శ్రీమాన్ ఎస్. శ్రీనివాస అయ్యంగారి జీవితము

వికీసోర్స్ నుండి





Printed by

V. VENKATESWARA SASTRULU

of V. Ramaswamy Sastrulu & Sons

at the 'Vavilla' Press

Madras. - 1955

పీఠిక

శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు, దక్షిణ భారతమునజన్మించిరి. ఈ మహావ్యక్తికీర్తి అరవదేశమునందేగాక తెలుగుదేశమునందును నితరప్రాంతములందును వ్యాపించియుండెను. ఈ అసమాన వ్యక్తితో సుమారు ఇరువదియైదుసంవత్సరములు అనుచరుడనుగానుండి అనేకసభలకుసు, అనేకరాష్ట్ర అఖిలభారతకాంగ్రెసు సమావేశములకును వెళ్లుభాగ్యము నాకు తటస్థించెను. వీరితోసంభాషించుట హృదయాహ్లాదకరముగ నుండుటయేగాక ఎన్నియో నూతనవిషయములు తెలుసుకొన వీలుకలిగినది. వీరికి పట్టుదల, ధైర్యసాహసములు, ప్రజ్ఞ అపారము. వానిగూర్చి నాకు తెలిసినంతవరకు ప్రపంచమునకు వెల్లడింప ప్రయత్నించెదను. శ్రీగాంధీగారితో భిన్నాభిప్రాయము జనించినపుడు నిర్లక్ష్యముగ తన యభిప్రాయమును వెల్లడించి తానెంతో శ్రమపడిన సంస్థయగు కాంగ్రెసును విడనాడిరి. శ్రీగాంధీగారేగాక ప్రముఖు లెందరో వీరిని మరల కాంగ్రెసునందు చేరుడని అనేకముగా ప్రాధేయ పడిరి. కాని శ్రీగాంధీగారితోకలిసి తా నెన్నడు వ్యవహరింప వీలుకాదు కావున అందరి కోరికలు విఫలముగావించిరి. ఈ మహనీయుని జీవితమును వ్రాయుట కష్టసాధ్యము. ఇందు లోపము లున్నచో చదువరులు నన్ను క్షమింతురుగాక ! ఈ పుస్తకము ప్రచురించుటలో శ్రీమా౯గారి కుటుంబమును గూర్చి వివరము లనేకములు శ్రీమతి ఎస్. అంబుజమ్మాళ్ గారివల్ల లభించెను గావున వీరికి నాకృతజ్ఞతను తెల్పుచున్నాను.


మదరాసు

24-2-55

శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఆయ్యంగారి

జీవితము

శ్రీమా౯ అయ్యంగారు 1874 వ సం!! సెప్టెంబరు తే 11 దీన, రామనాథపురమున జన్మించిరి. సామాన్యులైన వీరి తండ్రి శ్రీ ఎస్. శేషాద్రిఅయ్యంగారు ఒక శ్రీవైష్ణవులు. బాల్యమునందేగాక వయస్సు వచ్చిన మీదటఁగూడ కష్టములకుపాలై స్వశక్తివల్ల కుటుంబ వ్యవహారముల నిర్వహించుచుండిరి. ప్రాంభమున పాంబ౯ అమీ౯కోర్టున వీరు ప్లీడరుగ నుండిరనియు, ఆరోజులలో అమీనులకు మేజస్ట్రేటు అధికారము కూడ కలదనియు తెలియుచున్నది. కావున శ్రీ శేషాద్రిఅయ్యంగారు ఒకమోస్తరుగ పాంబనున కాలక్షేపము జరుపుచుండిరి. ఆరోజులలో నీప్లీడర్లు న్యాయశాస్త్రవిద్యగడించి పరీక్షలలో ప్యాసు గావలసిన అవసరములేకుండెను. బుద్దిసూక్ష్మతవల్లను, లోకవ్యవహారములలోని అనుభవమువల్లను, తెలివి తేటలు సంపాదించుకొని చక్కగా మాట్లాడుటకు శక్తియున్నచో కోర్టులలో ప్లీడర్లుగా వ్యవహరింప వీలుండెను. శ్రీ శేషాద్రిఅయ్యంగారుగారికి ఆరవము నందేగాక సంస్కృతమునందుకూడ చక్కని ప్రవేశముండెనని తెలియుచున్నది. ఐరోపీయనుల ఎదుట ఒకమోస్తరుగా సంభాషించుటకు కూడా : వీరికి శక్తియుండెనని తెలియుచున్నది. వార్తాపత్రికలు పుస్తకములు మున్నగువాని నుండి కొన్ని అంశములు తెలిసికొని ఒక మోస్తరుగా ఇంగ్లీషుపుస్తకమును చదువుటను ప్రారంభించిరట. ఐతే ఇంగ్లీషున చేవ్రాలుచేయుటగూడ వీరికి శక్యముగాదట.

స్వయంకృషివల్ల ఇంగ్లీషుపుస్తకము చదవనేర్చిరో కావునను గురువువద్ద శిక్ష లేనందువల్లను వీరి ఆంగ్ల పరిచయము వృద్ధికాలేదు. వీరు కోర్టులలో అరవముననే వాదించుటనుగూర్చి అనేకులు పొగడు చుండుటను విని శ్రీరామేశ్వర పండారసన్నిధికి వీరిని ప్లీడరుగా నియమించెను. శ్రీశేషాద్రిఅయ్యంగారి శక్తిని గుర్తించి వీరిని పిలిపించి శివగంగ జమీ౯కు ప్లీడరుగా నియమించిరి. అప్పుడు రామనాథపురము శ్రీపొన్నుస్వామి దేవరవారికిని, వారి అన్నభార్య యగు జమీందారిణికిని కలతలేర్పడి శ్రీముత్తురామలింగ సేతుపతిగారిని స్వీకారపుత్రునిగావించిన మీఁదట దానినిగూర్చి గొప్పకలతలేర్పడ శ్రీపొన్నుస్వామి దేవరగారు శ్రీశేషాద్రిఅయ్యంగారిని రామ నాథపురసంస్థాన న్యాయవాది గావించిరి. శ్రీపొన్నుస్వామి దేవరగారు మరణించినందున రామనాథపుర సంస్థానకోర్టు వ్యవహారములనేగాక సంస్థానీకుల కుటుంబవ్యహారములను గూడ నిర్వహించుచుండిరి. శ్రీపొన్నుస్వామి దేవరగారి ముగ్గురు కుమాళ్లును మైనర్లగుటచే కనిష్ఠకుమారుఁడు పాండిదొర మేజరై జమీను వ్యవహారముల నిర్వహించుకొనువరకు శ్రీ శేషాద్రిఅయ్యంగారే అన్నిపనుల నిర్వర్తించు చుండిరి. శ్రీపొన్నుస్వామి దేవరగారి కుమాళ్లకు వయస్సురాగానే చాలాకాలము శ్రీశేషాద్రిఅయ్యంగారు కోర్టుపనులు మాత్రము చూచుచుండిరి,

శ్రీ ముత్తురామలింగసేతుపతిగారి స్వీకారకేసున వీరు మొట్టమొదట చెన్నపట్టణమునకు వెళ్లవలసివచ్చెను. చెన్నపట్టణమునకు రాగానే అప్పటి వకీళ్లలో ప్రముఖులైన సర్. వి. భాష్యం అయ్యంగారితోను, సుప్రసిద్ధ బారిస్టరగు శ్రీనార్టనుతోను శేషాద్రిఅయ్యంగారు సంప్రతించుచుండిరి. ఆమీద ఎప్పుడు చెన్నపట్టణమునకు వచ్చినను, నార్ట౯గారికి స్వీకార కేసువిషయమై తెలియ జేయవలసిన అంశములు దెలియజేయుచు నార్టను మున్ననకు పాత్రులైరి. ఈ పైకేసు సలహాదారులుగ నుండుటవల్లనే ప్రబలహైకోర్టు న్యాయవాదియగు సర్. వి. భాష్యం అయ్యంగారు అభిమానమునకు పాత్రులైరి. రామనాథపురసంస్థానము పనిమీద శేషాద్రిఅయ్యంగారు చెన్నపట్టణమువచ్చినపుడెల్ల, సర్. వి. భాష్యంఅయ్యంగారు లక్ష్మీవిలాసమున బసచేసెడివారు.

అప్పుడప్పుడు తల్లినిపోగొట్టుకొనిన అభిమాన పుత్రుడగు శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారును చెన్నపట్టణమునకు వెంటపెట్టుకొని వచ్చెడివారు. శేషాద్రిఅయ్యంగారు 3 పెళ్లిళ్లు చేసికొనిరి. మొదటి భార్యకు సంతానము లేనందున భార్యతో చెప్పకనే దేవాలయమున రెండవపెళ్లిచేసికొని యింటికివచ్చి జ్యేష్ఠభార్యనుపిలచి హారతియివ్వమని చెప్పిరట. మొదటిభార్య దిక్కుతోచక హారతిని సమర్పించెనట. శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారుతల్లి రెండవభార్య, శ్రీమా౯గారి మూడవయేట మరణించెను. ఆమీద మరల మూడవపెళ్లి చేసికొనిరి. ఈ భార్యకు ఎస్. వెంకటేశఅయ్యంగారు రెండవకుమారుడు జన్మించెను. మూడవభార్యగూడ శ్రీవేంకటేశ అయ్యంగారికి మూడేండ్లు పూర్తిగాకముందే మరణించెను గాని శ్రీశేషాద్రిఅయ్యంగారు ఆమీద వివాహప్రయత్నమును మానుకొనిరి. శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారిని పెంచి పెద్దకావించినది. వీరి మేనత్తయగు వృద్ధురాలు. తల్లి లేనిబాలుఁడని తండ్రి చూపు పరామర్శవల్ల మొండిశిఖండిగా శ్రీమా౯ బాల్యమున వర్తించెడివారు. ఈక్షణమున మధుర మీనాక్షీ దేవాలయమునందలి ఏనుగు తమ యింటి వాకిటకు వచ్చినగాని తిండితినను అని పట్టుబట్టిన మీదట తండ్రిగారికిఁ గల ప్రాభవముచే ఆఏనుగు ఇంటివాకిటకు వచ్చుటయు శ్రీమా౯గారు ఆమీద అన్నము తినుటయు జరిగెడిది. శ్రీమా౯ ఏది కోరినను తండ్రిగారు సరఫరాచేయుటవల్ల వీరికి మధురలో ఏర్పడిన పలుకుబడియే కారణమని చెప్పవచ్చును. మధురపురవాసులు దానప్పమొదలి అగ్రహారం శ్రీశేషాద్రిఅయ్యంగార్ అని చెప్పుకొనెడివారు. చెన్నపురిలో శ్రీభాష్యంఅయ్యంగారు బంగళాలో కుమారునితో వీరుబసచేసియున్నప్పుడు రాత్రి 9 గంట లప్పుడు, ఈక్షణమున నాకు బొమ్మ రైలుఇంజను కావలెను అని శ్రీమా౯ అల్లరి ప్రారంభించెను. ఎవరేమిచెప్పినను వినక కేకలువేయుచుండగ వీరివలె అల్లరిసాగించు భాష్యంఅయ్యంగారి అభిమానపుత్రుఁడు దేశికాచారిని శ్రీమా౯ దగ్గఱకు తీసికొనివచ్చి నిలఁబెట్టిరి. శ్రీమానునుజూడగానేఁ దేశికాచారిసాగించు అల్లరిని మానెను. కాని శ్రీమా౯ అల్లరిసాగించుచుండెను. బండిమీద పట్టణముస బజారునకువెళ్లి అంగళ్లువెదకి ఒక బొమ్మ ఇంజనుకొని తెచ్చియిచ్చినమీదటనే రాత్రి 9 గం|| శ్రీమా౯ హఠముచేయుట మానెను. రామనాథపుర సంస్థానపనుల నిర్వహించు చున్నప్పుడు మధురలో కూడా ఒక గృహము నిర్మించుకొని తనకుమారుఁడు. శ్రీమా౯ చదువుసాగుటకు ఏర్పాట్లు కావించెను. ఆమీద కొంతకాలమునకు శ్రీముత్తు రామలింగసేతుపతిగారికిని, శ్రీశేషాద్రిఅయ్యంగారు గారికిని సంస్థానవిషయములఁగూర్చి భిన్నాభిప్రాయములు జనించి కలతలు ఏర్పడగ రామనాథపురసంస్థానముతో పూర్తిగ సంబంధమువదలుకొని, మధురలో స్థిరవాస మేర్పఱచికొని సంస్థానమున వేతనమును గూడ సంపాదింపఁగలిగిరి. మధురలో “దానప్ప మొదలి ” అగ్రహారము శ్రీశేషాద్రిఅయ్యంగారన్నచో, మధురలోని పిన్నలు పెద్దలు వీరిని గౌరవముతో జూచు చుండెడివారు. మధురలో పౌరాగ్రేసరులుగ వ్యవహరించెడివారు. వీరిమాటకు భిన్నమగు అభిపాయమును ఏపౌరులును, మధురలో వీరిమాటకు ఎదురులేదు గావున వీరికున్న ప్రాముఖ్యత వెల్లడియగుచున్నది. ఇంటిలో ఇద్దరు వంటవాండ్రు. వీరి కుటుంబీకులే కాక శివగంగనుండివచ్చు. మిత్రులు బంధువులు మున్నగువారును, వీరి కుమాళ్లకు విద్యనేర్పు ఉపాధ్యాయులును, ఇంక అనేకులు వీరి ఇంటి వద్దనే అన్నపానాదులు సేవించుచుండిరి. మధురలో ఏసభజరిగినను వీరి సలహాప్రకారమే కార్యనిర్వాహకులు కార్యక్రమము సాగించువారు కావున రాష్ట్రకాంగ్రెసు సభలకు విరాళములెగాక, వీరి సలహాలు కూడ లభించుచుండెను. దొడ్డిలోపశువులు, రెండెద్దుల సవారిబండి మున్నగు సౌకర్యములన్నియు శ్రీఅయ్యంగారు కలిగియుండెను. మధురలో రాష్ట్రగవర్నర్లను ఆహ్వానించుటయేగాక వారికి అన్ని మర్యాదలు సాగుటకు తగు ఏర్పాట్లవీరుగావించుచు, సామాన్యులు బీదలు మున్నగు వారి కష్టసుఖముల గవర్నర్లకు తెలియఁజేయుచుండెడివారు.

శ్రీశేషాద్రిఅయ్యంగారుగారి దైవభక్తి అపారము. రోజూ ఉదయము పండితుల దగ్గఱనుంచుకొని నిత్యకృత్యముల తీర్చుకొని ఆమీద రెండుగంటలకాలము శ్రీమద్రామాయణ పారాయణముగావించి యిద్దరు పండితులతో భోజనముచేసెడిపోరు. జప తపాదులు రామాయణ పారాయణము పూర్తియగునప్పటికి 12 గంట లగును గావున ఆమీదనే భోజనము చేసెడివారు. ఉదయము కాఫీ త్రాగుటకుకానీ, ఫలహారముల తినుటకు కానీ వారు ఇష్టపడువారు కారు. పెద్దగొంతుకతో శ్రీమద్రామాయణమును చదువుచుండగా ఇంటియందలి ఆడవారు పిల్లలేగాక. చుట్టుప్రక్కలనున్న పిల్లలుకూడ రామాయణ పారాయణము వినుటకు వచ్చెడువారు. పూజ ముగియగానే అక్షింతలు తులసి పంచకొంగున ముడివేసికొని యుంచుకొనెడివారు. ఎదుట కనఁబడిన పిల్లలకు అందరికినీ నెత్తిన అక్షింతలు చల్లి తులసీదళముతో ఆశీర్వదించెడివారు. ఇంటిలోని పిల్లలు నిద్రపోవుచున్నను వారినెత్తిన పూజాక్షతలను చల్లి దీనితో వారి నిద్రవదలునని చెప్పెడివారు.

ఒకప్పుడు వీరికి జబ్బుచేసి మెడమీద రాచపుండు ఏర్పడెను. ఇంగ్లీషు చికిత్సయందుగానీ ఆపరేషనుల యందుగానీ వారికి నమ్మకములేనందున కాలినడక మీద తిరుపతివెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రార్థన చెల్లించెదనని చెప్పినమీదట పుండు నెమ్మదిగ మానెనట. ఆమీద ఆరోజులలో రైళ్లులేవు గావున కట్టెబండ్లమీద సామానులనేగాక యింటివారి నందఱినీ ఎక్కించుకొని, మార్గమున అక్కడక్కడ ఆగుచు, వంటచేసికొనుచు, కాలినడకమీదనే శ్రీశేషాద్రిఅయ్యంగారు మధురనుండి తిరుపతికి వెళ్లిరి. తిరుపతి చేరువరకు ఒకపూటమాత్రము భోజనము చేయుచు, తులసీదళమును పూజకాగానే ఆరగించుచు, తీర్థముపుచ్చుకొనుచు మరల స్వస్థలము చేరునప్పటికి రాచపుండు మాయమాయెను. ఈసంభ వము నలుగురికిని తెలియుటకుఁగాను తన పేరునకు ముందు 'శ్రీ' అక్షరమును వ్రాసెడివారు. ఇంతేగాక పెద్దకుమారునికి శ్రీనివాస౯, రెండవ కుమారునికి శ్రీవేంకటేశ౯ అని పేరుపెట్టిరి.

చెన్నపట్టణవాసము వీరి కెంతమాత్రము మనస్కరింపదు. ఎటు జూచినను ఆశుద్ది, ఎంగిలి, అనాచారములు, దుర్గంధము, చెన్నపట్టణమున కనఁబడుచున్నందున మధురవదలి ఆఖరురోజులలో ఎచ్చటికీని వెళ్లువారుకారు. శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారు వారికి వయస్సువచ్చి చెన్నపట్టణమున వాసమేర్పఱచికొని కీర్తిగడించినమీదట తండ్రిగారిని చెన్నపట్టణమునకు రమ్మని ఎంత ప్రోద్బలపఱచినను మధురను వదలి ఎచ్చటకు రానని నిష్కర్షగా చెప్పిరి. కుమారుని పైనున్న అభిమానమువల్ల సంవత్సరమున కొకమారు చెన్న పట్టణమునకువచ్చి నెలరోజులు మైలాపూరున కుమారునితో నుండెడివారు. శ్రీమా౯ అయ్యంగారు వీరికుటుంబముతో చెన్నపట్టణముననేయుండి, వేసవిసెలవు లప్పుడు మధురలోనుండుట అలవాటు. మధురలోని యింటిలోనుండుట శ్రీమా౯గారికే గాక వీరి కుటుంబీకులకుగూడ సంతృప్తి గలిగించు చుండెను. ఆయింటి నల్లచేవగుంజలు, చిత్రించిన తలుపులు, తెల్లని సున్నపుగోడలు, బయట ఎండబాధ, యుండినను ఇల్లు చల్లగానుండుటయు మున్నగు అంశములఁగూర్చి శ్రీమా౯ ప్రశంసించెడివారు. రాత్రులలో మధురలోని బిచ్చగాండ్ర కేకలవల్ల అనేకులకు నిద్దురచేటు ఏర్పడుచుండెను. మధుర వీథులలోని జలదారులకంపు, గాడిదలకూతలు అందరికి తెలిసినదేను. ఇటీవల పరిస్థితి మారినదని తెలియుచున్నది. శ్రీశేషాద్రిఅయ్యంగారు మధురనుండి రామనాథపురమునకు రాకపోకలు సాగించు రోజులలో వీరు ఒకదంతపు పల్లకీన ప్రయాణము సాగించెడివారు. ఆ పాతపల్లకి చాలకాలము మధురలోని యింటిలో నుండియుండెను. మధురవదలి శ్రీమా౯ వారికుటుంబము మదరాసునకు వెళ్లునపుడెల్ల తండ్రిగారు కుమారునికి నూతనవస్త్రములు తెప్పించి యిచ్చెడివారు. ఆరోజులలో మధుర చీరెలకు ప్రసిద్దియుండెడిది. కావున కొన్నిసమయములందు ఎంతధరయైనను ఇచ్చితెప్పించి యీ చీరల శ్రీమా౯ కుటుంబమునకు ఇచ్చెడివారు. కావున స్వదేశీబట్టలపై వీరికి ఆదరణ హెచ్చని తేలియుచున్నది.

