్టంలోని నిబంధనల ప్రకారం, ఇనాం డెప్యూటీ తాశిల్దారు, ఇనాము భూములను మాత్రం ఫారం 1 నోటీసు ఇచ్చి, ఫారం II ద్వారా, అట్టి భూములు ఒక సంస్థ ఆధీనంలో వున్నదీ లేనిది నిర్ణయించాలి. ప్రతివాది-ప్రభుత్వం ప్రకారం, ఇనాము డెప్యూటీ తాశిల్దారు, ఆంధ్రప్రదేశ్, ఇనాము (రద్దు మరియు రైతువారీ మార్పు) చట్టం 1956 లో విధించిన పద్ధతిని అనుసరించలేదు. సరాసరిగా, జిల్లా గెజిట్ 19వ పేజీలో, సర్వే నంబరు 234లోని 54.00 ఎకరాల భూమిని 'ఇనాం మెట్ట'గా ప్రకటించుట, చట్ట వ్యతిరేకము, మరియు చెల్లదు. చిత్తూరు జిల్లా గెజిట్లో ఇవ్వబడిన కేవలం ప్రకటన సమాజభూములపై, అటువంటి చెల్లని ప్రకటనలు ఆధారంగా, ఎవ్వరూ హక్కు కోరరాదు.

13: జిల్లా కలెక్టరు, 03.09.1984 నాటి గెజిట్ ప్రకటనను సూచిస్తూ, అట్టి ప్రకటన ప్రకారం సర్వే నంబరు. 234లోని 113.67 ½ ఎకరాల భూమి 'పెద్దచెరువు టేంకు'గా ప్రకటించుట వలన, ఎటువంటి విస్తీర్ణతల భూమి రైతు వారీ పెట్టా ఇచ్చుటకు అందుబాటులో లేవు. హైకోర్టు గుర్తించినట్లుగా, 03.09.1984 గెజిట్ ప్రకటనను, జిల్లా కలెక్టరు తన ఆర్డరులో పేర్కొన్నప్పటికీ, అప్పీలు దారుడు చెప్పబడిన గెజిట్ ప్రకటనను సవాలు చేయలేదు. డివిజన్ బెంచి, 22.02.2006 నాటి తీర్పులో సర్వే నంబరు 234 లోని భూమిని 'పెద్దచెరువు టేంకు' పోరంబోకు గా గెజిట్ ప్రకటనలో పేజీ నెంబరు 20 లో వున్న అతి ముఖ్యమైన అంశాన్ని దాచిపెట్టిన వైనంపై, అప్పీలుదారుని ప్రవర్తనపై విస్తారంగా ప్రస్తావించినారు. సాక్ష్యాధారాల ఆధారంగా, హైకోర్టు, జిల్లా కలెక్టరు ఉత్తర్వులు రద్దుకు తిరస్కరిస్తూ, ఇచ్చిన నిర్ణయం సక్రమమైనదే సవాలు చేయబడిన తీర్పులో ఎటువంటి లోపములు మా దృష్టిలో లేనందున, ఎటువంటి జోక్యమూ అవసరం లేదు.

ఫలితంగా అప్పీలు కొట్టి వేయబడినది.

....................J

ఆర్. భానుమతి

న్యూఢిల్లీ, 14.03.2019
గమనిక: స్థానిక భాషలో అనువదించబడిన తీర్పు, అతడు/ఆమె యొక్క స్థానిక భాషలో అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమతము. ఇది ఏ ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు. అనువదించిన స్థానిక భాష తీర్పు మూలము ఆంగ్లమున గల తీర్పు ప్రామాణికమైనది.

భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానము
సివిల్ అప్పిలేట్ జ్యూరిస్ డిక్షన్
సివిల్ అప్పీలు నంబరు 7461/2009

సర్వేపల్లి రామయ్య (మృతుడు), వారసులు మరియు ఇతరులు,

- అప్పీలుదారులు

మరియు

జిల్లా కలెక్టరు, చిత్తూరు, మరియు ఇతరులు,

- ప్రతివాదులు

తీర్పు:

ఇందిరా బెనర్జీ. జె.