ఒకప్పుడు శ్రీశేషాద్రిఅయ్యంగారు చెన్నపట్టణము వచ్చియున్నప్పుడు అనగా 1903 సం||న ఆఖిలభారతకాంగ్రెసు సమావేశము తటస్థించెను. శ్రీమా౯గారు కాంగ్రెసు మహాసభకు వెళ్లుటకు సిద్ధమగుచుండగా వారి తండ్రిగారు తాము గూడ సభకు వచ్చెదమని పట్టుబట్టిరి. వీరివద్ద నొక ట్రంకుపెట్టె యుండెడిది. ఇందు ఒక పాత ఆల్‌పాకా లాంగ్‌కోటు, సరిగెధోవతి, అంగవస్త్రము, చాకలి మడతవిప్పని ఒక జలతారు అంగవస్త్రము, ఒక షర్టు మున్నగునవి యుండెడివి. వీరు రామనాథపుర సంస్థాన ప్లీడరుగా నున్నరోజులలో ధరింపఁబడు దుస్తు లివి యని తెలియుచున్నది. ఈదుస్తుల ధరించుకొనియె వీరు పైకి వెల్లెడివారు. నల్ల ఆల్‌పాకా కోటుమీద సరిగపంచెను ఎడమప్రక్క వ్రేలాడవేసికొని దానిమీద ఒక జలతారు ఎఱ్ఱ శాలువను మడతవిప్పక ఎడమభుజముపై ధరించెడివారు. ఎఱ్ఱసరిగపాగా, ముఖమున ఊర్థ్వపుండ్రములు, చెవులలో సీమకమలములపోగులు పై జేబిలో బంగారు గడియారము, చేతిలో వెండిపొన్నుకఱ్ఱ , కాలిలో కాన్పూరు పాదరక్షలు ఇవన్నియు తగిలించుకొనునప్పటికి గంటసేపు పట్టెడిది. ఇంటిలో చిన్నపిల్లలు 'శేషాద్రిఅయ్యంగారు దుస్తులధరించుట చూచి నవ్వెడివారు. ఆల్పాకాకోటున నచ్చటచ్చట రంధ్రము లుండెడివి కావున 'శ్రీమా౯వలె ఏల షరాయి, బూట్సు తగిలించుకొని బయలుదేరరాదు' అని ఎవరైనా చెప్పినప్పుడు తాను పూర్వకాలపు మనిషియనియు, వృద్ధుఁడననియు, పాతదుస్తులే తనకు సంతృప్తి గలిగించుననియు చెప్పిడివారు. దుస్తుల ధరించుకొని బయటకు వెళ్లుటకు సిద్ధపడగానే కుమారులు శ్రీమా౯గారు కాంగ్రెసు సమావేశమునకు రావద్దని చెప్పుతూ ముందువలె సభ నెమ్మదిగా జరగదనియు సూరత్‌నందువలె అల్లరి యేర్పడుననియు తండ్రిగారు ఇబ్బందిపడుదురనియు చెప్పెను. కానితండ్రిగారు శ్రీమా౯గారిమాటను వినక కాంగ్రెసు సమావేశమునకు తాను తప్పక వెళ్లవలెనని పట్టుబట్టుచు, అల్లరిలో నీవు తగుల్కొన్నప్పుడు నేనేల యింటిలోపడియుండవలెనని చెప్పిరి. సూరత్ అల్లరిలో శ్రీమా౯గారే గాక యనేకులు చిక్కుపడిరి. కాని వీరితండ్రి వీరిమాటలు వినలేదు.

తనకుమారుఁడు మధురలోనే న్యాయవాదిగ నుండి యగ్రేసరుఁడై కీర్తిగడించుటయేగాక యపారధనము సంపాదింపవలయుననియుగూడ నప్పుడప్పుడు శేషాద్రిఅయ్యంగారు చెప్పెడివారు. కాని కుమారుఁడు శ్రీమా౯ చెన్నపట్టణమున తప్ప ఏన్యాయవాదియు ఉత్తమశ్రేణికి రానువీలుకాదు కావున, ధనమార్జించుటకు గూడ హైకోర్టున నవకాశములు హెచ్చనియు చెప్పినమీఁదట తండ్రిగారు కుమా రుని ప్రోద్బలపఱచరైరి. శ్రీశేషాద్రిఅయ్యంగారు గారికి మరణించునపుడు 85 సం!! కాని ఎన్నడును ప్రాతఃస్నానము, పూజాపునస్కారములు, శ్రీమద్రామాయణ పారాయణము మున్నగువాని ముగించుకొని ఆమీద భుజించువారు. ఆఖరుదశలో 2 సం||లు, బయటికి వెళ్లుటమాని 1916 సం!! ఏప్రెలులో ఒకరోజు పూజాపునస్కారములు పూర్తిచేసికొని భోజునముచేసి ఆమీద పడకపై విశ్రమించుచుండగా రొమ్మున బాధకలిగి వెంటనే ప్రాణమును గోల్పోయిరి. శ్రీమా౯ ఎచ్చటనున్నను వారే తన అంత్యక్రియలు నిర్వహింపవలెనని తండ్రి చెప్పుచుండెడివారు. కావున చెన్నపట్టణమున మైలాపూరునకు మధ్యాహ్నము 2 గం||కు వీరి మరణవార్తను తెలుపు తంతి వచ్చెను. అప్పటికి కొద్దిరోజులకు ముందే శ్రీమా౯ గారు ఆడ్వకేటుజనరలు పదవిని స్వీకరించిరి. రాత్రి బయలుదేరి రైలున వెళ్లినచో నాలస్యమగునని స్పెషలు రైలున మధురకు ప్రయాణమైరి.

శ్రీమా౯ అయ్యంగారు బాల్యమున రామనాథపురమున నొక వీధిబడిలో అరవము చక్కగ నేర్చికొనిరి. 1880 సం|| మధురకు రాగానే యచ్చటి హైస్కూలునచేరి ఆంగ్లవిద్య గడించిరి. ఆమీద రెండుసంవత్సరములు మధురకాలేజిలో చదివిరి. ఈ రోజులలో వీరితండ్రి పలుమారు చెన్నపట్టణము వెళ్లి వచ్చెడివారు. సర్ . వి. భాష్యంఅయ్యంగారింట తన యభిమానపుత్రుఁడగు శ్రీమా౯తో బసచేసినప్పుడు భాష్యం అయ్యంగారింటివారు 'మధుర అల్లుఁడు వచ్చెను' అని చెప్పెడివారట. భాష్యం అయ్యంగారే గాక శ్రీశేషాద్రిఅయ్యంగారుకూడ శ్రీమా౯గారికి పెండ్లిచేయవలెనని యభిప్రాయపడిరి. మధురలో కొందఱుపిల్లల శ్రీమా౯గారికి కనఁబఱచిరి. కాని శ్రీమా౯ పట్టుపట్టి వి. భాష్యం అయ్యంగారి కుమార్తె శ్రీరంగనాయకమ్మను వివాహమాడవలెనని పట్టుబట్టెను. ఈ సంబంధము అందఱికిని తృప్తికలిగించునని తలచిరి. శ్రీశేషాద్రి అయ్యంగారుమాత్రము భాష్యంఅయ్యంగారి కోరికను సఫలముగావించినచో కుమారుఁడు చెన్నపట్టణ వాసియగునని కొంతకాల మాలోచించిరి. కాని కుమారుని పట్టుదలవల్ల తండ్రిగారు తన యభిప్రాయమును మార్చుకొనిరి. వివాహమగునప్పటికి శ్రీమా౯ గారికి వయస్సు పదహారు సంవత్సరములు శ్రీరంగనాయకమ్మగారికి ఏడేండ్లు కాని యీ వివాహము అతి వైభవముగ జరిగెను. శివగంగ, మధుర, రామనాథపురము జిల్లాలనుండి బంధువులేగాక పరిచితు లనేకులు ఈవివాహమునకుగాను చెన్నపట్టణమునకువచ్చిరి కావున వివాహమంటపమున ముహూర్తమునాడు వేయిమందికి పైగా అతిథులు వచ్చియుండిరని తెలియుచున్నది.

ఎఫ్. ఏ. పరీక్షకాగానే, బి. ఏ. పరీక్ష చదువుటకు శ్రీమా౯గారు చెన్నపట్టణమునకు వచ్చి ప్రెసిడెన్సీ కాలేజిలో చేరిరి. మామగారగు శ్రీభాష్యం అయ్యంగారి బంగళాలో బి.ఏ. పరీక్షకు చదువునప్పు డుండెడివారు. బి. ఏ. పరీక్షలో ఆర్థికశాస్త్రము, చరిత్ర, చక్కగ చదివి, బి. ఏ. పరీక్షలో ఇంగ్లీషు నందును ఆర్థికశాఖయందును యూనివర్సిటీన ప్రథములుగా నుత్తీర్ణులైరి. కావున మూడునాలుగు బంగారు పతకములు వీరికి లభించెను. ప్రెసిడెన్సీ కాలేజి విద్యార్థిగనున్నపుడు సర్. టి. విజయరాఘవాచారి, శ్రీ జి. ఏ. నటేశఅయ్యరు, శ్రీ కె. వ్యాసరావు మున్నగువారు వీరితో చదువుకొనెడి వారని తెలియుచున్నది. అప్పటి వీరి ప్రజ్ఞనుగూర్చి సర్. టి. విజయరాఘవాచారిగారు స్వదేశమిత్ర౯ పత్రికలో నీ క్రిందియంశముల వ్రాసియున్నారు. "1892-93-వ, సం||లో శ్రీ శ్రీనివాసయ్యంగారు మాతో ప్రెసిడెన్సీకాలేజి విద్యార్థిగనుండిరి. వీరి ప్రతిభను చూచి తరగతిలోని విద్యార్థులందఱును దిగ్భ్రమ చెందెడివారు. కొందరితో వారు కలసి మెలసి వర్తించుచున్నను వీరికి అహంభావము కలదని కొందఱు తలచెడివారు. కాలేజీలో చదువుచున్నరోజులలో తటస్థించిన యొక సందర్భమునుగూర్చి చెప్పుట యావశ్యకమని తలచెదను. మాకాలేజి ప్రిన్సిపాల్, నేను, శ్రీనివాసఅయ్యంగారు, లైబ్రరీలోనుండగా తిరువాన్కూరు మహారాజావారిని మేమున్నచోటికి వెంటఁబెట్టుకొని వచ్చిరి. అచ్చటనున్న విద్యార్థులందఱును లేచి నిలచిరి. కాని మే ముభయలము లేచినిలవక ఏదో పుస్తకము చదువుకొనుచుంటిమి. మేము ఇతరులు చెప్పునట్లు వ్యవహరించువారము కామనియు, స్వతంత్రులమనియు ప్రిన్సిపాలుగుర్తించి మమ్ము మందలింపరైరి."

ఆరోజులలో శ్రీమా౯గారికి ఇంగ్లాండువెల్లి ఐ. సి. ఎస్. పరీక్షకు చదువుటకు కోరికయుండెడిది. కాని తండ్రిగారు శేషాద్రిఅయ్యంగారు తాను బ్రతికియున్నంతవరకు సముద్రయానము సాగింపరాదని నిష్కర్షగా చెప్పినందుచే తాను విదేశములకు అప్పట్లో వెళ్లనని వాగ్దానము చేసెను. బి. ఎల్. పరీక్షకు చదివి ప్యాసయి న్యాయవాదిగ కాలము గడపుటలో ఆరోజులలో శ్రీమా౯ గారికి ఇష్టము లేకుండెను. మైసూరు సివిల్ సర్వీసు పరీక్షకు దర ఖాస్తుపెట్ట యత్నించిరి కాని తండ్రిగారు వకీలుగా నుండుమని ప్రోద్బలపఱచినందుచే బి. ఎల్. పరీక్షకు చదువుటకు ప్రారంభించిరి. హిందువులకు ధర్మరక్షార్థ ప్రకారము నాలుగాశ్రమములు నిర్ణయింపబడియున్నవి. మనపూర్వీకు లీనాలుగాశ్రమ నిబంధనలకు బద్ధులై వ్యవహరించినట్లే శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారు జీవితమునుగూడ నాలుగు ఘట్టములుగ విభజించుట సమంజసమని తోచుచున్నది. ప్రెసిడెన్సీ కాలేజి, లాకాలేజీలలో విద్యార్థిగానుంటూ మామగారగు భాష్యంఅయ్యంగారి యింటిలో చదువుసాగించుట యొకఘుట్టము. ఆమీద సుప్రసిద్ధన్యాయవాదియై, షరాయి, బూట్సు తగిలించుకొని సింహ గర్జనములతో హైకోర్టునవాదించుట, అపాఱధనమును సంపాదించుట రెండవఘట్టము. ఆమీద అడ్వకేటు జనరల్‌పదవిని విసర్జించి కొన్నిసంవత్సరములకు శ్రీగాంధీగారి సహాయనిరాకరణోద్యమమున పాల్గొనుచు ఖద్దరుదుస్తులధరించి అరవరాష్ట్రమంతయు, అరవమునప్రసంగించుచు ప్రచారముగావించి ఎంతోశ్రమపడి సంపాదించినసొమ్మును వ్యయపఱచుచు కాలముగడుపుట యొకఘట్టము. చివరకు శ్రీగాంధీగారి నాయకత్వమును ఎదుర్కొని కాంగ్రెసునువదలి ఇంటివద్దనే రేయింబవళ్లు, ఏదో చదు వుచు కాలముగడపుట యొకఘట్టము. ఈరోజులలో ప్రముఖులెంద రెంతచెప్పినను శ్రీగాంధీ యభిప్రాయముతో నేకీభవించననియు గాంధీ కాంగ్రెసు నాయకుఁడనియు, అందుచే కాంగ్రెసునచేరననియు చెప్పుచుండెడివారు. శ్రీభాష్యంఆయ్యంగారి కుటుంబమున శిష్టాచారమునకు ఏలోషము లేనట్లే శ్రీశేషాద్రిఅయ్యంగారి కుటుంబమువారుకూడ శిష్టాచారసంపన్నులుగా నుండుటలో ఆశ్చర్యము కనుపడదు. శ్రీమా౯ మామగారి యింటియందు విద్యార్థిగానున్నపు డితరు లెవరితోను మాట్లాడెడివారు కారు. రేయింబవళ్లు పుస్తకకాలక్షేపము చేయు చున్నందున మామగా రొకప్పుడు వకీలుగ ధనమార్జింపఁదలచినచో మౌనముగా నుండుటతగదని హెచ్చరించెడివారు. భాష్యంఅయ్యంగారింటి వారందఱును శ్రీమా౯ ఒక విచిత్రవ్యక్తియనిచెప్పెడివారు. ఇట్టి శ్రీమా౯ కొంతకాలమువరకు తనయింట కెవరువచ్చినను వారు మాట్లాడుట కవకాశ మివ్వక గంటలకొలది తానే మాట్లాడుట అనేకుల కాశ్చర్యము కలిగించుచుండెను. 'అంజద్ బాగ్‌' బంగళావసారాలో నిటునటు తిరుగుచు వచ్చెడి వారితో మాట్లాడెడివారు. వీరివెంబడి గంటలకొలది వీరిమాటలవినుచు నిటునటు తిరుగువారు. కొంతసేపటికి నైదారుమైళ్లు నడచినట్లు భావించెడివారు. వచ్చినవారు సెలవుపుచ్చుకొని వెళ్లుచుండినను, బంగళాగేటువరకు మాట్లాడుచు వారినివెంబడించెడివారు. ఒక్కొక్కప్పుడు బయటకి వెళ్లుటకు మోటారుకారు రాగానేయొకకాలు Foot Board మీఁదను, మఱొకకాలు బంగళామెట్లమీదను నుంచి యరగంటసేపు మాట్లాడెడివారు. కాని ఎల్లప్పుడు వీరిమాటల వినుటకు ఎందరో ఆతురతతో శ్రీ శ్రీమా౯ గారి బంగళాకు వచ్చెడివారు. కాంగ్రెసుతో సంబంధమువదలినమీదట ఒక స్నేహితుఁడు వీరిని సందర్శింపతలచితిననిచెప్పెను. 'వారువచ్చుపని నాకుతెలియును గావునను నామనస్సును మార్చుటకు నాకు శక్యముకాదు కావునను నన్ను సందర్శించుటవల్ల నేమియు లాభముండదనిచెప్పిరి' ఆ మిత్రుడీ మాటలవినక ఒకరోజు ఉదయము 8 గం|| లకు శ్రీమా౯గారిని సందర్శించుటకు 'అంజద్ బాగ్‌' నకువచ్చి 8 గం|| మొదలు 12 గం|| వరకు కాచియుండిరి. డ్రాయింగురూములో 4 గం!! కాలము వీరొకే ధోరణితో మాట్లాడిన పిమ్మట నామిత్రుడువెళ్లగనే జడివాన వలిసెనని కొందఱు తలంచిరి. వచ్చినమిత్రుడు తనపని సానుకూలము కాకపోయినసు 'ఈరోజొక శుభదినముగా భావించు చున్నామని'చెప్పివెళ్లిరి. శ్రీమా౯వంటి మహనీయుని మాటలవినుటకు తమ కింతకాలమున కవకాశము కలిగెననియుచెప్పిరి. వారిమాటలలో వెలిబుచ్చునభి ప్రాయములు బుద్దితీక్ష్ణతను కనబఱచు నెన్నియో నూతనాంశముల వెల్లడించునుగావున శ్రీమా౯ గారి మాటలకు విలువహెచ్చని గుర్తింపవలెను. వీరు శ్రద్ధతోచదివి గుర్తించినయంశముల నెన్నిటీనో విమర్శతో చెప్పెడివారు. హెచ్చుగ చదువుటవల్లనే వీరిప్రజ్ఞ క్రమేణవృద్ధియాయెను.

శ్రీమా౯గారు F. L. షరీక్షకు చదువునప్పుడు మామగారగు శ్రీ భాష్యంఅయ్యంగారి పలాతోపు ఇంటిలో వాసమేర్పఱచుకొనిరి. వారి కప్పుడు ఇరువదిరెండేండ్లప్రాయము వారి భార్య పదునైదేండ్ల ప్రాయము మధురనుండి తండ్రిగారు ఇంటిభోజన ఖర్చులకై వందరూపాయలు ప్రతినెల పంపెడివారు. ఈసొమ్ము దగ్గఱనుంచుకొని జాగ్రత్తగ ఖర్చుబెట్టుచు చదువుచుండెడివారు. ప్రతినెలపై వందరూపాయ లేవిధముగా ఖర్చాయెనను లెఖ వివరముల తండ్రిగారికి తెలియఁజేసెడివారు. వీరితండ్రిగారు ఒక్క దమ్మిడి ఖర్చుబెట్టుటకు ఆలోచించెడివారు. కావున వారికి నసంతృప్తికలుగు ఖర్చుల గావించెడివారు కారు. శ్రీమా౯గారు B. L. పరీక్ష ప్యాసుకాగానే మామగారగు సర్. వి. భాష్యంఅయ్యంగారివద్ద వారి పెద్దల్లుఁడు దివా౯బహదర్ శ్రీ సి. ఆర్. తిరువేంకటాచారి, శ్రీ వి. వి. శేషాచారి, సర్, వి. సి. దేశికాచారి, యస్. గోపాలస్వామిఅయ్యంగారు మున్నగువారు జూనియర్లుగానుండిరి. శ్రీమా౯ గారికన్న న్యాయవాదవృత్తిలో సీనియర్లు. వీరేగాక మఱి కొందరు జూనియర్లుగూడ భాష్యంఅయ్యంగారి కచ్చేరీలోనుండెడివారు. సర్. వి. భాష్యంఅయ్యంగారు బుద్ధిసూక్ష్మత, అసాధారణప్రజ్ఞ, హిందూ న్యాయశాస్త్రమున ససమానప్రతిభ కలిగియున్నందువల్ల మదరాసుహైకోర్టు న్యాయవాదులలో నగ్రస్థానము వహింపగల్గెను. కాని శ్రీమా౯గారి తండ్రి కనబడినపుడు తనకంటె శ్రీమా౯ తెలివితేటలు గలవాఁడని చెప్పెడివారు. మామగారు ఊత్తుమలై జమీ౯కేసు, విజయనగరము పిఠాపురము మున్నగు సంస్థానకేసులలో పనిచేయుచున్నప్పుడు శ్రీమా౯గారుకూడ మామగారికి జూనియరుగా ఆతిశ్రద్ధతో పనిజేసెడివారు. కాని కొంతకాలమునకు జూనియరుగా నుండుటమాని స్వేచ్ఛగా కేసులవాదించుటకే ప్రారంభించిరి. ఆమీఁద కొంతకొలము శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరుగారితో కొన్ని గొప్పకేసులలో పనిచేసిరి. అప్పట్లో శ్రీ పి. ఆర్. సుందరయ్యరు శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరులు మదరాసు హైకోర్టున ప్రబల సీనియరు వకీళ్లుగా నుండిరి. శ్రీమ౯గారి భార్యపై భాష్యంఅయ్యంగారికి అభిమానము హెచ్చుగనున్నందుచే నామె ఎదికోరినను భాష్యంఅయ్యంగారు లేదన్నరైరి. ఊత్తుమలై జమీ౯ కేసులో వాదిప్రతివాదు లిద్దఱును, శ్రీభాష్యంఅయ్యంగారే కేసులునడపవలెనని తొందరబెట్టిరి. కాని భాష్యమయ్యంగారునకు దిక్కుతోచకయున్న స్థితిలో ఊత్తుమలై జమీ౯దారిణి శ్రీమా౯గారి భార్యవద్దకు వచ్చి తమవైపు హైకోర్టున శ్రీభాష్యంఅయ్యంగారు వాదింపవలెసని ప్రాధేయపడెను. శ్రీమా౯గారిభార్య ప్రోద్బలమువల్ల ఆమె కోరికను సఫలముచేయుచు ఈకేసున కొన్నిరోజులు హైకోర్టున వాదించి జయమొందిరి.

శ్రీభాష్యంఆయ్యంగారు రెండు గుఱ్ఱములబండిలో శ్రీమా౯గారింటివద్దకు వెళ్లి వారికుమారుని కుమార్తెనుసముద్రఫుటొడ్డునకు తీసికొనివెళ్లెడివారు. మార్గమున తినుటకు ఏదైన వీరి కిచ్చెడివారు. బాల్యమున శ్రీమా౯ కుమార్తె అంబుజమ్మాల్ మాటకారి యని కొందఱు తలచెడివారు. తాతగారగు భాష్యంఅయ్యంగారి బంగళాకు ఒకప్పుడు వెళ్లినప్పుడు తన అవ్వసు చూచుచు తలవెండ్రుకలు తెల్లపారిన మీదట నగలెందుకు ధరించుచున్నావని ప్రశ్నించినందుకు తాతగారగు భాష్యంఅయ్యంగారు నవ్వుచు నీనగ లన్నింటిని మూలపడవేయవలయునని చెప్పిన మొదట చుట్టుప్రక్కల నున్న వారందఱు నవ్విరట. 1908 సం||న సర్. వి. భాష్యంఅయ్యంగారు మరణించిరి..

మదరాసు హైకోర్టున సీనియరు వకీలుగానుండిన శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరుగారు రాష్ట్ర గవర్నరు నిర్వాహక సభాసభ్యులుగ నియమింపఁబడిరి. శ్రీపి. ఆర్. సుందరయ్యరుగారు హైకోర్టు జడ్జిపదవిని అధిష్టించిరి. అప్పుడు శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు మదరాసు హైకోర్టున ప్రబలసీనియరు వకీలుగ పరిగణింపఁబడిరి. వీరితోఁబాటు శ్రీ కె. శ్రీనివాసఅయ్యంగారు కూడ పైకి. రాగలిగిరి కావున వీ రుభయులు గొప్పకేసులలో న్యాయవాదులుగ వ్యవహరించెడివారు.

1909 సం||ఏప్రెలున భారతరాజ్యాంగ సంస్కరణల గూర్చిమదరాను Advocates Association ఒక చక్కనియుపన్యాసము సాగించిరి, ఈ యుపన్యాసములను ఆమీద పుస్తకరూపమున ప్రచురించిరి. కాలానుసారముగా పరిస్థితులు మారును గావున శాసనములలో నప్పుడప్పుడు సవరణ లావశ్యకమని వీరు చెప్పుచుండెడివారు. హిందూలాన అనేక సందిగ్ధాంశములు కలవు గావున భారతీయులు పైకి రావలె నన్నచో మతము నిబంధనలపై నాథారపడక స్వేచ్చగా శాసనములో నవసరమైన మార్పుల గావించి తీరవలెనని చెప్పెడివారు. హిందువుల సాంఘిక కట్టుదిట్టములతోగాని మతసంబంధమైన ఏర్పాట్లతోగాని బ్రిటిషుప్రభుత్వ మేలాటి సంబంధము కలిగించుకొనదని వెల్లడించినందుచే భారతీయుల పురోభివృద్ధికి అంతరాయము కలిగెనని శ్రీమా౯ అభిప్రాయపడెడివారు.

మైలాపూరు పలాతోపు ఇంటిలో 6 సం|| శ్రీమా౯ కాపుర ముండిరి. వీరు న్యాయవాదవృత్తిలో ప్రాముఖ్యత సంపాదింపఁగనే, ఉత్తరమాడవీధిలోనున్న మామగారియింటిలో వాసమేర్పఱచుకొనిరి. వీరిభార్యకు చదువు తక్కువ యయినను అనేక అరవపుస్తకముల నింటిలో చదివి యందు కొంత పాండిత్యమును సంపాదింపఁగల్గిరి. శ్రీమా౯గారిభార్య ఆంగ్లభాషా పరిచయము కలిగియుండవలెనని తలచి ఒక ఆంగ్ల ఉపాధ్యాయుని నియమించి మాట్లాడుటకు చక్కగ చదువుటకును, చదివి యర్థముచేసికొనుటకును, ఏర్పాట్ల గావించిరి. ఆరోజులలో కుటుంబముతో కూనూరునకో, ఉదకమండలమునకో వేసవి సెలవు లలో శ్రీశ్రీమా౯గారు వెళ్లుచుండెడివారు. కొంతకాల మున్నతప్రదేశమున వాసమున్నందుచే ఆరోగ్యము చక్కపడునని యితరులవలెనెవీరు భావించెడివారు. కొంతకాలమునకు కోడైకెనాలులోని 'శ్రీనికేతనం బంగళాన' వాసముండుట వీరికి సంతృప్తి కలిగించుచుండెను. ఏటేట ఈ బంగాళాలోని కొన్ని గదుల చక్కజేయించుటయు, బంగాళా వెంబడిచుట్టు బ్రహ్మాండమైన తోటవేయించుటయు వీరికి వేసవిసెలవులలో కాలముగడపుమార్గముగ కనఁబడెను. చిన్న అంశములనుగూడ పనివాండతోకలిసి చర్చించి పనుల నిర్వహించు చుండెడివారు. ఆఖరుదశలో కోడైకెనాలులోనే కాలము గడుపవలెనని వీరు చెప్పెడివారు. శ్రీ నికేతనపుబంగళా చుట్టుప్రక్కలలో చలిహెచ్చు గావున దీనికన్న కొంత క్రిందనున్న పెరుమాళ్ మలై యనుచోట మఱొక బంగళాను నిర్మించుకొనిరి. వీరి బాల్యస్నేహితులు మధురవాసులునగు శ్రీ కె. ఎస్. అయ్యావయర్, శ్రీ సీతారామయ్యర్, మైలాపూరునందలి శ్రీ వి. సి. శేషాచారి, శ్రీ జీవాజీరావు మున్నగు వకీళ్లు వీరి యింటి కప్పుడప్పుడు వచ్చుచుండెడివారు. చాడ్ ఫీడ్ సుబ్రహణ్య అయ్యరుగారు శ్రీమా౯గారింటిలో పలుమారు సమావేశమై పేకాట ఆడెడి వారు. వీరందఱికిని శ్రీమా౯గారిభార్య వేడికాఫీ పంపెడివారు. ఆరోజులలో శ్రీమా౯గారు గుఱ్ఱపుబండిమీద కోర్టుకు వెళ్లెడివారు. కోర్టునుండిరాగానే దుస్తుల మార్చుకొని మైలాపూరి క్లబ్బునకువెళ్లి అచ్చట Billiards ఆట ఆడెడివారు. క్లబ్‌నుండిరాత్రి 9 గం||కు ఇంటికి వచ్చెడివారు. ఆరోజులలో ఎలక్ట్రిక్ దీపములు, మోటారుకారులు ఒకటిరెండు మాత్రమే మదరాసున కనబడుచుండెడివి. కావున కాలినడకమీదనే క్లబ్బునకు వెళ్లెడివారు. రాత్రి వీరిని ఇంటికి పిలుచుకొనివచ్చుటకు లాంతరుతో ఒక జమానును వీరిభార్య క్లబ్‌నకు పంపుచుండెను. శ్రీమా౯గారికి అరవమునందేగాక తండ్రివలెనే సంస్కృతమునందు గూడ పరిచయముండెను. కావున నప్పుడప్పుడు బాల్యమునందువలెనే అరవనపుస్తకములనేగాక వ్యాఖ్యానము, టీకయున్న సంస్కృతలు గ్రంథములనుకూడ చదివెడివారు. వైదికులు, పండితు వీరిని సమీపించినపుడు వారు సంభాషించు సంస్కృతభాషలోగాని, వారుదహరించు శ్లోకములందుగాని లోపము లున్నచో వెంటనే వాని సవరించెడివారు.

ఆంగ్లవిద్యలో నారితేరిన మనప్రముఖులనేకులు ఫ్రెంచిభాష నేర్చుకొనేడువారు గావున వీరును నొకఫ్రెంచి యథ్యాపకునివద్ద ఫ్రెంచిభాషనేర్చుకొని యామీద నాభాషలోని యుద్గ్రంథములను రాత్రులలో చదివెడివారు. బాల్యమున నాంగ్లకవిత్వము చెప్పుటకు వీరుయత్నించిరని వీరి స్వహాస్తముతో వ్రాసియుంచిన కొన్ని కాగితములవల్ల తెలియుచున్నది. కాని వీనినన్నిటిని వీరు మరణించుటకు ముందు చింపిపారవైచిరి. వీరికి కళలయం దభిమానము సున్న. సంగీతకచ్చేరీలకుగాని, నాటకములకుగాని, సినిమాలకుగాని వీరు వెళ్లెడువారుకారు. ఇంటిలోని వారిని వీనికి వెళ్లరాదని చెప్పెడివారు. ఎన్నడైన వీరి కుటుంబీకులు రాత్రి, ఏదైన సినిమాకో, నాటకమునకో వెళ్లినచో నిద్రమానికేకలువేయుచు బంగళా వసారాన నిటునటు తిరుగుచు నిద్రమాని యింకను ఇంటివారు రాలేదేయని నౌకరులతో మొఱబెట్టుచుండెడివారు. శ్రీమా౯గారి కుమారుఁడు, కుమారై రాత్రులలో బయటికి వెళ్లినపుడు భార్యను బాధపెట్టెడివారు. కావున అందఱును బయటికి వెళ్లుట మానవలసివచ్చెను.

వీరు మైలాపూరు ఉత్తరమాడవీధిలో నున్నపుడు వకీలువృత్తిలో అపారధనమును సంపాదించు చుండిరి. వీరివద్ద ననేకులు అప్రెంటీసులుగానుండి గొప్ప న్యాయవాదులగుటయే గాక ప్రజాసేవలో ప్రాముఖ్యతకువచ్చిరి. రావుబహదూర్ కే. వి. కృష్ణస్వామిఅయ్యరు, శ్రీసుందరరాజఅయ్యంగారు, శ్రీ కె. భాష్యంగారు, శ్రీ గణేశఅయ్యరుగారు, శ్రీ సంపత్కుమారఅయ్యంగారు, శ్రీ ఎస్. వి. నారాయణఅయ్యరు మున్నగువారు వీరివద్ద అప్రెంటీసులుగానుండిరి. మొట్టమొదట అఫ్రెంటీసుగాచేరి ఆమీద చాలకాలము వీరి జూనియరువకీలుగానుండిన శ్రీ కే. రాజాఅయ్యరుగారు క్రమేణ గొప్పవకీలై అడ్వకేటుజనరల్ పదవిని సంపాదింపగల్గిరి.

ఒరిజనలుసైడున వకీలుగా నెలకు ఏడెనిమిదివేలు గడించుచు హైకోర్టు జడ్జిపదవి యధిష్ఠింపనున్న శ్రీ ఎస్. దొరస్వామిఅయ్యరుగారు అన్నిటిని త్యజించి పుదుచ్చేరియందలి శ్రీ అరవిందాశ్రమము చేరిరి. శ్రీమా౯వద్ద అప్రెంటీసుగానున్న శ్రీ దొరస్వామిఅయ్యరుగారు (సంగీత విద్వాంసులు) ముత్యాలపేట శ్రీ త్యాగయ్యగారి మనుమలు గావున సర్వమును పరిత్యజించుటలో ఆశ్చర్యములేదు. కాని వీరి యీవర్తన శ్రీమా౯గారికి మాత్రము మనస్కరించినదికాదు.

చెట్టినాడునుండి, మధుర రామనాథపురజిల్లాల నుండి కేసులపట్టుకొని నాటుకోటశెట్లు వారి గుమాస్తాలు, వారి ఏజంట్లు శ్రీమా౯గారివద్దకువచ్చినప్పుడు వారందరు శ్రీమా౯ బంగళావద్దనే బసచేసెడి వారు. కేసు జయమొందునని తనకుతోచునట్టి కేసునే వీరుచేపట్టెడివారు. కేసున సాక్ష్యములే దనియు, ఈకేసు తప్పకత్రోసివేయఁబడుననియు కక్షిదారులతో చెప్పి అపీలుగావించి వృథాగా డబ్బు ఖర్చుపెట్టవలదని సలహాచెప్పెడివారు. వీలైతే ప్రతి వ్యవహారము రాజీగావించుటయేమేలని అనేక సందర్భములలో కక్షీదారులకు సలహాచెప్పెడివారేకాని, ఏపాడు కేసునైనా దాఖలుచేసి ఒకద్రవ్యమే నార్జింపవలెననెటి నీచము శ్రీమా౯కు ఉండెడిదికాదు. ఒకప్పుడు ఒక శ్రీమంతుడు తనకేసును శ్రీమా౯పుచ్చుకొని అపీలు దాఖలుచేసి నడపవలెనని నిర్బంధపఱచెను. శ్రీమా౯మాత్రము అపీలు చేయుటవలన లాభముండదని నిష్కర్షజేసుకొని నెంతచెప్పినను వినక శ్రీమా౯గా రపీలు దాఖలుచేయకున్నచో ఆకక్షదారుడు తనయూరులోనేఅడుగు బెట్టక పైలోకమునకు వెళ్లవలసినదితప్ప గత్యంతరము లేదని మొఱపెట్టెను. సముద్రమునందుపడి ప్రాణత్యాగము తప్పక చేసికొందునని నాకక్షీదారుఁడు చెప్పగా, అతని దగ్గఱకుపిలచి మిత్రులుకొందరు నీకేసున అపీలు దాఖలుచేయుమని చెప్పుచున్నారు. నీవున్నూ ప్రోద్బలపఱచుచున్నావు. కాని అపీలు దాఖలుచేసినను నీకేసునెగ్గదని నిష్కర్షగ ముంచే చెప్పిరి. అన్నట్లే జరిగెను.

పిఠాపురము, వెంకటగిరి, విజయనగరము, నూజివీడు మున్నగు సంస్థానముల కేసు లనేకముల శ్రీమా౯ చేపట్టెడివారు. అహోబిలము, తిరుపనందారు మున్నగు మఠముల కేసులలోగూడ వీరే సీనియరు వకీలుగ వాదించెడివారు. పై మఠముల కేసులలో కొన్నింటిలో ఫీజునే పుచ్చుకొనక హైకోర్టున వాదించెడివారు. పలుమారు బైటికోర్టులకు వెళ్లవలసి యున్నందుచే కస్తూరియనే పేరుగల వంటవాని వెంటఁబెట్టుకొని అన్ని చోట్లకు వెళ్లెడివారు. సకాలమున చక్కగ నప్పటికప్పటికి వేడిగ సిద్ధము గావించిన నాహారములనేతప్ప మఱి నింకొకదానిని పుచ్చుకొనెడివారే కారు.

ఏకోర్టునగానీ వీరు వాదించునప్పుడు చుట్టుప్రక్కల ఏవందలకొలదో జనము గుమిగూడుట సర్వసాధారణముగ నుండగా, జడ్జీలుగూడ వీరిమాటల చాలశ్రద్ధతో వినుచు ఎంతో మెలకువతో వర్తించెడివారు. వీరి ననుసరించి ఉంటూన్న వంటవాడు కస్తూరియు, గుమాస్తా శ్రీరామచంద్రుఁడును ఇంటికివచ్చినదే ఆనాడు కోర్టునజరిగిన వృత్తాంతముల నన్నిటిని, ఇంటివారికి చెప్పెడివారు. 1910 సం|| శ్రీమా౯గారు లజ్‌రోడ్డునందలి 'అంజాద్ బాగ్‌' బంగళాను కొనిరి. అప్పటికి వీరి మామగారు సర్ . శ్రీ వి. భాష్యంఅయ్యంగారు మరణించి రెండు సంవత్సరము లాయెను. 1911 వ సం|| కొత్తబంగళాకు శ్రీమా౯ వచ్చిచేరిరి. 1910 సంవత్సరమున కుమార్తెకు వివాహమత్యంతవైభవముగ జరిపిరి. వివాహముహూర్తము మద్యాహ్నము 12 గంటలకు నిర్ణయింపఁబడెను. కాని 10 గంటలకు కాబోలు అల్లుడు వారియెదుట నిలఁబడియుండగనే కూతురుని భార్యను దగ్గఱనుంచుకొని గంటసేపు భార్యాభర్తల విధులఁగూర్చిన సమస్తము బోధించు చుండగా, నీలోపుగనే నౌకరులు, వంటవారు ఇంటి యజమాని మొదలైనవారు కనఁబడనందున ఎచ్చటికి వెళ్లిరో తెలియక తహతహపడిరి.