1: నేను, గౌరవనీయులు సోదరి, తీర్పు ప్రతిని పూర్తిగా ఆకళింపు చేసుకుని, నేను సంపూర్ణ అంగీకారముతో, ఇట్టి అప్పీలు కొట్టి వేయ తగినది. నేను, నా సోదరి, తీర్పు ముగింపు విషయములో ఏకాభిప్రాయంతో వున్నప్పటికీ, దానికి, నా స్వంతమైన అట్టి కారణములు చెప్పదల్చుకున్నాను.

2: అప్పీలుదారుని, కేసు ఏమనగా, 31.12.1940 లో అసలు రిట్ పిటీషనరు, లేటు సర్వేపల్లి రామయ్య, తండ్రి లేటు సర్వేపల్లి పొట్టయ్య, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా తిరిచానూరు గ్రామంలో సర్వే నం. 234లో రెండు ప్లాట్ల భూమికి 'శాశ్వతపట్టా' పొందియున్నారు. ధర చెల్లించి, హాతీ రాంజీ మఠం, మహంతు నుండి ఒక ప్లాటు 6 ఎకరాలు, వేరొకటి 5 ఎకరాలు. 3: అప్పీలుదారుని ప్రకారం, లేటు సర్వేపల్లి పొట్టయ్య, శాశ్వతపట్టాగా ఇచ్చిన తాకీదు, అట్టి తాకీదు భూమి 'పుంజా మన వారి అగరికల మిట్ట చేను' అనగా వ్యవసాయ మెట్టభూమి. అట్టి తాకీదు అమలును ప్రతివాదులు విభేదించారు.

4: 1940 సం.నుండి, సర్వేపల్లి రామయ్య/ అతని పూర్వీకులు నిరాటంక స్వాధీనంలో అనుభవించుచూ, అట్టి 11 ఎకరాల అనగా రెండు భాగాలు సాగుచేసుకునుచున్నారని వాదన.

5: ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ప్రాంత) ఇనాము (రద్దు మరియు రైత్యారీగా మార్పు) ఏక్టు 1956, ఇక ముందు 1956 ఏక్టుగా వ్యవహరించి, ఇనాము భూములు రద్దు మరియు కొన్ని ఇనాము భూముల ఆంధ్రప్రదేశ్ లోని (ఆంధ్ర ప్రాంతంలో) రైతువారీగా మార్పుటకు చట్ట బద్ధీకరణ చేయబడినది. 6: ఇనాము భూములు అనగా సెక్షన్ 2 (c), 1956 ఏక్టులో క్రింది విధంగా వివరించబడినది.

“2 నిర్వచనము: ఈ ఏక్టులో, ఒక సంధర్బంలో వేరుగా కావాల్సినచో: (c) 'ప్రభుత్వంచే ఎటువంటి భూమైనా, దానికి ఇనాముగా అనుమతించిన ఎడల, రూఢ పరచినా గురించినా, అదే ఇనాము భూమి' (ఎటువంటి భూమిగాని బనగాన పల్లెలో కలిసిన ప్రాంతం, దానికి ఇనాము దానముగా చెయ్యబడినచో, అట్టి ప్రాంతపు గత పాలకుడుచే స్థిరపరచిన, గుర్తించబడిన, భూమితో చేర్చుకుని మద్రాసు ఎస్టేటు భూమి ఏక్టు, 1908 (మద్రాసు ఏక్టు 1 of 1908) కు చేరిన ఇనాము ఇందుకు వర్తించదు.

సెక్షను 2 (d), 1956 ఏక్టు నిర్వచనం ప్రకారం, ఇనాము గ్రామం అనగా అట్టి ప్రభుత్వ రికార్డులులలో ఆవిధంగా ఉద్దేశించి వుండాలి. తిరుచానూరు ఇనాము గ్రామముగా

ఉద్దేశించి వున్నారు.