శ్రీమా౯ గారు ఏవిషయమునుగూర్చి మాట్లాడుటకు ప్రారంభించిననుసరే ఏపనిచేయుటకు ప్రారంభించిననుసరే అది ముగియువరకు వారిమనస్సు దానియందే నిమగ్న మైయుండును. ఒక గుమాస్తాలుగాదు, ఒక నౌకరులుగాదు, తన భార్యాగాదు, తన పిల్లలుగాదు, శ్రీమంతులైన కక్షిదారులుగాదు, మహారాజులుగాదు అందరును అంతవరకు కాచు కొని యొకమూల ఒదిగిపడి యుండవలసినదే! వీరు తాచేపట్టిన వ్యవహారముననో తన ఆలోచనల తెరపి పడిన అంశములందో తదేకధ్యానమునిల్పి యోగులు సమాధిస్థితులైనట్లు తాదాత్మతనొంది తన పరిసరములు నుండివేఱై అదేదో మరొక ప్రపంచమున నున్న నొకానొక సిద్ధునిరీతి యోగానుభూతిలో విలీనుడై యుండ మరి గత్యంతర మేమున్నది? ... ఆసమయముల వీరిదోరణినిగాని, వీరి ధ్యానమునుగాని వీరుంటూన్న దళానుభూతులగాని: నీనైపున్న నెంతటి తలపోవుసందర్బములుగాని నేప్రాపంచిక ఆశాపాసములు గాని వీరిదృష్టి నాకర్షించ జాలనందున వీరున్నస్థితినే రూపుకదలక ఉందురు: అనగా, వీరిని ఆసమయముల నెవరున్నూ సమీపించి వీరి ధ్యానదారణముల భంగపఱచరు. ఎవరున్నూ సాహసించరు. ఎవరు సాహసింతురు ? అందరకు అంతఃజ్వరమే. వీరికై, లక్షలు, లక్షలు దనపుసంచులతో ఒకరివెనుక నొక్కొక్కరుగ జమీ౯దారులు, శ్రీమంతులు క్యూలో నిలచి నిలచి కాళ్లతీపులతో, మనస్సుల విసుగు, కేసు లేమగునో అను తహ తహాలతో, వీరింట ఏమిచేయను దిక్కుతోచక దేవుడా ! యని పడి ఉండవలసినదే, ఎంతకాలమైనను శ్రీమా౯ దయ వెట్టువరకు ద్వారబంధపుసేవ జేయుచుండవల సినదే ! వీ రాసమయముల చేయుచుండునది యేమనగా: ఒకకానీకి కొఱగాని నేఅవ్యక్త వ్యక్తితోనో లేదా, ఒక 0-4-0 స్వచ్చంద కాంగ్రెసుసేవకునితోనో తోటలో పచారుచేయుచు దేశవిషయములను చర్చించుచుండవలసినదే. నీవైపున్న ప్రపంచము తగులబడిననుసరే, ప్రళయమేవచ్చి తన కొంపమునిగిననుసరే, కేసులు కక్షిదారులు తన్ను దులుకొనిపోయిననుసరే, ఏది ఏమైనను వీరంతే. వీరికేదిన్నీ నేవిధమైన యోగభంగమునుచేయవు. వీరి నెవరుగాని నెదురెదురుగా సమీపించ భయపడువారు. వారి పకృతి అంద రెరిగియే యుండిరి. ఆప్రకృతికి అందరు జడియుచు నెపుడెపుడే ప్రళయమూడిపడునో ! ఏమి జేసిననేమో! అని దిగ్భ్రమజెందియుందురు. ఆదోరణిలోని ఆ అనర్ఘలవాహినికెదురీద నెవరికిన్నీ గుండె లేక తమకున్న కోపాదులనన్నిటి నడచుకొని శ్రీమా౯వారి సలహా లెప్పు డెప్పుడా అని తపస్సు జేయుచు - దేవుడివరమునుకోరి వ్రతము – జేయు ఆ వారికి శ్రీమా౯ గారి శ్రీగంటిజూపుతో పడిన అన్నిబాధలు సమసిపోవుచుండినవి. వీరితో నొకరుపలుకరుకాని అందరిని వీరు పలుకరించువారు. ఒకరిని వీరు పిలవవలసినదే గాని ఒకరికివీరు. సలహా చెప్పవలసినదే గాని మరెవరు వీరిని పిలవలేరు, సాహసించికూడ వీరికి సలహాల జెప్పరు.

రైలుప్రయాణము సాగించునపుడు వీ రెవరితోనైనను మాట్లాడుచున్నచో టైముప్రకారము నడవవలసిన రైలుగూడ కొంతసేపు ఆగవలసియుండును. ఒకతూరి ఉదకమండలమునకు వెళ్లుటకు మేట్టుపాళెము రైలులో కూనూరునకు ప్రయాణమై, రెండవక్లాసుపెట్టె నంతను తనకే రిజర్వు చేసికొని యుండిరి. ఒక ఐరోపియ౯ వీరిపెట్టెలోనికివచ్చి కూర్చుండెను. అది శ్రీమా౯జూచిరి. మనజాతీయ పోరాటముల ప్రధానభూమికయై ఐరోపియ౯ల పరిపాలనలో ఉంటున్న క్లిష్టపరిస్థితులలోని దేశీయవ్యవహారములలోనున్న వివిధసమస్యలను చక్కగ నెరిగియున్న శ్రీమా౯లో జాతీయత ఒక్క పెట్టున విజృంబించగా నొక తుపానురేగెను. శ్రీమా౯ అతనిని తనపెట్టెదిగమని ఎంతజెప్పినను అతడు వినలేదు. అంత శ్రీమా౯ గార్డును పిలిపించెను. అతని తన పెట్టెనుండి దింపి రైలు నడపమనిరి. తన పరువుప్రతిష్టలకే దెబ్బ తగిలెననుకొనెనో, ఏమో నేను చెప్పలేనుగాని, ఆ మూర్ఖుడుమాత్రము ఎవరిమాటలను వినలేదు. గార్డు నయముగజెప్పినను వినడు. మందలించినను వినడు. దిగడు. అపుడు చేయునదిలేక గార్డు ప్రక్కస్టేష౯లో పూర్తిపెట్టెను శ్రీమా౯గారికిప్పించెదనని ప్రాధేయపడెను. అంత శ్రీమా౯ ఆగ్రహముచెంది స్టేష౯మాస్టరును రప్పించి యతనిద్వారా నాఐరోపియ౯కు సలహా చెప్పించి యతనిని దింపి మరొక పెట్టె కెక్కించునట్లు జేసిరి. అమీదనే శ్రీమా౯గారు తనపెట్టెలో ప్రవేశించి నిమ్మళముగ కూర్చుండిరి. ఆవెనుకనే బండి కదలినది. ఇట్టి సంభవము లనేకము లప్పుడప్పుడు తటస్థించెడివి.

ఎచ్చటికివెళ్లినను తనయిష్టప్రకారము అన్నియు సాగవలెనేకాని "పోనీ యింకొకమారు చూచుకొనవచ్చునని తలచెడువారుకారు. వీరితో ననేక దూరప్రదేశములకు నేను ప్రయాణము చేసితిని. కావున కొన్నివేళలలో నావంటివారికి రాజోపచారముల చేయుమని వంటమనిషి కస్తూరితో చెప్పెడివారు. నాకు పడిసెమో, తలనొప్పియో ఏదైనా గలిగినప్పుడు వెంటనే డాక్టరువద్దకుఁ బంపి మందుపుచ్చుకొనుమని ప్రోద్బలపఱచెడివారు. ఇంటగానీ బయటగానీ ఏయూరిలో నేదోబసలోగాని వీరున్నచో ఏవందమందో ఆచోటనున్నట్లు కనఁబడును. వీరు పైకివెళ్లినచో ఏసందడి వినరాదు.

Luz Church Road. పడమటివైపు చర్చియుంటున్నది. దీనిని మైలాపూరువాసులు 'అడవిగుడి' యని చెప్పుదురు. బుడతకీచులు మొట్టమొదట ఇండియాకు వచ్చినప్పుడు వారియోడ మదరాసుతీరమున నాగి యుండెను. అప్పుడు తీవ్రమైన గాలి తుపానువల్ల సముద్రపుఅలలు పర్వతాకారముగ మైలాపూరు లోపలికివచ్చుటకు ప్రారంభించెను. ఓడలనడపువారు సెయింట్ మేరీకి ప్రార్థనలు సలుపుచూ నిటునటూ ఊగుచుండిన యోడలోనుండిరి. ఏయాపద లేక పోయినచో మేరీపేర యొకచర్చీని నిర్మింతుమని ప్రార్థనగావించుకొనిరి. దేవునిదయవల్ల ఉదయము కాగానే Santhome Church ఓడలో నున్న వారికి కనఁబడినమీదట ఓడదిగిగట్టుచేరిరి. ఆపడమటి తట్టు ఒకజ్యోతికనఁబడి యదృశ్యమాయెను. కావున ఆచోట బుడతకీచులు పైఁజెప్పిన 'అడవిగుడిని' నిర్మించిరి. శ్రీమా౯గారు 'అంజద్ బాగ్' బంగాళాన వాసమేర్పఱచుకొన్నప్పుడు ఎదుటనున్న ప్రదేశము ఒకచిన్నయడవిగా కనఁబడుచుండెను. ఎటుజూచినను సీమచింతచెట్లును, అత్తి, మఱ్ఱి, రావిచెట్లును, కప్పలును విశేషముగా నుండెను. కొన్నిప్రదేశములలో వెదురుపొదలు కనఁబడుచుండెను 'అంజాద్ బాగ్' ఆవరణమున గురిగింజచెట్టు, రెండుమూడు గంధపుచెట్లు ఉంటూయుండెను. రాత్రిరోడ్డు జన సంచారములేక నిశ్శబ్దముగ నుండును. చీకటిపడగానే యింటినుండి బయటికి వెళ్లుటకు స్త్రీలు, పిల్లలు భయపడెడివారు. శ్రీమా౯గారి తోటలో పాములనేకములుండెను గావున పారానౌకర్లకు రాత్రులలో వీనిని చంపుటతప్ప వేరొకపని యుండెడిదికాదు. వర్షాకాలమున కప్పలకూతలు హెచ్చుగనుండెడివి. అయితే లజ్ రోడ్డునకు అప్పుడేగాక యిప్పుడుగూడ నొకమోస్తరు ప్రాముఖ్యత యేర్పడియున్నది. ప్రముఖులును అపారధనవంతులును ఈరోడ్డునందే వసించెడివారు. రాజా, సర్. టి. మాధవరావు: సర్. శ్రీ వి. భాష్యంఅయ్యంగారు, Dary house (ప్యారీకంపెని) శ్రీ వేంకటస్వామినాయుడుగారు శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరు మున్నగువారందఱును ఈరోడ్డునందలి బంగాళాలలో వసించెడివారు. పైప్రముఖులేగాక, బరోడా, తిరువాన్కూరు, సంస్థానముల దివానులు దివా౯బహద్దరు శ్రీ. ఎస్. శ్రీనివాసరాఘవఅయ్యంగారు, సుప్రసిద్ధబారిస్టరు, శ్రీ నార్ట౯ మహాశయులు, సర్. శ్రీ వి. టి. దేశికాచారి. శ్రీ. ఎస్. సుబ్రహణ్యయ్యరు మున్నగు ప్రముఖులందఱును లజ్‌రోడ్డున వాసముండిరి. లజ్‌చర్చిరోడ్డు బంగలాలతో ఐరోపనియునులే వసించుచుండిరి. కాని గడచిన, 70, 80, సం||గా చెన్నపురివాసులు ఈబంగాళాలకొని వీనియందు నివాసమేర్పఱచుకొనిరి. అడ్వకేటు జనరల్‌పదవిలో నున్నపుడు సర్. శ్రీ పి. యస్. శివస్వామి అయ్యరుగారు లజ్‌రోడ్డునందే వసించుచుండిరి. అమీద శ్రీ టి. ఆర్ . వేంకటరామశాస్త్రి, సర్. శ్రీ కె. శ్రీనివాసఅయ్యంగారు ఈరోడ్డునందలి బంగాళాలలో వాసముచేయుచు హైకోర్టున న్యాయవాదులలో ప్రముఖులుగ నుండిరి. శ్రీమా౯గారు మైలాపూరు వకీళ్లలో నగ్రస్థానము సంపాదింపగల్గిరని యిదివరలో చెప్పియుంటిని. శ్రీమా౯గారి సోదరుఁడు శ్రీ. యస్. వెంకటేశఅయ్యంగారు, సర్. కె. శ్రీనివాసఅయ్యంగారి అల్లుడాయెను. సర్. కె. శ్రీనివాసఅయ్యంగారు గవర్నరు కౌన్సిలుమెంబరు కాగానే సర్. శ్రీ అల్లాడి కృష్ణస్వామయ్యగారు లజ్‌చర్చిరోడ్డున నొకబంగళా నిర్మించుకొని అందుఁజేరిరి. లజ్‌చర్చిరోడ్డున ఎందరో ప్రముఖులు వాసమున్నందుచే అనేకులు పనులమీద ఈప్రదేశమునకు వచ్చెడివారు. ఒకరివెంబడి ఒకరు అడ్వకేటు జనరల్ పదవిని స్వీకరించిరి కావున (సర్. శ్రీ వి. భాష్యంఅయ్యంగారు, శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు. సర్ . శ్రీ కె. శ్రీనివాసఅయ్యంగారు), ఈరోడ్డుప్రాముఖ్యత రానురాను అతిశయించెను. బరోడా సంస్థానదివాను దివాన్‌బహదూర్ శ్రీ ఎస్. శ్రీనివాసరాఘవయ్యంగారు, బరోడాకు మొదట దివాన్ ఆమీద తిరువాన్కూరు సంస్థాన దివానుగ నుండిన సర్. శ్రీ టి. మాధవరావుగారు, మద్రాసు హైకోర్టు ప్రధానన్యాయమూర్తి సర్ . శ్రీ ఎస్. సుబ్రహణ్యఅయ్యరే గాక మరి నాల్గున్యాయమూర్తులు, సర్. శ్రీ వీ. భాష్యంఅయ్యంగారు. శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరు శ్రీ పి. ఆర్ . సుందరయ్యరు, సర్. శ్రీ కె. శ్రీనివాసయ్యంగారు ఆరోడ్డులో వసించుచుండిరి. అంజద్‌బాగ్ బంగళాసు శ్రీమా౯గారు 20 వేలకుకొనిరి; ఆమీద 20 వేలు ఖర్చుపెట్టి దీనిని నూతనబంగళాగ మార్చిరి. ఈ బంగళా పూర్వము డిసిల్వగారి దనియు అనేక చేతులు మారి చివరకు ఒకమహమ్మదీయస్త్రీకి వశమాయెననియు ఈమె యొక మొదలారికి విక్రయింపగా వారివద్దనుండి శ్రీమా౯గారు కొన్నారనియు తెలియుచున్నది. ఇందు ప్రవేశించిన మీదట శ్రీమా౯గారి ఆదాయము హెచ్చి నెలకు 10,000 పైగా సంపాదింపగల్గిరి, కావున కుటుంబము వారందఱుసు సంపన్నులై తమ జీవితమును ఉన్నతస్థాయిలో గడప వీలాయెను. శ్రీమా౯గారు ఏటాదుస్తులకై వేయిరూపాయలు ఖర్చుపెట్టెడివారు. ఉదయము నిత్యకృత్యముల నిర్వహించుకొని ఆఫీసుగదిలో కేసులను, కక్షిదారుల సమక్షమున చదివెడువారు. 9 గం|| కాగానే డ్రాయింగుహాలునకువచ్చి కచ్చేరి సాగించెడివారు. ఈలోగా వంటమనిషి వెండిగిన్నెలో మోరు అన్నము పులుసుఅన్నము అప్పడములు, వడియములు, ఊరగాయలు మున్నగువాని సిద్ధముగావించుకొని ఎదుట నిలఁబడియుండును. ఒకచేతిలో కోటు తగిలించుకొని మఱొకచేతితో వంటవాఁడు అందిచ్చు గిన్నెలలోని అన్నమును నిలచుకొని భుజించెడివారు. ఈలోగా అప్రెంటీసులలో ఎవరైన ఒకరు పాగా చుట్టి తెచ్చియిచ్చుటయు, భార్య నెక్ టై తగిలించుటయు నౌకరిబూట్సును కాళ్లకు తొడుగుటయు, ఆమీద వీరు కోర్టుకు ప్రయాణమగుటయు జరిగెడిది. వీరు కోర్టుకు వెళ్లులోపలనే ఒక ఝడివాన కురిసి నిలచినట్లే యింటివారందఱు భావింతురు. సిల్కు దుస్తులధరించు శ్రీమా౯గారు శ్రీగాంధీతో సంబంధము ఏర్పడినమీదట, పూర్వము ధరించుచుండిన దుస్తులపై వ్యామోహము వదలిరేమో, యని యింటివారేగాక పైవారు కొందఱును భావించిరి గాని యట్లు గావింపరైరి. నెలకు 10 వేలకుపైగా ఆర్జన యున్నప్పుడు గూడ డబ్బుండెడి పెట్టెవద్దకు వెళ్లువారుకారు. పెట్టెతాళపు చెవిని, జమాఖర్చు లెక్కలచూచు అలవాటు వీరికి నలవడలేదు. కుటుంబ ఖర్చులన్నియు వీరి భార్యగారే నిర్వహించుచు, గుమాస్తాసహాయమున లెక్కల వ్రాయించుచుండిరి. శ్రీమా౯గారికి తన భార్యసొమ్ము వృథాగా ఖర్చుపెట్టదను నమ్మక ముండెను కావునను, లెక్కల చూచుటలో లోపముండదని నమ్మువారు కావున కుమారుఁడు కుమార్తె యాతీరున తల్లివలె వ్యవహరింప నేర్చుకొనవలెనని చెప్పుచు పుస్తకములు చదువుటవలన నీప్రతిభరాదని చెప్పెడివారు. వీరి యుదారబుద్దివల్ల లాభము చెందినవారు అనేకులు గావున వీరు శ్రీమా౯చేసిన సహాయమునుగూర్చి మదరాసు యూనివర్సిటీన బి. ఏ. పరీక్షలో అగ్రస్థానము వహించిన విద్యార్థికి ఒక బంగారుపతకమును' తస మామగారగు శ్రీ సర్.వి. భాష్యంఅయ్యంగారిపేర ప్రతిసంవత్సరము ఇచ్చుటకై 5 వేలు ఇచ్చిరి. పండిత శ్రీమదనమోహనమాలవ్యాగారు ప్రారంభించిన కాశీ విశ్వవిద్యాలయమునకు 10 వే లిచ్చిరి. శ్రీగోపాలకృష్ణగోఖలేగారిపేర ప్రతిసంవత్సరము మదరాసు యూనివర్సిటీన ఆర్థికశాస్త్రమునుగూర్చి ప్రముఖులుపన్యసించుటకై 10 వేలు యూనిర్సిటీ కిచ్చిరి. శ్రీగాంధీగారు కాంగ్రెసుప్రచారము ప్రారంభించి వీరి సహాయముసుకోరగా 10 వేలు విరాళముగ నిచ్చిరి. ఈపెద్ద మొత్తములు ఇంటివారికి తెలియునే కాని చిల్లర మొత్తములు ఎవరెవరికి ఎప్పుడు ఇచ్చిరో ఎవరికి తెలియదు. రామనాథపురమునందు తాను జన్మించిన యింటిని చక్కఁజేసి 25 వేలు ఖర్చుపెట్టి ఒకహాలు నిర్మించి యిందు లైబ్రరీని, నాటకశాలను ప్రజోపయోగమునకై నిర్మించిరి. ఇందుకై వీరికుమారులు శ్రీ ఎస్. పార్టసారథి శ్రీమా౯ మరణించినమీదట కొంతసొమ్ము వెచ్చించి లైబ్రరీని వృద్ధిచేసెను.

ఎచ్చటికైనను ప్రయాణము సాగింపవలసివచ్చినచో శ్రీమా౯గారికి ప్రత్యేకముగ సన్నబియ్యము, నేయి, అప్పడములు, ఊరగాయలు, అన్నపుపొడి మున్నగునన్నిటిని, వంటమనిషినికూడతీసికొని వెళ్లుచుండును. వీరు పైవారు తయారుచేసిన కాఫీని గాని, ఫలహారమునుగాని పుచ్చుకొనెడువారు కారు. కావున వంటమనిషి కస్తూరి వీరికి కావలసిన వన్నిటి కుక్కర్ పైనో కుంపటిమీదనో సిద్ధము గావించే అలవాటు. బయటినుండి తెప్పింపఁబడిన పలహారముల త్యజించెడి యలవాటు మామగారింటిలో వీరున్నప్పుడు ఏర్పడెను. స్వదేశమున నీతీరుగ ప్రయాణము సాగించిన శ్రీమా౯ కాంగ్రెసు పనిమీద దూరప్రదేశములకు వెళ్లినప్పుడుగానీ, విదేశములకు వెళ్లినప్పుడుగానీ తనతో నౌకరి రా నక్కఱలేదని చెప్పుట యందఱికిని ఆశ్చర్యము కలిగించెను. సదా వీరివెంబడి నౌకరియుండవలెనని వీరికి పట్టుదల లేదు. కాంగ్రెసు పనులమీదనే కేసులకై బయటికి వెళ్లినప్పుడుసు కస్తూరిని తీసికొని వెళ్లుచుండిరి కాని విదేశములకు వెళ్లినప్పుడు ఒంటరిగా వెళ్లిరి. ఆరోజులలో అప్పుడప్పుడు ఆంజాద్‌బాగ్‌లోన గొప్పటీపార్టీలు సాగుచుండెను. ఇందుకు హారిస౯కంపెనీవారు కంట్రాక్టర్లుగా నుండిరి. కాని గాంధీగారి గౌరవార్థము కావించిన వించుకు హారిస౯కంపెనీవారిని రప్పింపరైరి. వీరి కుటుంబమువారు గవర్నమెంటుహౌసు విందునకు వెళ్లెడివారు. లార్డ్ పెన్ట్‌లండ్ గవర్నరు భార్యను, శ్రీమా౯గారిభార్య అంజాద్ బాగున కౌహ్వానించి గొప్ప టీపార్టీ నిచ్చిరి. ఈ పార్టీకి మహిళలనేకులు హాజరైరి.

శ్రీమా౯గారి కుమార్తె శ్రీ అంబుజమ్మాళ్ గారికి విద్యనేర్పుటకై ఒక ఆంగ్లస్త్రీని నియమించిరి. చదివించి నంతమాత్రమున తాను సంతృప్తిచెందననియు, ఇంటిపనులు, వంట, కుట్టుపనులు నేర్చుకొనవలెననియు, సంగీతము పాడుటకు కూడ శక్తికలిగి యుండవలెననియు అప్పుడప్పుడు చెప్పుచుండెడువారు. ఎల్లప్పుడు పుస్తకములు చదువుటమాని యింటిపనుల గమనింపుమని కుమార్తెను హెచ్చరించెడువారు. శ్రీ గాంధీతో సంబంధము ఏర్పడుటకు ముందు శ్రీమా౯గారివర్తన కుటుంబపరిస్థితులు ఎట్టివో నాకు తెలిసినంతవరకు వివరించితిని గాని నాకుతెలియని అంశములు కొన్నిగలవని చదువరులు. గుర్తింపవలెను.

శ్రీగాంధీగారిని శ్రీమా౯గారు కలసికొనుటకు చాలా సం||లకు ముందే వారు రాజకీయ సాంఘిక వ్యసహారములలో జోక్యము కలిగించుకొని కొంత కృషి సాగించియుండిరి. ఆరోజులలో న్యాయవాది వృత్తిలోను, ప్రజాసేవయందును అగ్రేసరులైన శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యంగారిని ఆదర్శముగ నుంచుకొని శ్రీమా౯ వర్తించుచుండెను. కావుననే శ్రీ కృష్ణస్వామిఆయ్యరు. వీరిని ప్రీతితో శ్రీమా౯' అని పిలిచెడివారు. 1908 సం||న మదరాసున సమావేశమైన కాంగ్రెసుకు డాక్టరు సర్ , శ్రీరాష్‌బెహారీ ఘోష్‌గారికి శ్రీమా౯గారిని పరిచయము చేయుచు "శ్రీమా౯ శ్రీనివాసఅయ్యంగారు, సర్. వి. భాష్యం అయ్యంగారిఅల్లుడు, కాని కొన్నిసందర్భములలో వీరిదిపైచేయి” అనగా న్యాయవాదివృత్తిలో శ్రీమా౯గారి బుద్ధికుశలత అతితీక్ష్ణమైనదని శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరు భావించియే పైతీరున పరిచయముచేసిరి.

సాంఘికసంస్కరణలగావింప నేర్పడినసంఘము వారు వీరినితమగోష్ఠీలో చేర్చుకోలేదుగాని కొన్ని సందర్బములలో సంఘసంస్కరణము ఆవశ్యకమనియే వీరుతలచుచు సర్: శ్రీశంకర౯నాయరు కక్షలోకలసి కొంతకాలముపాటుపడిరి. కావున శ్రీమా౯గారిపై సర్ : శ్రీశంకర౯నాయరుగారికి క్రమేణ అభిమానము హెచ్చెనని తెలియుచున్నది. న్యాయవాదవృత్తిలోనున్నను ప్రజాసేవగావించిన దేశమునకు కొంతమేలు సాగింపవీలగునని ప్రపంచమునకు వెల్లడించిన వారు సర్: శ్రీ శంకర౯నాయరు గారని శ్రీమా౯ చెప్పెడివారు. కొంతకాలమునకు శంకర౯నాయరుగోష్ఠీ మతజాతిభేదములకు ప్రాముఖ్యతనిచ్చినందుచే నీగోష్ఠీతో శ్రీమా౯గారు సంబంధము వదలుకొనిరి.

(శ్రీ మణిఅయ్యరు) జస్టిసు సర్. సుబ్రహ్మణ్యయ్యరుపేర్లను ఎవరైన చెప్పినంత మాత్రముననే తన హృదయాహ్లాదమును శ్రీమా౯ వెలిబుచ్చుచుండును. వారి గుణాతిశయములు ఉదారబుద్ది సునిశితవిమర్శనాపటిమమున్నగువాని అప్పుడప్పుడు ప్రశంసించుచు శ్రీమణిఅయ్యరు కూడ తమవలె మధురవాసి యనెడివారు. మదరాసు యూనివర్శిటీ సెనెటునకు పట్టభద్రులచే యెన్నుకోబడి నాలుగు సం||ల కాలము సెనెటు మెంబరుగ నుండిరి.

1914 వ సం!! చెన్నపట్టణమున కాంగ్రెసుసమావేశముజరిగినప్పుడు శ్రీమా౯గారు సన్మానసంఘ కార్యదర్శిగ యెన్నుకోబడి అన్నిపనుల చక్కగనిర్వహించిరి. మరొక కార్యదర్శియగు శ్రీ జి. ఎ. నటేశయ్యరుగారు ఆహ్వానసంఘ టిక్కెట్లలో తనపేరు వేసికొనగా శ్రీమా౯గారు దీనిగుర్తించి యెవరిపేరు టిక్కెట్లలోనుండరాదనియు ఆహ్వానసంఘాధ్యక్షుల పేరుమాత్రమే ముద్రింపఁబడవలెననియు, శ్రీ జి. ఎ. నటేశ౯గారికి నొకజాబువ్రాసి కోర్టుపనిమీద మధురకువెళ్లుచు టిక్కెట్టుప్రూపు తానామోదించినమీద ముద్రణము కావలెనని తెలియజేసిరి. వీరిష్టప్రకారమే విధిలేక జి. ఎ. నటేశ౯గారు మధుక నుండి శ్రీమా౯ రాగానే టిక్కెట్లప్రూపుల కనఁబఱచి ఆమీఁద వీని ముద్రింపించెను. డాక్టరు ఆనిబిసెంటు హోమ్‌రూలు ఉద్యమమును ప్రారంభించినపుడు శ్రీమా౯గారు ఆనిబిసెంటు వర్తనను ఆమోదించిరి. కాని, అడ్వకేటుజనరలుపదవిలోనున్నందు వల్లను, అడయారు ధియసాఫికల్ సొసైటీ సిద్ధాంతములపై వీరికి నమ్మకము లేనందునను, ఈసొసైటీ రహస్యగోష్ఠులలోని చర్యలను నిరసింపువలసివచ్చినందుచే కొంతకాలమునకు శ్రీ అనిబిసెంటు గారికృషికి ఏసహాయముగావింపరైరి. శ్రీ జి. కృష్ణమూర్తిని దత్తునిగా స్వీకరించుటయు ఆమీద కృష్ణమూర్తితండ్రి హైకోర్టున దావావేయుటయు దివ్యజ్ఞానసామాజికులకు సంతృప్తికలిగింపవచ్చునుగాని తనకు ఆనిబిసెంటువర్తన యేమాత్రము గిట్టదని చెప్పుటకు ప్రారంభించిరి. ఈసమాజమునందు సభ్యులుగనున్న డాక్టరు శ్రీనంజుండరావుగారు శ్రీమా౯గారి యింటిడాక్టరుగావున్న రోజూ శ్రీమా౯గారి యింటికివచ్చెడివారు. వచ్చినప్పుడెల్ల శ్రీమా౯గారితో థియసాఫికల్సొసైటీ చర్యలగూర్చిచెప్పెడువారు కావునను శ్రీ అనిబిసెంటుపై శ్రీకృష్ణమూర్తి దత్తసుగూర్చి శ్రీ సంజుండరావుగారు దావా దాఖలుచేయించిరి కావునను థియసాఫికల్ సొసైటీన జరగువృత్తాంతములన్నియు డాక్టరుగారికి చక్కగా తెలియును గావునను డాక్టరుగారి సంభాషణలే శ్రీమా౯వారికిని శ్రీఅనిబిసెంటునకు అభిప్రాయభేదము హెచ్చెనని అనేకులు అనుకొనుచుండిరి.

1916 సం|| శ్రీమా౯గారు అడ్వకేటుజనరలుపదవిని స్వీకరించిరి. ఈపదవికి వీరు మొదట తాత్కాలికముగ నియమింపబఁడి ఆమీద దీర్ఘకాలము ఈ పదవిలోనుండుటకు అవకాశమును సంపాదింపగల్గిరి. పదవిఖాయముకాగానే కాంగ్రెసుప్రముఖులును సుప్రసిద్ధజాతీయవాదియునైన హిందూముస్లిం అల్లర్లలో శిక్షజెందినవారును భారతదేశమంతటను కీర్తి గడించినవారును అగు శ్రీ సేలము విజయరాఘవాచారిగారు శ్రీమా౯గారికి అడ్వకేటుజనరలుపదవి లభించినందుకు వీరిని కీర్తించిరి. అప్పట్లో శ్రీ విజయరాఘవాచారిగారు మదరాసు రాష్ట్రశాసనసభ్యులుగ నుండెడివారు. వీరికి దక్షిణదేశమున పలుకుబడి హెచ్చుగావున క్రమేణ ఢిల్లీఅసెంబ్లీ సభ్యులగుటయేగాక నాగపూరుకాంగ్రెసుసమావేశమునకు అధ్యక్షులుగ యెన్నుకోబడిరి. ఈమహనీయుఁడు సామాన్యులపొగడువాడుకాడు. శ్రీమా౯గారు అత్యున్నతవ్యక్తియని గుర్తించియే వీరిని అభినందించిరి. అప్పట్లో శ్రీమా౯గారికి హైకోర్టుజడ్జిపదవి నిత్తురని వార్త బయలుదేరెను కాని, ఆపదవిని స్వీకరించుటకు వీరికిష్టములేదని రాష్ట్రగవర్నరు తెలుసుకొని పైకితెలియజేసెను. కావున వీరు న్యాయవాదిగనే కాలముగడపిరి. కొన్నిమాసములలో శ్రీమా౯గారిని రాష్ట్రగవర్నరు కౌన్సిలుమెంబరు గావింతురని యనేకులు అనుకొనుచుండిరి. వీరికధికారులు C. I. E. అను బిరుదమును యిచ్చిరేకాని కౌన్సిలుపదవిని వీరికేల నివ్వలేదో యెవరికిని తెలిసినదికాదు.

1919 సం|| వీరు రాజ్యాంగసంస్కరణల మహాసభకు అధ్యక్షులైరి. అడ్వకేటుజునరలు కావున ఆచారప్రకారము వీరు మదరాసురాష్ట్ర శాసన సభ్యులుగనుండి మదరాసు ప్రభుత్వమునకు సలహాలనిచ్చుటయేగాక అనధికారసభ్యులు ఎవరైన శాసనసభలో న్యాయసంబంధమైన ప్రభుత్వచర్యల ఆక్షేపించినచో అడ్వకేటుజనరలైన వీరు వారికి సమాధానము చెప్పుటయేగాక ప్రభుత్వవర్తనను బలపఱచుచుండెడివారు. కొన్ని సందర్భములలో స్వీయాభిప్రాయములకు విరుద్ధముగ శాసనసభలో వ్యవహరించుట వీరికి ప్రాణాకంటకముగ నుండెను. అప్పుడప్పుడు ప్రభుత్వమువారికిని శ్రీమా౯గారికిని అభిప్రాయభేదములు జనించుచుండెను. వీరికి C. I. E. బిరుదు ఇచ్చినచో సంతృప్తిజెంది ప్రభుత్వ చర్యల నన్నిటిని నామోదించునని రాష్ట్రఅధికారులు తలచినది పొరబాటు. స్వతంత్రబుద్దిగల వీరు ఏవిషయమునుగాని తన యంతరాత్మసూచించునట్లు విమర్శించుట వీరి అలవాటు కావున నితరుల సంతృప్తి గావించుటకై స్వీయాభిప్రాయముల దాచుకొందురని అధికారులు తలచినది హాస్యాస్పదము. ఏపదవి తన కక్కరలేదనియు తన విధ్యుక్త కార్యముల తనకు తోచినట్లు నిర్వహింతుననియు ఒకమారు గవర్నరుగారితోచెప్పిరట. శ్రీగాంధీతో భిన్నాభిప్రాయములు జనించినపుడు కాంగ్రెసుసంస్థకు సంబంధించిన పదవులన్నిటిని తృణప్రాయముగఁజూచి ప్రముఖులెందరు ఎంతజెప్పిననువినక కొందఱు ప్రజలు వీరిని అల్లరిసాగించువారని చెప్పుచున్నను నిర్లక్ష్యముగనుంటూ తనసిద్దాంతములకు విరుద్ధముగా ఎన్నడును వర్తింపనని ఘంటాపథముగా శ్రీగాంధీగారితోచెప్పిరి. ఎందునగానీ తనచిత్తవృత్తికి భిన్నముగా ఎన్నడును వర్తింపరనుసంగతి లోకవిదిత మాయెను. వీరు ఆరోజులలో అడ్వకేటుజనరలు పదవిలోనుండుట కుటుంబమువారికి సంతృప్తినికలిగించెను, వాకిట నిద్దరు జవానులు డబ్బాడవా లీలతోనిలచుట కొందఱికి గొప్పగ కనఁబడినదేగాని శ్రీమా౯గారు ఇట్టిదర్జాల లక్ష్యపెట్టువారుకారు. శ్రీమా౯గారికృషివల్లనే అడ్వకేటుజనరలునకు భృతి హెచ్చింపఁబడెనుగాని వీరు అడ్వకేటుజనరలుగా నున్నప్పుడు 1500 మాత్రమే నెలకు లభించుచుండెను. తనకార్యదీక్ష, బుద్ధికుశలత అపారసామర్థ్యము మున్నగువానిపై వీరికి పూర్తిగా నమ్మకమున్నందువల్ల తనమిత్రులు సందర్శించినపుడు తానుసాగించు ఉన్నతకార్యములఁగూర్చి చెప్పెడివారు. పదవినిచ్చిరని ప్రభుత్వమును గొప్పగభావింపక తసయోగ్యత వల్లనే పదవినిచ్చిరని తలంచెడివారు.

శ్రీఆనిబిసెంటుగారు హోంరూలు ప్రచారము సాగించుచు తన న్యూఇండియాపత్రికలో తీవ్రముగ మదరాసు ప్రభుత్వమును నిరసించుచుండెనని అధికారులు చర్యపూనినపుడు శ్రీమా౯గారు అడ్వకేటుజనరలుగనున్నందుచే ఆనిబిసెంటునకు విరుద్ధముగ హైకోర్టున దావాలలో వాదింపవలసివచ్చెను. ఉభయులకు నాడుపత్రికలలో వివాదములు సాగుచుండెను. ఆనిబిసెంటునకు ప్రతికూలముగ వర్తించినచో శ్రీమా౯గారిని చంపివేయుదుమని ఆకాశరామన్నజాబులు వీరికివచ్చెనుగాని వీనినెంత మాత్రములక్ష్య పెట్టక విధ్యుక్తకార్యముల నిర్వ హించుచుండిరి. శ్రీఆనిబిసెంటుగారిని జైలునపడవేయవలయునని గవర్నరు పెంట్‌లె౯డ్ అభిప్రాయపడి శ్రీమా౯గారి సలహానుకోరగా గొప్పవ్యక్తియగు ఆనిబిసెంటును సామాన్యఖైదీగ భావింపరాదనియు ఉదకమండలమున ఒకప్రదేశమున వీరిని కాపుదలతో నుంచుమనియు శ్రీమా౯గారు సలహా చెప్పితినని మిత్రులతో చెప్పెడివారు. అప్పటినుండియే అడ్వకేటుజనరలుపదవిని వదలుకోవలెనను నూహ వీరికి జనించెను.