7. ఏక్టు 20, 1975 ద్వారా సెక్షన్ 2A, 1956 ఏక్టుకు చేసిన సవరణ, సమకూర్చునది, క్రింది విధంగా :

“[2- A అన్ని పోరంబోకు భూములు, సమాజ భూములు మొత్తము ప్రభుత్వానికి చెంది వున్న ఇనాము భూములు, ఏక్టులో వున్న దేనికి సంబంధించక ఇనాము భూములలోని అన్ని సమాజ భూములు, పోరంబోకు, గడ్డి భూములు, పనికి రాని భూములు, అటవీ భూములు, గనులు, రాళ్ల గనులు, చెరువులు, చెరువుగట్టు, నీటిపారుదల నిర్మాణాలు, సెలయేర్లు, నదులు, చేపలచెరువులు, నదులు దాటు ప్రదేశము, అన్నీ ప్రభుత్వానికి బదలాయించబడినది, నిరాటంకముగా, యధేచ్చగా ప్రభుత్వానికే చెందును.

సెక్షన్ 2 - A, 1956 ఏక్టు ద్వారా, అన్ని అటవీభూములు, గడ్డిభూములు, సమాజ భూములు, నదీప్రవాహాలు, పోరంబోకునేలలు, చెరువులు, చెరువుగట్టు మొ.నివి నిరాటంకముగా ప్రభుత్వానివే. అందుచేత 1956 ఏళ్లు, సెక్షన్ 3 - A కు లోబడి, ఎటువంటి వ్యక్తి కౌలు గాని, నివేశనకుగాని వేరేదైనాగాని, ఏ భూమికి గాని నీటివనరుకై

గాని, హక్కు కోరరాదు. అవి నిరాటంకమై, ప్రభుత్వ స్వాధీనంలో వున్నవి.

8: రైతువారీ పట్టా: జారీ ఏక్టు అమలు జరిగిన తదుపరి, సబ్ సెక్షన్ (4) నిబంధనలు క్రింద, తాశీల్దారు, తనంతట గానీ, లేక సంస్థ వ్యక్తి దరఖాస్తు పిమ్మట సంబందిత అందరికీ, నియమ పద్ధతిలో నోటీసు జారీ చేసి, ఇనాము భూములకు పట్టా ఇచ్చుటకు, వారికి తగినంత, అవకాశం ఇచ్చి వారి వాదన విని, సంబంధిత రికార్డులు పరిశీలించి, సెక్షను 4 - A, నిబంధనల ప్రకారం, అట్టి రైతువారీ పట్టాకూ అర్హులైన, వ్యక్తులు, సంస్థలకు, విధించబడిన ఫారమ్ లో రైతు వారీ పట్టా జారీ చేయవలెను.

9: 10వ తేదీ డిశంబరు 1956 సం.లో 1956 చట్టం దేశాధ్యక్షుని సమ్మతి లభించనప్పటికీ, 14వ తేదీ డిశంబరు 1956 సం.లో అధికారిక రాజ పత్రంలో ముద్రించబడినది, వెనువెంటనే అమలులోకి వచ్చినది, వెనువెంటనే అప్పీలు దారులు కాని/మరియు ఆసక్తి కల పూర్వీకులు గానీ రౌతువారీ పట్టా కొరకు, దరఖాస్తు చెయ్యలేదు.

కేవలం 1980 సం.లోగానీ, సుమారుగా గానీ, సర్వేపల్లి రామయ్య, మృతుడు,

అటువంటి రెండు ప్లాట్లకు, రైతువారీ పట్టా కొరకు దరఖాస్తు చెయ్యలేదు.

10: చిత్తూరు, డిప్యూటీ కలెక్టరు 29వ తేదీ సెప్టెంబరు 1980 సం.లో సర్వేపల్లి రామయ్య మృతుడుకు ఆరు ఎకరాలకు రైతువారీ పట్టా జారీ చేసినట్లుగా, అప్పీలు దారుల వాదన.

11: అప్పీలు దారుల వాదన ప్రకారం, ఇనాము డెప్యూటీ తాసిల్దారు, వేరొక ఉత్తర్వు ద్వారా, నాల్గవ తేదీ డిశంబరు, 1980లో, సర్వేపల్లి రామయ్య మృతుడుకు ఐదు ఎకరాలకు, పట్టా ఇవ్వటం జరిగింది.

12: సబ్ సెక్షన్ (3) కి లోబడి, ఇనాము డెప్యూటీ తాసీల్దారు ఉత్తర్వు ప్రకారం, మరియు 1956 ఏక్టునందలి సెక్షన్ (3)కి లోబడి, సబ్ సెక్షన్ (4) కి లోబడి రెవెన్యూ కోర్టు వారి అంతిమ తీర్పు వలన, 3వ తేదీ సెప్టెంబరు, 1984, చిత్తూరు జిల్లా రాజ పత్రంలో సర్వే నం.234, తిరుచానూరు, పెద్ద చెరువు పోరంబోకు (చెరువు)అని ప్రచురించుట ద్వారా, ప్రకటన ఐనది.

13: ఇట్టి ప్రకటనను, అప్పీలుదారుడు, వారి పూర్వీకులు లేటు సర్వేపల్లి రామయ్య సవాలు చేయలేదు. కానీ కొందరు ఇతరులు హైకోర్టులో ప్రశ్నించారు కానీ, హైకోర్టు దానిని రద్దు చేయలేదు.

14: భావించిన రైతువారీ పట్టా, జారీ చేసిన పూర్తి పది సంవత్సరములు తదుపరి, సర్వేపల్లి రామయ్య, మృతుడు, రిట్.నెం. 2759/1990, అట్టి పట్టాను అమలు పరుచుటకు వేసినారు. 19.03.1990 సం.లో, మాన్యులు ఏకసభ్య న్యాయమూర్తి, అట్టి పట్టాను, అవి నిజంగా సరియైనవని కనుగొనిచో, అమలు చేయమని, కేసు పరిష్కరించినారు.

15: పైన పేర్కొన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల వలన, తిరుపతి (రూరల్, మండల రెవెన్యూ అధికారి, సర్వేపల్లి రామయ్య, మృతుడు కు జారీ చేసిన పట్టా అమలు పరచుటకు, కలెక్టరును కోరగా, కానీ అనుమతి నిరాకరించుట జరిగినది.

16: తదుపరి, సర్వేపల్లి రామయ్య, మృతుడు, రైతు వారీ పట్టా అమలుకు ఆర్డరు కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ నెంబర్లు 29664 & 29665/1995 దాఖలు చేసినారు. 17: ప్రతివాదులు, ఆ రిట్ పిటీషన్ కౌంటర్ లో రైతు వారీ పట్టా యొక్క యదార్ధతను విబేధించినారు, మరియు రైతు వారీ పట్టా రిజిస్టరులో, రైతువారి పట్టా గురించి 1977 - 1980 సం. వరకు ఎట్టి ఎంట్రీలు లేవని, వాదన చేసినారు.

18: మాన్యులు సింగులు జడ్జి, వారి ఆర్డరు ద్వారా 28.11.2001లో, కేసు పరిష్కరిస్తూ, కలెక్టరు, చిత్తూరు దర్యాప్తు జరిపి, ఆర్డరులు సూచించిన గడువులోగా సరియగు ఆర్డరు జారీ చేయమని ఉత్తర్వులు ఇచ్చారు.

19: తరువాత, కలెక్టరు, చిత్తూరు దర్యాప్తు నిర్వహించి ఆర్డరు ఇచ్చారు, సంబంధిత భాగం, క్రింది విధంగా ఉన్నది: “కేసు పరిశీలించబడినది తిరుపతి రూరల్ మండలలోని, తిరుచానూరు గ్రామానికి చెందిన, సర్వే నంబరు 234లో భూమిని, దరఖాస్తు దారుడు హక్కు కోరుచున్నాడు. తిరుచానూరుకు చెందిన సర్వే నం.234 లోని మొత్తం 113.67 % ఎకరాల భూమి, పెద్ద చెరువు టేంకుగా ప్రకటించబడినది, ఇట్టి తీర్పు 03.09.1984 నాడు రాజ పత్రం నెం. 9 లో ప్రకటించబడినది. తరువాత, వ్యాజ్యములు మొదలైనవి, రిట్ అప్పీలు నెం. 941 & 1070/88 నందు, 13.04.1992 నాడు గౌరవ హైకోర్టు, I.D.T. కి హేతుబద్ధమైన నిర్ణయాన్ని తీసుకోవల్సిందని, ఉత్తర్వులు ఇచ్చారు. ఇట్టి ఉత్తర్వు దృష్ట్యా, ఐ.డి.టి. చిత్తూరు ఎల్.ఎ.ఏక్టు, 1956, సెక్షన్ 2 - A కి అనుగుణంగా, 11-5-1993 నాడు హేతుపూర్వక ఆర్డరు, ఐ.డి.టి. నెం. 1/83 నందు ప్రకటించుచూ, తిరుచానూరు నందలి సర్వేనెం. 234 లోబడి వున్న 113.67 1 ఎకరాల భూమి 'టేంకు పోరంబోకు' గా ప్రకటించినారు.