పెంట్లె౯డ్ ఇంగ్లాండువెళ్లినమీదట విల్లి౯గ్డ౯ మదరాసు రాష్ట్రగవర్నరాయెసు. కాని వీరిమధ్య మనస్పర్థలు క్రమేణహెచ్చాయెను. అడ్వకేటుజనరలుగ వీరు సూచించిన సలహాలు విల్లి౯గ్డనుకు ప్రాణకంటకముగనుండెను. కావున గవర్నరుగారిపార్టీలకు గూడ వీరువెళ్లరైరి. తనంతట తాను గవర్నరును సందర్శించుటమాని వీరాహ్వానించినపుడు మాత్రమే గవర్నమెంటు హౌసుకువెళ్లెడివారు. ఇందుకు కొన్ని సంవత్సరములు ముందే ఐరోపియనులపై ఒక మోస్తరు నిర్లక్ష్యభావము వీరియందంకురించెను. కొన్ని సందర్భములలో ఐరోపియనులు భారతీయుల కన్న గొప్పవారని తనమనస్సున అభిప్రాయమున్నను, భారతీయుఁడెవఁడుగానీ విదేశీయునిచే చులకనగా చూడబడుసందర్బమును వీరు గర్హించెడివారు. ఐరోపియనులు భారతీయులకు సమానగౌరవము చూపవలెనని పట్టుబట్టుటకు ప్రారంభించిరి.

అప్పట్లో నింటియం దొకరోజున భార్యతో మాట్లాడుచు గవర్నరు విల్లి౯గ్డ౯ తన్ను యిబ్బంది పాలు గావించుచున్నాడనియు పాడుపదవిని వదలుకొన నిశ్చయించితిననియు జెప్పిరి. కాని, వీరిభార్య ఇందుకు ఏబదులుచెప్పలేదు. ఆరునెలలు శ్రీఆనిబిసెంటును ఉదకమండలమున కాపుదలలోనుంచి ఆమీద వదలిపెట్టిరి. అప్పుడే శ్రీగాంధీగారి ఉద్యమము భారతదేశమున నావిర్భవించెను. కావున శ్రీగాంధీగారి శాసనోల్లంఘనకృషి వీరికి అసంతృప్తిని గలిగించెను. కొంతకాలమునకు శ్రీగాంధీగారి యుద్యమమున శ్రీమా౯పాల్గొనుటకు ప్రారంభించిరి.1919 సం!!న ఏప్రెలునెలలో 'జలియ౯వాలాభాగున' పంజాబురాష్ట్రమునసైనిక ప్రభుత్వనిర్మాణము రాత్రులలో పైకివెళ్లరాదనియు పైకివెళ్లినవారిని కాల్చెదమనియు ప్రభుత్వము శాసించుటచే భారతీయులందఱిని కలవరపెట్టుటయేగాక యీదురన్యాయముల తుదముట్టింప తీవ్రప్రయత్నములు అచ్చటచ్చట ప్రారంభింపఁబడెను. సర్. శంకర౯ నాయరువంటి మితవాద శిఖామణులుగూడ బ్రిటిషు ప్రభుత్వచర్యలవల్ల అసహ్యముజనించి, హైకోర్టు పదవికి రాజీనామాయిచ్చిరి. కావున శ్రీమా౯ అయ్యంగారు. అప్పుడేగాకున్నను, కొన్నినెలలకు అడ్వకేటుజనరలుపదవికి రాజీనామాయిచ్చిరి. ఈ సందర్భమున భార్య అభిప్రాయమును వీరు కోరిరి గాని యామె మౌనమువహించి యుండెను. అనేకాంశములలో వీరుభయులు సంప్రతించినమీదనే శ్రీమా౯గారు ఒక తీర్మానమునకువచ్చెడివారు. పాత్రము ననుసరించి మాట్లాడుస్వభావము శ్రీమా౯గారికి నెప్పుడు నలవడలేదు కావున తనకుతోచిన దానిని పైకి చెప్పుచుండెడివారు. 1920 సం|| ఫిబ్రవరిలో ఒకరోజున కోర్టునుండి ఇంటికి రాగానే పదవిని వదలుకొంటినని భార్యకు తెలియఁజేసిరి. వీరు కాంగ్రెసునఁజేరి ఎన్నడు కారాగారము ప్రవేశింతురో యనుభయము భార్యకు జనించెను. కాని భార్య తనభీతిని వెల్లడింపక పదవిని వదలినందుకు ఆమోదమును సూచించెను.

శ్రీమా౯గారు పదవిని వదలినవెంటనే కాంగ్రెసున ప్రవేశింపలేదు. సర్కారుకక్షలోచేరక స్వతంత్రులుగా వ్యవహరించుచుండిరి. అందుమీదట దేశము నకు ఇప్పట్లో తా నే సేవయు గావింపలేననిచెప్పిరి. సహాయనిరాకరణోద్యమము వీరిదృష్టిని ఆకర్షింపలేదు. కావుననే యూనివర్శిటీ స్థానమునకు పోటీచేసి మదరాసు రాష్ట్రశాసనసభ్యులైరి. రాష్ట్రసభలో ప్రభుత్వకక్షకు వ్యతిరేకముగా నుపన్యాసముల నిచ్చుటకు ప్రారంభించిరి. కాని యిందుతో వీరి యాశయము పూర్తికాలేదు. 1920 సం!! న మదరాసు రాష్ట్రమున రాజకీయమహాసభను వైభవముగ జరుపుటకు తిరునల్వేలి జిల్లావాసియు, సుప్రసిద్ధజాతీయ వాదియు, దేశసేవకుఁడు నగు శ్రీ వి. ఓ. చిదంబరం పెళ్లెగారు ఏర్పాట్లుగావించిరి. ఈమహాసభకు పూనానుండి శ్రీ బాలగంగాధరతిలక్ మహాశయులు మున్నగువారు వచ్చుట కంగీకరించిరి.

1905 సం|| తిరునల్వేలిలో మదరాసురాష్ట్రమహాసభ శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరుగారి యాజమాన్యమున జరిగెను. శ్రీ చిదంబరంపిళ్లెగారు శ్రీమా౯ అయ్యంగారిని 1920 వ మహాసభకు నధ్యక్షులుగా నుండు మని కోరి యందుకు వీరు సమ్మతించినమీదట నాహ్వానసంఘమును సమావేశపఱచి శ్రీమా౯గారిని అధ్యక్షునిగా నేకగ్రీవముగా నెన్నుకొనునట్లుచేసిరి. ఈమహాసభకు భారతీయ ప్రముఖులనేకులు వచ్చిరి. గౌ|| వి. ఎస్. శ్రీనివాసశాస్త్రి, శ్రీ సి. పి. రామ స్వామిఅయ్యరు, దివా౯బహదరు శ్రీ గోవిందరాఘవయ్యరు, దివా౯ వి. పి. మాధవరావు, శ్రీ యస్ . కస్తూరి రంగయ్యంగారు, శ్రీ ఏ. రంగస్వామిఅయ్యంగారు, గౌ|| కే. వి. రంగస్వామిఅయ్యంగారు, శ్రీ యస్. సత్యమూర్తి, శ్రీ చల్లా గురుస్వామిశెట్టి, డా. యు. రామారావు, శ్రీ యాకుబ్ హాస౯సేట్, డా. శ్రీ వరదరాజులునాయుడు, చాలకాలము అరవింద ఘోష్‌గారితో సహచరులుగ నుండిన శ్రీ వి. వి. ఎస్. అయ్యరు మున్నగువారేగాక దక్షిణజిల్లాలలో నుండు వకీళ్లు, వర్తకులు అనేకు లీసభకు విచ్చేసిరి. రైలు ఎగ్మూరు స్టేషనువదలినది మొదలు ప్రతిరైలు స్టేషనున వేలకొలదిజనము శ్రీ తిలకుగారిని, శ్రీమా౯గారిని సందర్శించి సత్కరించుటకు హాజరైరికాని అనారోగ్యముచే శ్రీ తిలకుగారు రాలేదని ప్రజా సమూహమునకు తెలియగానే వారు నిస్పృహులైరి. రైలుమార్గమున శ్రీ తిలకుగారికి సత్కారముగావింప వలసిన ఏర్పాట్లన్నియు శ్రీమా౯గారికికూడ లభించెను. మరునాటి రాత్రి 8 గం|| తిరునల్వేలి రైలుస్టేషను దిగగానే 6 ఏనుగులు కనఁబడెను. 3 ఏనుగులు ముందును, 3 ఏనుగులు వెనుకను నడచుచుండగా రైలుస్టేషనునుండి పాళయముకోటవరకు, గౌరవార్థము వేలకొలది. ప్రజలతో నిండెను. పాళయముకోటక్లబ్బు ఆవరణమున ప్రముఖులందఱికిని బసలు ఏర్పాట్లుగావింపఁబడెను కావున బండ్లుదిగి మేమందఱము క్లబ్బున చేరుకొంటిమి.

ఈమహాసభలో పంజాబుదురంతములగూర్చి, శ్రీమా౯గారు గొప్ప ఉపన్యాసముగావించి, ప్రభుత్వోద్యోగులవర్తనను పూర్తిగఖండించిరి. విషయనిర్ణయకసభ రాత్రి 1 గం!! వరకు సాగి యనేకులు వారికితోచిన యభిప్రాయముల వారు వారువెల్లడించిరి. ఆతీర్మానములలో ముఖ్యమైనది 'ఖిలాఫత్‌' గాన దీనిని శ్రీమా౯ ఎస్. కస్తూరి రంగయ్యంగారు మహాసభలో నెగ్గింపవలెనని విషయనిర్ణాయకసభలో తంటాలుపడిరి. శ్రీ సత్యమూర్తిగారు తిరునల్వేలి సమీపములోనున్న పేటలో 30 వేలమంది సమావేశమైన సభలో 'ఖిలాఫత్‌' తీర్మానమునకు అనుకూలముగా ప్రసంగించిరి. ఈసభకు వేలకొలది తురకలుకూడ వచ్చియుండిరి. ఈసంగతి ఉదయము శ్రీమా౯గారికి తెలియఁగానే మండిపడి మహాసభలో శ్రీ సత్యమూర్తిగారు మాట్లాడుటకు అవకాశము ఇవ్వరైరి. ముందురాత్రి శ్రీ కస్తూరి రంగయ్యంగారు శ్రీమా౯గారితో ప్రముఖుల యెదుట ఖిలాపత్ తీర్మానముగూర్చి తనకు పట్టుదలలే దని విస్పష్టముగఁజెప్పి మరునాడు సభలో యాకుబ్ హాస౯గారిచే తీర్మానమును ప్రతిపాదింపించినందుకు శ్రీమా౯గారే గాక యితర ప్రముఖులనేకులు ఆశ్చర్యపడిరి. ఈతీర్మానము ఈమహాసభలో నెగ్గి నందుచే ముందు అనేకచిక్కులు, కక్షలు ఏర్పడి శ్రీ సి. రాజగోపాలాచారి ప్రోత్సాహమున శ్రీగాంధీగారు కలకత్తా స్పెషల్ కాంగ్రెసున సహాయ నిరాకరణతీర్మానమును నెగ్గించుటకు అవకాశ మేర్పడెను.

శ్రీమా౯గారు తిరునల్వేలివదలగానే దక్షిణదేశమున ననేకచోట్లకువెళ్లి సత్కారములనొంది చెన్నపట్టణముచేరుటకు 15 రోజులుపట్టెను. ఇంటికిరాగానే అడ్వకేటుజనరలుపదవిని వదలినట్లే C. I. E. బిరుదముసుకూడ వదలిరి. ఇంటనున్న విదేశీబట్టలు వస్తువులు మున్నగు వాని మూలపడవేసి స్వదేశీవస్తువులు, దుస్తులు మున్నగువానికి ప్రాముఖ్యతయిచ్చుటకు ప్రారంభించిరి. ఆమీద కేరళదేశమునకు ప్రయాణమై కొన్నిసభలలో సహజవాగ్ధోరణితో ప్రభుత్వదురంతముల ప్రజాసామాన్యమునకు తెలియఁజేయుచు నుపన్యాసముల సాగించిరి. కళ్లికోటలో ఒక సభ యందు వీ రుపన్యసించుచు పదవిని, బిరుదమును వదలినందుకు కారణములనుగూడ వెలిబుచ్చిరి. మీద కొన్నిరోజులకు శ్రీమా౯ ఎ. రంగస్వామిఅయ్యంగారు, నేను శ్రీమా౯గారిని సందర్శించి వారి బంగళాలో చాలాసేపు మాట్లాడుచుండగా శ్రీ సత్యమూర్తిగారుగూడ నచ్చటికి వచ్చిరి. మే మందఱము గోఖలేహాలున సభగావించి మీరు అడ్వకేటుజనరల్ పదవి వదలినందుకు అభినందింపఁదలచితిమని శ్రీమా౯గారితో చెప్పగా మాయొత్తిడివల్ల గోఖలేహాలుసభకు వచ్చుటకు అంగీకరించిరి. గోఖలేహాలుసభ జయప్రదముగ సాగెను శ్రీమా౯గారు బ్రిటిషుప్రభుత్వ చర్యలన్నిటిని దీర్ఘోపన్యాసమున నిరసించిరి. సభ్యులకు వీరు అడ్వకేటు జనరలుపదవిని వదలిరని శ్రీ సత్యమూర్తిగారు వెల్లడింపఁగానే హాలునఁ గూడియున్నవారు జయధ్వానములు కొంతసేపుగావించిరి. ఆమీద నీక్రిందియంశములగూర్చి పత్రికలలోకొన్ని వ్యాసముల ప్రకటించిరి.

"భారతదేశమునంతటను అధికారులు ప్రజల ననేకవిధముల బాధపెట్టుచున్నందువల్లనే యీ దురంతముల సహింపలేక అడ్వకేటు జనరలుపదవినే గాక ప్రభుత్వము నాకిచ్చిన C. I. E. బిరుదమును గూడ వదలుకొంటిని. శాసనసభలో నధికారుల చర్యల నిరసించుచు నుపన్యాసములు సాగించితిని గాని యవి నిష్ప్రయోజనమగుటచే శాసనసభ్య త్వముగూడ వదలుకొంటిని. యూనివర్సిటీ పట్టభద్రులు నన్ను వారిప్రతినిధిగ నెన్నుకొనిరేగాని నావర్తనను వా రాక్షేపింపరనియే తలంచుచున్నాను. నావంటి జాతీయవాదులు ఇండియాకు నితర బ్రిటిషు డొమినియన్లగుండా స్వాతంత్ర్యము లభించుటకు నిరంతరము పాటుబడుట విధి కావున ప్రజాసామాన్యము నాకృషికి తోడ్పడు టవసరమని చెప్పుచున్నాను. శ్రీగాంధీతో నాకు అభిప్రాయ భేదము కలదు కావున, పాఠశాలలు, న్యాయస్థానములు, శాసనసభలు మున్నగువాని బహిష్కరించుటకు దేశము సంసిద్ధముగ లేదని, శాసనోల్లంఘన మసలే సాధ్యముకాదని నాయభిప్రాయము. ఇతర కాంగ్రెసునాయకుల యభిప్రాయములతో పైసందర్భమున నేను అనుకూలత కనబరచకపోయినను అధిక సంఖ్యాకులు శ్రీగాంధీగారి కృషికి తోడ్పడినచో నేను నాయంతరాత్మకు విరుద్ధముగా వర్తింపశక్యముకాదు. క్రిమినలు లా అమెండ్ మెంటు ఆక్టు మున్నగు చట్టముల రాష్ట్రాధికారులు అమలునఁ బెట్టుచున్నందున ప్రజాప్రతినిధు లైనమంత్రులుగూడ నిందుకు సహకారముగ నున్నారు. ఇట్టివారిని ప్రతినిధులుగా నెన్నుకొనక యుండుటకు కొంత ప్రచారముసాగింప నవసరము కావున నిందులకు ప్రజలసహాయము ఆశించుచున్నాను. కాంగ్రెసు సభలోనుండి ఏల కృషిసాగింపరాదని నన్ను కొందరు ప్రశ్నించిరి. కాని ఇప్పటి శాసనసభల వాతావరణమున జాతీయవాదిగాను సభ్యుడుగాను ఉండుట వీలుకాదని నేను భావించుచున్నాను.

కాంగ్రెసున శ్రీమా౯గారు ప్రవేశించినమీదట వీరిని ఇంటిలో సందర్శించుటకు కూడ వ్యవధిలేకపోయెను. ఇంటివారుకూడ వీరి నిరంతరప్రయోజనములకు ఆశ్చర్యపడెడివారు. తిథివారముల గణింపక తలచినప్పుడు ప్రయాణము సాగింతురు కావునను, వీరివెంబడి కాంగ్రెసు అనుయాయులు యెందరో రేయుంబవళ్లుందురు కావునను ఇంటివారు వీరితో మాట్లాడుటకు కూడ అవకాశములేక చిక్కుపడెడివారు. ఏయూరికిగాని కాంగ్రెసుపనిమీద వీరు వెళ్లినప్పుడు స్వంతఖర్చులతోనే ప్రయాణముల సాగించెడివారు. ఒక్కొక్కప్పుడు రెండవక్లాసు పెట్టెలోకూడ ప్రయాణము సాగించెడివారు. కాంగ్రెసు సూచించినట్లు పండిత శ్రీమోతీలాలు నెహ్రూ, శ్రీ సీ. ఆర్. దాసు మున్నగువారు కోర్టులకువెళ్లుటమానిరి కావున శ్రీమా౯గారుకూడ హైకోర్టునకు వెళ్లుట మానిరి. పాతకేసు లొకటిరెండు పరిష్కారము కాకయున్నందున దీనికిగాను ఎన్నడైన నొకరోజు కోర్టుకువెళ్లుదురేకాని క్రొత్తకేసులపట్టరైరి. ఇంటికివచ్చిన పాతకక్షిదార్లకు తనయభిప్రాయములను కోరినప్పుడు తెలియఁజేయుచుండెడివారు. రాబడి తగ్గినందున పరిస్థితికి తగినట్లు ఖర్చు తగ్గించుకొనుమని ఇంటివారిని అప్పుడప్పుడు హెచ్చరించెడివారు. శ్రీమా౯గారు కాంగ్రెసున చేరినమీదట ఆంజద్‌బాగ్ బంగళాకు నెందరో ప్రముఖులు వచ్చుచుండిరి. దూరప్రదేశములనుండి వచ్చువారు కొందరు వీరి బంగాళాలో బసచేసెడివారు. కాని ఇంటిలోని స్త్రీలకు అతిథులతో నే సంబంధములేక యుండెను. అతిథులు ఇంటిలోపలికి భోజనము సేయుటకు వచ్చినప్పుడు, భోజనముచేసి బయటకు వెళ్లునప్పుడును అతిథులను ఇంటివారు చూచుటకు అవకాశముండెడిది. ఏగొప్పవారు కాని శ్రీమా౯గారి యింట బసచేసి స్వస్థలములకువెళ్లుటకు ప్రయాణమగుచు శ్రీమా౯గారి భార్యకు నమస్కారములు చేసివెళ్లెడివారు. ఇట్టిఆచారము ఉత్తరహిందూస్థానమున గలదని తెలియుచున్నది. ఈయతిథులలో ఒకరగు శ్రీ మహదేవదేశాయి శ్రీమా౯గారి భార్యకు నమస్కారములుచేసి సెలవుపుచ్చుకొనుటను చూచి ఇంటిలోనున్నవారేకాక ఇంటికివచ్చియున్నవారు గూడ ఆశ్చర్యపడిరి. శ్రీగాంధీ, శ్రీస్వామి శ్రద్ధానందగారలు శ్రీమా౯ బంగాళాకు వచ్చినపుడు వీరిని లోపలికితీసికొనివెళ్లి ఇంటివారికి పరిచయము గావించినపుడు అందఱును వందనములసమర్పించిరి. శ్రీ గాంధీ ఆపిమ్మట శ్రీమా నింటివారిని దగ్గరకుపిలచి సంకోచములేక సంభాషించుచుండిరి. కాషాయ వస్త్రముల ధరించిన శ్రీశ్రద్ధానందగారు గంభీరముగ కనఁబడెడివారు. కావున వారిని సమీపించుటకు శ్రీమా౯ కుటుంబమువారు సాహసింపలేదుకాని దూరమునుండి నమస్కరించెడివారు.