అటు తరువాత, తిరుచానూరు, సర్వే నం. 234 కు చేరియున్నభూమి 'టేకు పోరంబోకు' గా ప్రకటించిన విషయం చెప్పనవసరం లేదు, మరియు ఎల్.ఎ. ఏక్టు 1956, సెక్షన్ 2 - A క్రిందికి చేర్చబడినది, అటువంటి సామాజిక భూములు రైతువారీ పట్టాలు జారీ చేయుటకు అందుబాటు లేవు. ఇట్టి విషయాన్ని, హైకోర్టు న్యాయమూర్తులు గౌరవనీయులు జస్టిస్ లింగరాజు రథ్ మరియు గౌరవనీయ జస్టిస్ వై. వెంకటాచలం, వారి 09.11.1994 నాటి రిట్ అప్పీలు 193/90 తీర్పు ద్వారా నిర్ధారించినారు. అంతేకాక 1980లో, ఐ.డి.టీ, చంద్రగిరి వారు ఇచ్చినారని చెప్పబడుతున్న అట్టి రైతువారీ పట్టాలు ఐ.డి.టీ అధికారక వస్త్రాలలో కనుపించుట లేదు మరియు అట్టి విషయాన్ని హైకోర్టులో కౌంటరు ఎఫిడవిట్ ద్వారా, ఐ.డి.టి వారు వాంగ్మూలము సమర్పించినారు.

పై చెప్పిన దాన్ని దృష్టిలో వుంచుకుని, నా అభిప్రాయం ఏమంటే, పీటీషనరు సమర్పించిన పత్రములు. నిర్వర్తించుటకు కావల్సిన సాక్ష్యము, ఆధారము అధికారిక

రికార్డులలో లేనే లేదు, తిరుపతి రూరల్ మండలంలోని, తిరుచానూరు గ్రామానికి చెందిన సర్వే నం.234 లోని భూమి లభ్యతలో లేదు. అందుచేత, కల్పిత రికార్డులపై ఇవ్వబడినట్లు చెప్పబడుతున్న రైతువారీ పట్టాను ఆచరణలో పెట్టుట అనే ప్రశ్న తలెత్తదు. గౌరవ హైకోర్టు రిట్. నెం. 29664 & 29665/95 లలో 28.11.2001 లో

ఇచ్చిన ఒకే ఆదేశానికి ఖచ్చితమైన, ఆచరణతో, ఇట్టి ఉత్తర్వు జారీ చేయబడినది.

20: ఇట్టి కలెక్టరు ఉత్తర్వులను సవాలు చేస్తూ, సర్వేపల్లి రామయ్య, మృతుడు, ప్రశ్నించిన రిట్ నెం.5807/2003, 23.04.2003 నాటి ఆర్డరులో, గౌరవనీయ సింగిల్ బెంచి, హైకోర్టు, తిరస్కారపూర్వకంగా కొట్టివేయ బడినది. ఇట్టి ఆర్డరు పై, లేటు సర్వేపల్లి రామయ్య వేసిన అప్పీలు కూడా, డివిజను బెంచి, 22.02.2006 తీర్పులో కొట్టి వేయబడినది.

21: సింగిల్ బెంచి కొట్టి వేస్తూ, రిట్లో ఇచ్చిన ఆర్డరును, సమర్ధిస్తూ 22.02.2006 లో డివిజన్ బెంచి ఇచ్చిన తీర్పులో ఎట్టి లోపములు గాని అట్టి అప్పీలలో కలుగ చేసుకోటానికి గాని లేదు.