1921 సం!! స డిసంబరు 27 వ తేదీన నహమ్మదాబాదున కాంగ్రెసుమహాసభసాగుటకు అన్ని యేర్పాటులు గావింపఁబడెను. శ్రీమా౯గారు అహమ్మదాబాదువెళ్లుటకై సెంట్రలు స్టేషనుకు వెళ్లిరి. ఈ కొంగ్రెసు సమావేశమునకు త్యాగధురీణులగు శ్రీ చిత్తరంజనదాసు అధ్యక్షులుగా ఎన్నుకోబడిరి. కాని ప్రభుత్వమువారు శ్రీదాసుగారిని కారాగారమున నిర్బంధించిరి. కావున హకీమ్‌అజీమల్‌ఖాను గారు శ్రీ సి. ఆర్. దాసుగారి స్థానమున అధ్యక్షులైరి. ఈకాంగ్రెసు సమావేశమునందు సహాయనిరాకరణ కృషివల్లనే భారతస్వరాజ్యము సంపాదింపఁబడవలెనని తీర్మానింపబడెను. ఏతీరున సహాయనిరాకరణ విధానమును ఆచరణలోపెట్టవలెనో అందుకవసరమైన సూచనలన్నియు కాంగ్రెసును వెల్లడియాయెను. అదిమొదలు శ్రీమా౯గారికి కాంగ్రెసు కార్యక్రమమున ఉత్సాహమధికమాయెను.

1922 సం!!న దేశమున అనేకసంభవములు తటస్థించెను. మలబారున మాప్లాలు అల్లరి ప్రారంభించిరి. ఉత్తరహిందూస్థానమున 'చౌరీచౌరా' కాల్పులుజరిగెను. దేశమంతట హర్తాళ్లు, దుకాణముల మూతలు సంభవించెను. దీనిఫలితముగా బొంబాయి నగరమున ఎన్నడులేని అల్లరి జనించెను. ఈపైసంభవములవల్ల గాంధీగారికి తన అహింసాసిద్దాంతముపై పట్టుదలహెచ్చాయెను. దీనిఫలితముగా బర్డోలీలో ప్రారంభింపఁదలచిన పన్నుల నిరాకరణ కార్యక్రమముసు ఆపివేసిరి. తనతీర్మానము గొప్ప పొరబాటని తనకుతెలియునుగాని విధిలేక పైతీర్మానము గావించితినని వెల్లడించిరి. ఆమీద గాంధీగారిపై రాజద్రోహనేరముమోపి వీరిని అధికారులు నిర్బంధించిరి. గాంధీగారు విచారణలో పాల్గొనననియు, తనకు శిక్షవిధించుటకు స్పెషలుకోర్టున కధి కారములేదనియుచెప్పి ఒక స్టేటుమెంటును వ్రాసి చదివిరి. ఈవిధముగ బ్రిటిషు ఆధికారవర్గమును గాంధీ తృణీకరించినందుకు భారతీయులేగాక విదేశీయు లెందరో సంతృప్తిజెందిరి. 1922 సం|| డిసంబరు 25 వ తేదీన గయలో కాంగ్రెసు సమావేశము అగుటకు ఏర్పాట్లుగావించిరి. శిక్షాకాలము పూర్తియయి విడుదలగావింపఁబడిన శ్రీ సి. ఆర్. దాసుగారు ఆధ్యక్షులుగా ఎన్నుకోఁబడిరి. ఈకాంగ్రెసున పండిత శ్రీమోతీలాలు 1923 సం!! న సాగింపఁబోవు రాష్ట్ర, ఢిల్లీ శాసనసభల ఎన్నికలలో కాంగ్రెసుకక్షవారు పాల్గొనవలెననెడి తీర్మానమును ప్రతిపాదింపసంసిద్ధులైరి. ఇందుకు శ్రీ సి. ఆర్ . దాసుగారుకూడ ఆమోదమునుసూచించిరి. కాని శ్రీగాంధీగారు కారాగారవాసీగాఉన్నప్పుడు ఇట్టి తీర్మానమును ప్రతిపాదించుట గొప్పపొరబాటని శ్రీ సి. రాజగోపాలాచారిగారు తిరుగబడిరి. అంతటితో తృప్తిజెందక శాసనసభలతీర్మానము నొకదానిని వీరు ప్రతిపాదించిరి. ఆమీదట గయకాంగ్రెసున రెండుకక్షలు ఏర్పడెను. శ్రీ రాజేంద్రప్రసాదు గారు రెండుకక్షలను సంతృప్తి గావింపఁదలచి కాబోలు తన అభిప్రాయమును ఉపన్యాసమున వెల్లడింపరైరి. కాని లోలోపల రహస్య ముగ శ్రీ సి. రాజగోపాలాచారిగారి తీర్మానమునకే ఆమోదము సూచించిరని అనేక కాంగ్రెసు డెలిగేట్లు గుర్తించిరి. ఇట్టి సందర్భమున శ్రీమా౯ అయ్యంగారు తన సవరణతీర్మానమును ప్రతిపాదింప యత్నించిరికాని శ్రీ రాజగోపాలాచారిగారు ఇందుకు సమ్మతింపరైరి. కావున శ్రీ రాజగోపాలచారిగారి అభీష్టమే నెరవేరెను.

గయ కాంగ్రెసునకు శ్రీమా౯అయ్యంగారితో నేను పెళ్లియుంటిని. అప్పుడు నేను ఆల్ ఇండియా కాంగ్రెసున సభ్యుఁడుగనుంటిని కావున, అనేక విచిత్రాంశములను గుర్తింపగలిగితిని, దేశాభిమానులమనియు, స్వార్థత్యాగముచేసినామనియు చెప్పుకొను నాయకుల వర్తనల చూడగ అనేకులకు అసహ్యము పుట్టించెను. తెనుగువారిలో శ్రీ కొండా వెంకటప్పయ్యకును, శ్రీ పట్టాభి సీతారామయ్యకు ఉన్న విభేదములవల్ల సకాలమున ఆంధ్రరాష్ట్రకాంగ్రెసు సభ డెలిగేట్ల ఎన్నికను సాగింపక కాలహరణము గావించి చివరకు గయలో పిండములు పెట్టుటకు, వచ్చిన వితంతువులను గూడ జేర్చి, శ్రీ పట్టాభిసీతారామయ్యగారు, శ్రీబ్రహ్మజ్యోస్యుల సుబ్రహ్మణ్యము గారును, డెలిగేట్లలిష్టునువ్రాసి అధ్యక్షులగు శ్రీ సి. ఆర్. దాసుగారికి అందించిరి. అప్పటికే నాకు శ్రీ సి. ఆర్. దాసుగారితో చక్కనిపరిచయ మేర్పడియుండెనుగాని శ్రీమా౯ఆయ్యంగారు శ్రీ సి. ఆర్. దాసుగారిని ఎరుగరు. అందుచే మేము మదరాసు నుండి 4 రోజులు ముందుగా ప్రయాణమై కలకత్తా చేరితిమి. కలకత్తాన గొప్పమార్వాడీ సాహుకారు శ్రీమా౯గారి కక్షిదారుడు గావున వారిభవనమున బసయేర్పాటాయెను. బ్రహాండమైన మోటారుకారున శ్రీమా౯ అయ్యంగారిని, నన్ను శ్రీచమేరియా కుమారుడు హౌరాస్టేషనునుండి వారిబసకు తీసికొని వెళ్లి వారి భవనమునఁ జేర్చిరి. మదరాసువంటవారిచే అద్భుతమైన వంటలగావించి, స్నానమునకై నూనె, శీకాయి మున్నగువాని నిప్పించిరి. నౌకరులు ముందు శ్రీమా౯ అయ్యంగారి వంటమనిషి స్నానమునకు ఏర్పాట్లు గావించిరి. వంటమనిషి స్నానముచేయగానే శ్రీమా౯గారికిని నాకును తలాఒక కప్పుకాఫీ తెచ్చియిచ్చి మరల భవనములోనికి వెళ్లెను. కొంతసేపటికి మావద్దకువచ్చి వంటప్రారంభించితిననియు, పావుగంటలో అన్నియు సిద్ధమగు ననగా మేము భోజనమునకు ముందు తలంటి స్నానముగావించి చేయుదు మంటిమి. శ్రీమా౯ ఆయ్యంగారు కావలసిన ఆహారము సిద్ధమగుటకు వ్యవధియగునని తలచి నన్ను చమేరియా సిద్దముగావించిన యాహారముభుజించి వెంటనే కారున శ్రీ సి. ఆర్. దాసుగారింటికి వెళ్లుమని ఆదేశించిరి. నేను భోజనము చేయగానే శ్రీ చమేరియా కుమారుని పిలచి నన్ను శ్రీ సి.ఆర్. దాసుగారి ఇంటికి కారున తీసికొని వెళ్లుమనిరి. నేను కారుఎక్కుచు తిండితినగానే శ్రీమా౯ గారిని శ్రీ సి. ఆర్. దాసుగారివద్దకు రమ్మని కోరుచు వారికై కారును పంపివేయుదునని చెప్పితిని. కాని ఎన్నిగంటలకు తాను రావలేనో శ్రీ సి. ఆర్ . దాసుగారు నిష్కర్షగా నాతో చెప్పినగాని తాను బయలుదేరనని చెప్పిరి.

శ్రీమా౯గారితో చర్చించుటవల్ల లాభముండదని నాకు తెలియుటవల్ల చమేరియా కుమారునితో బయలుదేరి రస్పారోడ్డునకు వెళ్లితిని. గొప్పకారు కావున అయిదారు మైళ్లలోనున్న శ్రీ సి. ఆర్. దాసు గారింటికి కొన్ని నిమిషములలో చేరుకొని, పైకి వెళ్లితిని. శ్రీ సి. ఆర్. దాసుగారి భవనమువారు సహాయ నిరాకరణోద్యమములో చేరుటకు ముందు వారి ఇల్లు వాకిలినుండి కత్నకంబళ్లతో కప్పఁబడి యుండెడిది. వీరు సునాయాసముగ బారిష్టరు వృత్తిలో నెలకు 30, 40 వేలు ఆర్జించెడివారు. ఆరోజులలో వీరు దుస్తులు 3 గంటలకు ఒకమారు మార్చెడివారు. ఇట్టి దేశత్యాగి సర్వస్వమును త్యజించి మేడమీద ఒక కొయ్య కుర్చీమీద కూర్చొని ఒక ముతకకంబళిని పైనకప్పుకొని గయ కాంగ్రెసుకు అధ్యక్షోపన్యాసము షార్టుహాండు టైపిస్టుచే వ్రాయించుచుండిరి. వారిముఖము చూడగానే నామనస్సున ఎన్నడునులేని సంకటము గలిగి మాటతోచక కొంతసేపుంటినిగాని వారు సన్ను ఆదరించి వచ్చినపనిని సూచించుమని కోరిరి. గయకాంగ్రెసునకు శ్రీమా౯గారు, నేను వెళ్లుచు మార్గమున శ్రీమా౯గారిని తమకు పరిచయము చేయుటకు కలకత్తాలో ఆగినట్లు చెప్పగానే వారిని లోపలికి దయచేయుమని ఏల చెప్పలేదని ప్రశ్నించిరి. వారు చమేరియాభపనమున ఆహారము పుచ్చుకొను చున్నారనియు, సెలవైనచోవెళ్లి పిలుచుకొనివచ్చెద ననియు చెప్పతిని. ఆమీద శ్రీమా౯గారిని వెంటబెట్టుకొని శ్రీ దాసుగారివద్దకు వచ్చితిని. పాట్నా హైకోర్టుజడ్జియు శ్రీ సి. ఆర్. దాసుగారి సోదరులు నగు శ్రీ సి. ఆర్. దాసుగారు జడ్జిపదవికి రాజీనామా ఇచ్చి తమ్మునిచూచుటకై వచ్చిరి. వీరురాగానే శ్రీ సి.ఆర్. దాసుగారు సిగరెట్ త్రాగుటనుచూచి అన్నిటిని వదలిపెట్టిన నీవు ఈపాడుసిగరెట్లుకాల్చు అలవాటును ఏల వదలిపెట్టలేదని ప్రశ్నించగా తనముందున్న బంగారు సిగరెట్టుకేసును కీటికీగుండా వీధిన పాఱవైచిరి. ఇందుకు అందరు ఆశ్చర్యచకితులైరి గాని, త్యాగమూర్తియగు దాసుగారునిర్లక్ష్యముగనుండిరి. శ్రీదాసుగారు తన అధ్యక్షోపన్యాసమందలి కొన్ని భాగములను శ్రీమా౯గారికి వినిపించి, ఆమీద రాజకీయ పరిస్థితులనుగూర్చియు, శ్రీ గాంధీగారి మొండిశిఖండిత్వమును గూర్చియు ముచ్చటించిరి. ఈలోగా నాటి అమృతబజారు పత్రిక రాగా దానిని శ్రీమా౯గారు చదువుచుండగ ఈలోగా నేను ఆంధ్ర కాంగ్రెసుకమిటీ ఉపాధ్యక్షుఁడనియు, డెలిగేట్ల ఎన్నికలపై ఏసమావేశము జరుగలేదనియు, శ్రీ పట్టాభి సీతారామయ్య మున్నగువారు తమకు తోచినపేళ్లను కొన్నిటిని నమోదుగావించిన ఒక లిష్టును, ఈదురన్యాయములన్నియు తనకు బారిష్టరు ఉన్నవ లక్ష్మీనారాయణగారు నాటిఉదయమే తెలియఁజేసిరనియు చెప్పిరి. డెలిగేట్ల (ఆంధ్ర) ఎన్నిక నక్రమముగ సాగనందుచే గయకాంగ్రెసు నకు ఆంధ్రడెలిగేట్లెవరును రాను వీలుకాదని తానొక ప్రకటనగావింప దలచినాననిచెప్పి అధ్యక్షుని హోదాలో తనకుతోచిన అయిదారుగురిని మాత్రమే డెలిగేట్లుగా పరిగణింతురని విస్పష్టము గావించిరి.

ఆమీద మరి కొంతసేపు శ్రీమా౯, శ్రీదాసు సంభాషించినమీదట నేను, శ్రీ అయ్యంగారు శ్రీ చమేరియా బసకు వచ్చిచేరితిమి. నాటిరాత్రి, తాను గయకుబయలుదేరనని శ్రీ సి. ఆర్.దాసు గారు చెప్పిరి. వంద బెంగాలు డెలిగేట్లతో మరునాడు ప్రయాణము. సాగింతుననియు, మరికొందరి రాకను ఎదురుచూచు చున్నాననియు వారు చెప్పియుండిరి. కాని స్పెషలు ట్రెయినున వెళ్లినచో శ్రమకు పాత్రుడనగుదునని శ్రీమా౯భావించిరి. ఆరాత్రియే నేను, వారు గయకు, ప్రయాణమైతిమి. ఉదయమునకు పాట్నాకు చేరితిమి.అచ్చట శ్రీమా౯ రాజగోపాలాచారిగారు నాకు కనఁబడిరిగాని మాపెట్టెలోకి రమ్మని కోరగా తాను ఇంటరుక్లాసుస కొందరు అనుచరులతో ప్రయాణము చేయుచున్నందున గయలో కలుసుకొందుమని చెప్పి వెళ్లిరి. సర్ తారకనాథ్‌పాలిత్ గారి అల్లుడును సుప్రసిద్ధన్యాయవాదియు నగు డులిప్‌సింగు శ్రీమానునకు గయక్లబ్బున బస కుదిర్చెను. మేము క్లబ్బున బసచేయగానే కొన్నిగంటలకు శ్రీమతి సరోజినీదేవి బసచేయుటకు క్లబ్బునకువచ్చి చేరెను. ఈక్లబ్‌కన్న చక్కనిప్రదేశము గయలోలేదు కావున మరికొందరు ప్రముఖులుకూడ క్లబ్బున బసకుదుర్చుకొనిరి.

జనసమ్మర్దము హెచ్చైనందున శ్రీమా౯గారు మరొకచోటికి బసను మార్చిరి. కాని తిండికి మాత్రము శ్రీ సరోజినీదేవిగారు మాత్రమేకాక, కె. భాష్యం, వీరితమ్ముడు సంతానము, వీరిభార్య, శ్రీ యం. కె. ఆచార్య, శ్రీ వి. ఎల్. శాస్త్రి మున్నగువారు వచ్చుచుండిరి. ఇందరికి భోజనాలు సిద్ధము గావించుటకు శ్రీఅయ్యంగారి వంటమనిషి. కస్తూరికి శ్రమకలిగెనుగాని ఇందరికిని సంతృప్తిగా ఆహార పానీయములను సకాలమున సిద్ధముచేయుచుండెను. నాటిరాత్రి శ్రీమా౯గారు తన సవరణ తీర్మానమును గూర్చి కాంగ్రెసుమహాసభ ఆవరణమున సభసాగించుటకు నేను, శ్రీ వి.ఎల్.శాస్త్రి, శ్రీ నేలనూతుల సుబ్బరాయుడు మున్నగువారు అన్ని ఏర్పాట్లనుగావించి, భోజనమునకై ఇంటికిరాగా, మరల మేముసభకువెళ్లులోగా శ్రీ రాజగోపాలాచారిగారు మేము నిర్దేశించిన ప్రదేశమున సభసాగించి శ్రీమా౯ తీర్మానమునకు విరుద్దముగా ఒక తీర్మానము నెగ్గించిరి. ఈసభకు వెళ్లనని మాకు మాటయిచ్చిన శ్రీ సరోజినీదేవి రాజాజీ సభలో ఉపన్యాసముగూడ గావించెను. తిరునల్వేలి మహాసభలో శ్రీ కస్తూరిరంగయ్యం గారు వర్తించినట్లు గయలో శ్రీ సరోజినీదేవి వర్తించుట శ్రీమా౯ గారికేకాక అనేకులకు అసంతృప్తి కలిగించెను. ఎంతజెప్పినను శ్రీమా౯ వినక తనసభను సాగింపక బసలో నిద్రించిరి.

గయకాంగ్రెసు సమావేశమైన పిదప కాంగ్రెసున రెండు కక్షలేర్పడెను. శాసనసభలను కాంగ్రెసు బహిష్కరింప వలెనసు కక్షకు శ్రీ రాజగోపాలాచారిగారు నాయకులైరి. శాసనసభలలో కాంగ్రెసువారు ప్రవేశించి కార్యక్రమము సాధనచేయుటయే విధియని తలచిన స్వరాజ్యకక్షకు శ్రీ సీ. ఆర్. దాసుగారు నాయకులుగా గణింపఁబడిరి. తొమ్మిది మాసములు ఈరెండుకక్షలును దేశమంతట వారి సిద్దాంతములకై ప్రచారము సాగించిరిగాని ఆ మీద ఉభయ కక్షలలోనివారు ఒకమోస్తరు రాజీ గావించుకొనిరి. మతసంబంధమైన ఆక్షేపణయో వారి అంతరాత్మయో అడ్డముతగలనిచో ఇష్టమున్న వారు శాసనసభలను కాంగ్రెసుపక్షమున ప్రవేశింప వచ్చునని పై రాజీ సూచించెను.