22: పట్టాకు సంబంధించి, సంబంధిత రిజస్టరులో ఎట్టి నమోదులు లేని కారణంగా, ఇవ్వబడినదిగా చెప్పబడుతున్న రైతువారీ పట్టాను, దాని నిజాయితీని ప్రశ్నించిన కలెక్టరు ఆర్డరు పై వేసిన రిట్ పిటీషన్ ను నా దృష్టిలో, సింగిల్ జడ్జి సక్రమమైన రీతిలో, వ్యాజ్యానికి తిరస్కరించినట్లే.

1940 సం.లో మఠం, మహంతే శాశ్వత పట్టాను ఇవ్వటం తాకీదు జారీ చేయుట వివాదాస్పదమైనవి. గౌరవనీయ నా సోదరీమణి గమనించినట్లుగానే, ఇవ్వబడినట్లు చెప్పబడుతున్న చట్ట విరుద్దమైన రైతు వారీ పట్టాలు, వాటిని జారీ చేసిన ఇనాము డెప్యూటీ తాసిల్దారుపై తీవ్రమైన ఆరోపణలు వున్నవి.

పై పెచ్చు, జారీ చేయబడినవి చెప్పబడుచున్న ఈ పట్టాలు, 1956 ఏక్టు, సెక్షన్ 7 క్రింద చేర్చబడిన ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రాంత (ఇనాము ఎబోలిషన్ & కన్వర్షన్, రైతువారీ లోకి) రూలు 57 ప్రకారం ఇవ్వవలసిన దర్యాప్తుకు, నోటిసు విధించిన ఫారంలో ఇవ్వటం జరుగలేదు. అంతేకాక, మొత్తం సర్వే నం. 234 ‘టెంకు పోరంబోకు' గా ప్రకటించబడి, సెక్షన్ 2-A లో చేర్చబడినది. అందుచే అది పరాధీనము చేయుటకు వీలుకానిది.

23: పరిపాలన సంబంధింత నిర్ణయములు, న్యాయపరమైన రాజ్యంగములో ఆర్టికల్ 226 లో బడి, పునర్విక్షణకు లోబడి విరుద్ధమైన, న్యాయ వ్యతికరమైన, నిర్ణయము తీసుకొనుటకు కావల్సిన అధికారము, పద్ధతి పాటించుటలో అవకతవకలు వంటి కారణములు సందర్బములో మాత్రమే వుండును. ఇట్టి ఆధారములు క్రింద మాత్రమే, న్యాయపరమైన, పునర్వి క్షణము అనే అసాధారణ అధికారము ఉపయోగించలేను, తప్ప, పరిపాలన సంబంధిత నిర్ణయాల విషయంలో జోక్యం తగదు.

24: ఇట్టి కేసులో తీసుకున్న నిర్ణయం, కోర్టు ఆర్డరు దృష్ట్యా, కొన్ని ఆధారములను బట్టి తీసుకొన్నది. అది విరుద్ధమైనదని, దానికి హైకోర్టుకు లభించు అసాధారణ అధికారమైన న్యాయ పునర్వీక్షణ ద్వారా జోక్యం అవసరమని కాదు. ఒక తీర్పు అంత దారుణమైనదైతే, అది అవివేకముతో బలము లేనిదే, అది అన్ని తరాలకు అది వ్యతిరేకతతో వున్నదే. ఏ ఒక్క వ్యక్తి న్యాయమైన రీతిలో వ్యవహరించునపుడు, నిర్ణయాన్ని రికార్డులోని ఆధారాలు అనుసరించి, తీసుకుని ఉండవచ్చు. ఈ కేసులోని తీర్పు అవివేకమైనది కాదు.

25: కొన్ని సందర్భాలలో, ఒక తీర్పును, చట్ట విరుద్ధమని ఆధారంతో, ఆర్టికల్ 226కు లోబడి రద్దుగాని కొట్టి వేయుటగాని చేయవచ్చు. ఇది తీర్పులో కన్పించుచున్న చట్టపరమైన తప్పిదం వున్నప్పుడు, తీర్పు యొక్క మూలాలో నికి చూసినపుడు మరియు/లేక వేరు మాటల్లో ఐతే, కన్పించుచున్న తప్పిదం, దాని వల్ల గాని, లేకుంటే, తీర్పు వేరుగా వుండేది.

26: ఆర్టికల్ 226కు లోబడి న్యాయపరమైన పునర్వీక్షణ తీర్పుపై, వ్యతిరేకంగా కాదు, కాని తీర్పు తయారుచేసే పద్ధతి పైన మాత్రమే. స్పష్టమైన, చట్ట విరుద్ధత, మరియు, లేక తీర్పు ముఖం మీదే తేట తెల్లమౌతున్న దోషము, ఏది తీర్పు మూలంలోకి వెళుతుందో, అది తీర్పును వెలువరించే పద్ధతినే బలహీనం చేయును. ఈ ప్రస్తుత కేసులో, అటువంటి ఘోరమైన చట్ట విరుద్ధత లేక తప్పిదం గాని లేనేలేవు, ఆర్టికల్ 226 కు లోబడి చేసిన అధికార ప్రయోగం, ప్రశ్నించిన తీర్పుపై వచ్చిన అప్పీలు పైన గాని, లేక తీవ్ర వివాదభరితమైన, వాస్తవ ప్రశ్నలపై గాని ఇవ్వబడిన తీర్పు కాదు.

27: కలెక్టరు వుత్తర్వులు సాక్ష్యాధారముతో వున్నవి, కనుక వాటిలో జోక్యము తగదు. హైకోర్టు చాలా సవ్యంగా, జోక్యం చేసుకొనలేదు. న్యాయ సమీక్ష అనబడే అసాధారణ అధికార వినియోగంలో, రికార్డులోని సాక్ష్యాలను పునఃపరిశీలనలో గాని, అప్పీలుదారులు గాని, వారి పూర్వీకులకు గాని, ఆశక్తులకుగాని, మతం, మహంతి వారు శాశ్వత పట్టాను ఇచ్చిన, వివాద పూరిత ప్రశ్నను గురించి న్యాయనిర్ణయం చేయుటకు గాని, లేక అట్టి తాకీదు మహంతు జారీ చేసినట్లు గాని, లేక రైతువారీ పట్టాలు నిజమైనవా కాదా అనునవి గానీ అంశములు హైకోర్టుకు సంబందించవు. ఒకవేళ, వివాదాస్పద భూమి వాస్తవంగా అది నీటి వనరు ఎండిన నీటి వనరుయొక్క అడుగు భాగమా అని నిర్ణయ ప్రకటన హైకోర్టుది కాదు. తరచుగా, నీటి వనరుల ఎండిపోయిన భూభాగంలో వ్యవసాయం సాగు జరుగును. అంత మాత్రాన ఆ భూమి యొక్క నీటి వనరు అనే స్వభావం మారిపోదు.

28. మొత్తం సర్వే భూభాగాన్ని నీటి వనరుగా వర్గీకరించిన ప్రకటన, ఆధారంగా హైకోర్టు సవ్యంగా తీర్పు ఇస్తూ, మరియు, 1956 ఏక్టు, సెక్షన్ 2 - A కి లోబడి, వివాస్పద భూములు, ప్రతి బంధములు లేనివై ప్రభుత్వానికి హక్కు భుక్తములు అని చెప్పబడినది. అందుచేత, అట్టి ప్లాట్లకు రైతు వారీ పట్టా జారీ చేయుటకు, ప్రతివాదులను వత్తిడి చేయుట కుదరదు.

29: ఆలస్యము లోపములు, అనుమతి, మరియు, లేక బలమైన హక్కుతో రానటువంటి అప్పీలు దారులు, అటువంటి హక్కు వున్నట్టయితే, 1956 ఏక్టు అమలు జరిగిన సరియైన కాలంలోపల, రానట్టే కారణాల వల్ల, ఆర్టికల్ 226 కి లోబడి, ఈ కేసులో, ఎటువంటి ఉపశమనమూ కూడా తిరస్కరించ బడవల్సినదే.

30: పునరుక్తి ఐనప్పటికీ, అప్పీలుదారులు, మరియు/లేక వారి పూర్వీకులు, సోమరులు మరియు అతి నెమ్మదస్తులు అని, తిరిగి చెప్పవల్సి వస్తున్నది.

చట్టం, ఏక్టు అమలులో వచ్చిన వెనువెంటనే దరఖాస్తు చెయ్యవల్సి వుండగా,

పట్టాదారును, 1956 ఏక్టు అమలుకు రెండు దశాబ్దాలు తరువాత దరఖాస్తు చేసినారు.

31: పోరంబోకు (టేంకు) స్వాధీనం చేయరాదుననది నిశ్చలమైనదని, హైకోర్టు సింగిల్ బెంచి, మరియు ద్విసభ్య బెంచి సరిగానే నిర్ణయించినది. టేంకులకు గానీ, నీటి వనరులు, ఉపయోగంలో లేని ఎండిపోయిన నీటి వనరులు గాని, ఎటువంటి పట్టాలు జారీ చేయరాదు. మొత్తం సర్వేనంబరు 234లోని తిరుచానూరు భూమిని 'పెద్దచెరువు పోరంబోకు' (టాంకు) గా ప్రకటించిన 03.09.1984 నాటి రాజపత్రం ప్రకటనను, అప్పీలుదారులు గాని, మరియు/లేక ఆశక్తిగల పూర్వీకులు గాని, సవాలు చేయలేదు.

32: నీటి వనరులను పునరుద్ధరించాలని, వాటిని అలాగే వుంచాలన్న ఆవశ్యకతను, ఈ న్యాయస్థానము పలుమార్లు నొక్కి చెప్పటం జరిగింది, మరియు ఎవరి ఆధీనము చేయరానవి, నీటి వనరులుకు చెందిన భూములు ఎవరికీ ఇవ్వరాదని, అది ఎండి పోయినదైనా సరే, అని చెప్పటం జరిగింది. ఈ క్రింది కోర్టు దృష్టిలో ఇచ్చిన ఈ కోర్టు జడ్జిమెంట్లును అన్వయించుకొనవలెను.

1: సుసీత మరియు తమిళనాడు రాష్ట్రము (2006) 6 ఎస్.సి.సి, 543 లో ప్రకటితము.
2: ఎమ్.సీ.మెహతా (బ్ కల్ మరియు సూరజ్ కుండ్ సరస్సుల విషయము) కేంద్ర ప్రభుత్వము. (1997) 3 ఎస్.సీ.. పేజీ. 715 లో ప్రకటితము.
3: ఇంటలెక్టువల్స్ ఫోరం V. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. (2006) 3 ఎస్.సీ.సీ. 549లో ప్రకటితము.

33: సింగిల్ బెంచ్ మరియు డివిజన్ బెంచి ఇద్దరూ వారి, న్యాయ పూరితమైన మరియు ఏకీభవించిన, తీర్పులో, ఎటువంటి జోక్యము, ఈ కోర్టు చేయనవసరం లేదు. ఈ పైన చర్చించిన న్యాయ పరమైన అంశముల కారణంగా, ఈ అప్పీలు కొట్టివేయుటలో, నా గౌరవనీయులైన సోదరితో ఏకీభవిస్తున్నాను.

.................J

ఇందిరా బెనర్జీ. జే.

న్యూఢిల్లీ,

మార్చి 26, 2019.

గమనిక: స్థానిక భాషలో అనువదించబడిన తీర్పు, అతడు/ఆమె యొక్క స్థానిక భాషలో అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమతము. ఇది ఏ ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు. అనువదించిన స్థానిక భాష తీర్పు మూలము ఆంగ్లమున గల తీర్పు ప్రామాణికమైనది.

This work is available under the Creative Commons CC0 1.0 Universal Public Domain Dedication.

The person or the organisation responsible for this work, associated with this deed has dedicated the work to the public domain by waiving all of his or her rights to the work worldwide under copyright law, including all related and neighboring rights, to the extent allowed by law. You can copy, modify, distribute and perform the work, even for commercial purposes, all without asking permission.