చెన్నపట్టణము రాగానే శ్రీమా౯గారు మదరాసు కార్పరేషను ఎన్నికలకు కాంగ్రెసు అభ్య ర్థులనునిలిపి జస్టిసుకక్షను తుదముట్టింపవలెనని వెల్లడించి కాంగ్రెసు కక్షవారిని కొందరిని మదరాసు కార్పొరేషను ప్రవేశించునట్లు చేసి శ్రీసామివెంకటాచలముశెట్టికి మేయరుపదవి లభించునట్లు చేసిరి. కార్పొరేషను ఎన్నికకు నిలువఁబెట్టిన 10 మందిలో 7 గురుమాత్రమే ఈఎన్నికలో జయమొందిరి. అదిమొదలు శ్రీమా౯గారు కార్పొరేషను వ్యవహారములలో పూర్తిగా జోక్యము కలిగించుకొని తనఅభిప్రాయమును అనుచరులద్వారా ఆచరణలో పెట్టుచుండిరి. శ్రీ సి. ఆర్. దాసు గారు అప్పటికి ముందే కలకత్తా కార్పోరేషను తనకైవశము గావించుకొనిరి. కాంగ్రెసు కక్షవారికి మదరాసు రాష్ట్రమున ప్రాముఖ్యత కుదిర్చిన మీదట ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలకై శ్రీమా౯ అయ్యంగారే గాక కాంగ్రెసుకక్షవారనేకులు రేయుంబవళ్లు పాటుపడిరి. మదరాసునందే కాక పై జిల్లాలలోగూడ ఎన్నడునులేని ఉత్సాహము జనించునట్లు శ్రీమా౯గారు ప్రచారముసాగించిరి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో స్వరాజ్యకక్షవారు ప్రముఖ మితవాదులగు డాక్టరు సర్ శ్రీపరంజపై , సర్ శ్రీ సి. వై . చింతా మణి, సర్ శ్రీసురేంద్రనాథ బెనర్జి మున్నగువారిని ఓడించిరి గావున స్వరాజ్య కక్షవారన్ని చోట్లలోను ప్రాముఖ్యత చెందవీలాయేను. మదరాసు రాష్ట్రమున జస్టిసుకక్ష ప్రముఖులగు శ్రీ పానగల్లురాజా, సర్" ఎ. పి. పాత్రో, సర్ శ్రీ శివజ్ఞానము మున్నగు వారందరు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అపజయమొందిరి. శ్రీ ముత్తురంగ మొదలారి, శ్రీ సత్యమూర్తి, శ్రీ కె. భాష్యం మున్నగువారు గెలుపొందిరి. శ్రీమా౯ అయ్యంగారు అభ్యర్థిగ నిలచి ఢిల్లీ అసెంబ్లీ సభ్యులైరి. ఈఎన్నికల ప్రచారము శ్రీమా౯ నాయకత్వమున సాగునపుడు వీరి సంచారమున రోజూ ఉపన్యాసములును, అనేకచోట్లలో సభలు సాగించినందుచే వీరికి తీరికయే లేకయుండెను. ప్రతికూల కక్షవారనేకులు వీరిని తూలనాడిరి గాని వీరు నిర్లక్ష్యముగ నుండిరి.

చెన్నపట్టణమున ఉన్నప్పుడు ఉదయము బయటికి బయలుదేరినచో రాత్రి 11, 12 గంటలకు మరల ఇంటికి వచ్చెడివారు. ఇంటికిరాగానే ఇంటివారందరు నిద్రలేక చీకాకుషడుచుందురు. డ్రైవరు, వీరితో కారునవెళ్లిన కాంగ్రెసు అనుచరులు మున్నగువారిని ఇంటివారు ప్రశ్నించి ఏయే చోట్లలో రాళ్లు విసరిరో, ఎచ్చట అల్లరిసొగెనో మున్నగు వివరములను తెలిసికొనెడివారు. దైవకృపవల్ల ఏలాటి అపాయములేక శ్రీమా౯ ఇల్లు చేరినందుకు సంతృప్తిని చెందెడివారు. రాత్రి రేడియో ద్వారా నిరంతరము వీరు అభ్యర్థులకు గావించు సలహాలవల్ల ఎంతయో నెమ్మదియైన పరిస్థితి ఏర్పడెను. మదరాసు నగరమున జస్టిసు కక్షను తుదముట్టించుటకు వీరు కనఁబఱచిన పట్టుదల, శ్రద్ధ ఎవరును చూపరైరి. దానివలన వీరు ప్రవేశించని వీథిగాని, సందుగాని, ఇల్లుగాని లేనందున జస్టిసు కక్షవారు వ్యక్తి దూషణకు ప్రాముఖ్యత నివ్వసాగిరి. దాదాపు 20 సం||లకు పైగా బ్రిటిషు అధికారులదయకు పాత్రులైన జస్టిసు ప్రముఖులు మూలబడిరి. ఒకరోజున చెంగల్పట్టుజిల్లా ఎన్నికల ప్రచారమునకై ఉదయము బయలుదేరి వెళ్లి రాత్రి 12 గంటలకు బంగాళా వచ్చి చేరిరి. చెంగల్పట్టు సమీపమునందలి చెరువుమీద కారువెళ్లుచుండగా దుండగులు కొందరు అచ్చ టచ్చట బాటలందు కొన్ని చెట్లను పడవేయుటయే గాక ఒక ఇరుకు ప్రదేశమున కఱ్ఱతో వీరిని కొట్టవలయునని యత్నించిరి. ఇది శ్రీమా౯ గారికి ముందే తెలిసినందున ధీరుఁడగు ముస్లిం డైవరుతో వారు కొట్టుటకురానీ ఒక చేయి చూచుకొందము అని చెప్పినమీదట డ్రైవరు అతివేగముగ కారును వదలెను. కారుటాపుమీద రాళ్లుపడెనుగాని మరియే అపాయము లేక శ్రీమా౯గారు బంగాళాచేరిరి. కాంగ్రెసు పనులలో శ్రీ సత్యమూర్తి, శ్రీ రంగస్వామి అయ్యంగారు, శ్రీ కల్యాణసుందర మొదలారి, శ్రీ ముత్తురంగమొదలారి, జనాబ్ హమీద్‌ఖాను, జనాబ్ షాఫీమహమ్మద్, నేను, జయవేలు శ్రీమా౯గారి యింటికి పలుమారు వెళ్లుచుండెడివారము. శ్రీ కల్యాణసుందర మొదలారి జస్టిసుకక్షలో చేరుటకు నిరాకరించినందున వారిపై శ్రీమా౯గారికి అభిమాన ముండెడిదిగాని నావంటివారు శ్రీ మొదలారిగారికి కూడ కొంత బ్రాహ్మణద్వేషము కలదని గుర్తింప గల్గితిమి. శ్రీ మొదలారిగారి అరవభాషయందలి చక్కని పాండిత్యమునకు నేనేగాక శ్రీ సత్యమూర్తి వంటివారుగూడ వారిని ప్రశంసించెడివారేకాని, వారిని నాయకులుగ నెన్నడును పరిగణింపలేదు గావున శ్రీమా౯గారు నావర్తనను ఆక్షేపించెడివారు. తామేదైన అరవమున ప్రచురింపదలచినచో శ్రీ అయ్యంగారు శ్రీ కల్యాణసుందరమొదలారిగారిని సవరింపుమని కోరెడివారు. శ్రీ కల్యాణసుందరమొదలారి యెందున కాని పట్టుదల చూపువారు కారు. తమ పత్రికాప్రచారము గ్రంథవిక్రయము హెచ్చగుటకు నిరంతరము పాటుబడుచు 'హోంరూలు' రోజులలో శ్రీ సి. పి. రామస్వామిఅయ్యరుగారివద్ద కొన్నివేలు పుచ్చుకొన్నట్లే శ్రీమా౯గారివద్ద గొప్పమొత్తములను పుచ్చుకొనుచుండిరి. వీరిని శ్రీ ఆనిబిసెంటు ఒక కార్మికనాయకునిగావించెనుగాని శ్రీ మొదలారి స్వార్థమువల్ల కార్మిక ఉద్యమము క్రమేణ పాడాయెను. ఈ మొదలారేకమ్యూనిష్టుల పిలిచి శ్రీ వాడియా, శ్రీ అరండేలు మున్నగువారు యెంతో శ్రమపడి నిర్మించిన మదరాసు లేబరు యూనియసును కమ్యూనిష్టులకైవశముగావించిరి.

చాలరోజులు శ్రీమా౯గారికి అభిమాన మధికముగనుండెను. అప్పట్లో తనకారును పంపి శ్రీ సత్యమూర్తిగారిని తమ బంగళాకు పిలిపించెడువారు. కొద్దిరోజులలో ఉదయము వెళ్లినకారు 12 గం!! వరకు తిరిగి రానప్పుడు డ్రైవరును ప్రశ్నింపగా శ్రీసత్యమూర్తిగారు స్నానముచేసి, తిండితిని బయలుదేరి వచ్చినందుచే ఆలస్యమాయెనని చెప్పెడివారు. కారు దిగగానే శ్రీసత్యమూర్తి శ్రీమ౯గారిని సమీపించి 'అయ్యా ! నన్నేల పిలిపించితిరి' అని అడిగెడువారు. అందుకు శ్రీమా౯ 'మనడివిజ౯లో మనకు ఓట్లురావని వినుచున్నాను. ఓట్లన్నియు జస్టిసు కక్షవారికే లభించునని కొందరు చెప్పుచున్నారు. ఇందుకు ప్రతీకారముగ మనము ఏదైన కృషిసాగింపనిచో ఏమియు ప్రయోజనము లే'దని అనెడివారు. 'శ్రీనివాసయ్యంగారూ, ఎందుకు మీరు భయపడుచున్నారు? జస్టిసుకక్ష తుడుచుకొనిపోవుట నిజము, వీరు వారు చెప్పుమాటలను తామువినక ఫలితమును ఎదురుచూడగోరితిని. ఇదే నాసలహా' అని శ్రీ సత్యమూర్తి చెప్పెడివారు. ఈమాటలను వినగానే శ్రీమా౯గారు సంతృప్తిచెంది. 'అయినను మనము అశ్రద్ధగనుండరాదు. చేయదగినప్రయత్నము లన్నిటిని సాధించినగాని కొంతకాలము అధికారముననున్న కక్షవారిని పడగొట్టుటకు వీలుకాదు.' అని చెప్పెడువారు. శ్రీ సత్యమూర్తిగారు ఇంగ్లాండున రాజకీయ ప్రచారము జయప్రదముగ సాగించి చెన్నపట్టణమునకు రాగానే వారి గౌరవార్థము నేను సౌందర్య మహలులో ఒక మహాసభను సాగింపదలచి శ్రీమా౯గారిని ఆ సభకు అధ్యక్షులుగ నుండుడని కోరితిని కాని మొదలు వీరు అంగీకరించక ఆమీద సభకువచ్చుటకు సమ్మతించిరి. సభ 5 గంటలకు ప్రారంభమగునని ప్రకటింపబడినందుచే వేలకుపైగా జనము హాలులోను, రెండుమూడువేలమంది ప్రజలు బయటను కూడియుండుటను జూచి కారుమీద హైకోర్టుకు వెళ్లగా శ్రీమా౯ కోర్టున ఒకకేసు పూర్తిగావించుకొని 2 గంటల మొదలు కోర్టున ఒక కేసున వాదించుచుంటిననియు, బడలికగా నున్నాననియు, సభకువచ్చుట కష్టమనియు చెప్పిరికాని నా ప్రోత్సాహమువల్ల సభకువచ్చి నాపరువును దక్కించిరి. వీథిన వేలకొలదిజనము మూగియుండు టనుజూచి, అందరు బయటనున్నప్పుడు హాలులోని కొందరికిమాత్రము వినునట్లు సభాక్రమముసాగుట వారికి మనస్కరింపక యుండెను. కాని సభను ప్రారంభించి, చక్కని యుపన్యాసముసాగించి, ఇతరు లెవ్వరిచేతను చేయసాధ్యము కాని పనులను నిర్వహించుశక్తి శ్రీసత్యమూర్తిగారికి కలదనియు, ధైర్యముగ చక్కని యుపన్యాసములను గావించుట వీరి కలవాటనియు, ఆంగ్లమునందేగాక అరవమున గూడ ఎన్నియో సభలలో వీరుపన్యసించియున్నారనియు, వీరి యుపన్యాసముల విన్నవారు ఇంగ్లాండున వీరిని అభినందించుచున్నారనియు శ్రీమా౯గారు చెప్పిరి. చివర శ్రీ సత్యమూర్తిగా రుపన్యసించుచు తన కృతజ్ఞతను వెలిబుచ్చుచు శ్రీమా౯గారికి తాను శిష్యుడనియు, తనకు వా రెంతో సహాయము అనేక సందర్భములలో గావించిరనియు చెప్పినమీదట సభాధ్యక్షుల వందనములతో సభ ముగిసెను.

స్వరాజ్యపార్టీ

శ్రీ చిత్తరంజనదాసుగారు చెన్నపట్టణమువచ్చి కొంతప్రచారము సాగించినమీదట శ్రీ ఏ. రంగస్వామిఅయ్యంగారు, శ్రీ యస్. సత్యమూర్తి, శ్రీ వేమవరపు రామదాసుషంతులు మున్నగువారు బైటిజిల్లాలలో స్వరాజ్యకక్షకై ప్రచారము సాగించిరి. నేను దక్షిణ ఆర్కాటు, నెల్లూరుజిల్లాలకు శ్రీదాసుగారిని తీసికొనివెళ్లితిని. కడలూరు, విళుప్పురము, చెంగల్పట్టు, గూడూరు, నెల్లూరు మున్నగుచోట్లలో శ్రీ దాసుగారు గావించిన గంభీరోపన్యాసములను విన్న వేలకొలది ప్రజలలో కొంత సంచలన మేర్పడి అనేకులు స్వరాజ్యకక్షలోచేరి ఎన్నికలలో పాల్గొనుటకు నిశ్చయించుకొనిరి. ఎన్నికలలో ఈస్వరాజ్య కక్షవారికి మద్రాసు శాసనసభలో మెజారిటీ లభింప లేదుగాని కొన్నిస్థానములు వీరి యధీనమాయెను. అప్పట్లో కాంగ్రెసు వ్యవహారములను నిర్వహించు చుండిన శ్రీమా౯ యస్. శ్రీనివాసఅయ్యంగారు స్వరాజ్యకక్షలోచేరుటకు వీలుకాదని చెప్పిరి. శ్రీ ముత్తురంగమొదలారి హమిద్‌ఖాను శ్రీస్వామి వెంకటాచలంశెట్టి మున్నగు అనుచరులతో వ్యవహరించెడివారు. వీరందరును శ్రీమా౯గారి సహాయమున జస్టిసుకక్షవారిని ఓడించి మదరాసు కార్పరేషనున ప్రవేశించియుండిరి. దీనికిముందే కార్పరేషను సభ్యులైన శ్రీ సత్యమూర్తిగారికున్న వాగ్ధోరణి, అనుభవము, వాదనైపుణ్యము వీరికి లేనందున శ్రీ సత్యమూర్తిగారే కార్పరేష౯ కాంగ్రెసు పార్టీకి నాయకులైరి. అందుకై పై శ్రీ మొదలారి, శెట్టి మున్నగువారికి శ్రీ సత్యమూర్తిపై అసూయ జనించి ప్రతిరోజు శ్రీమా౯ గారిని సందర్శించుచు శ్రీ సత్యమూర్తిపై నిందల నారోపించుచుండెడి వారు. ఈ కారణమువల్ల శ్రీమా౯గారి మనస్సున మార్పు జనించి శ్రీ సత్యమూర్తిగారని నిరసింప ప్రారంభించిరి. శ్రీ సత్యమూర్తిగారు ఢిల్లీ అసెంబ్లీ సభ్యులైనమీదట శ్రీమా౯గారికిని శ్రీ సత్యమూర్తికిని వైషమ్యములు హెచ్చాయెను. ఇందుకుకూడ ఢిల్లీ అసెంబ్లీసభ్యుడైన శ్రీ ముత్తురంగ మొదలారి శ్రీ వెంకటాచల శెట్టిగారలే ముఖ్య కారకులని నిష్కర్షగా చెప్పగలము. బాహ్మణులపై జస్టిసు పార్టీకున్న నిరసనభావము కాంగ్రెసునందలి బ్రాహ్మణేతరులలో కలదు కావుననే నాటిమొదలు నేటివరకు కాంగ్రెసున ఎన్నియోకలతలు ఏర్పడియున్నవి. శ్రీమా౯గారు అనుచరులందరిలోను శ్రీ ముత్తురంగమొదలారిపై అభిమానము హెచ్చుగ కనబరచుచుండిరి. వీ రొకరే చివరవరకు విశ్వాసముతో వర్తించిరని తలచుచు శ్రీమా౯ కాంగ్రెసును వదలినప్పుడు వీరి పదవులను కొన్నిటిని వారికి లభింప జేసినందుచే అరవరాష్ట్ర కాంగ్రెసుకమిటీకి శ్రీ మొదలారి అధ్యక్షులైరి.

మదరాసు క్రిస్టియనుకాలేజీలో చాలకాలము ఇంగ్లీషు ట్యూటరుగ నుండినవారును జస్టిసుకక్షలో ప్రముఖులగు శ్రీ ఓ. ధనికాచలముచెట్టి సోదరులును అగు శ్రీ ఓ. కందస్వామిచెట్టి మదరాసు హిందూ సాంఘిక సంస్కరణసభకు కార్యదర్శిగ సున్నప్పుడు శ్రీమా౯గారి దగ్గరకు పలుమారు వచ్చుచుండెను. ఆమీద కొన్నిరోజులకు కాలేజీ నౌకరి వదలినమీదట శ్రీ కందస్వామి మదరాసు కార్పరేషను ఎన్నికలలో పాల్గొనదలచి శ్రీ అయ్యంగారిని ఆశ్రయించి కాంగ్రెసు అభ్యర్థిగా నిలబడెను. ఇందుకు ముందే శ్రీ కందస్వామి జస్టిసుకక్షవదలి కాంగ్రెసున జేరినందుకు జస్టిసుకక్షనాయకులు శ్రీ కందస్వామిని దూషించిరని హైకోర్టున నొక పరువునష్ట దావాను శ్రీ పానగల్లురాజాపై దాఖలు చేసిరి. ఈ కేసువిచారణ సక్రమముగా సాగుటకు శ్రీమా౯గారు సహాయపడిరి. కాని జడ్జి ఒక్కదమ్మిడీ జుల్మానా విధించెను. ఆ దమ్మిడీని కందస్వామికి పరిహారముగ నివ్వమని చెప్పెను. ఆమీద కార్పరేషను ఎన్నికలో ప్రచారమునకై ఏయింటికి శ్రీ కందస్వామివెళ్లినను ఒకదమ్మిడీశెట్టిగారు వచ్చిరని కేకలువేసి వారికి వోట్లు యివ్వవద్దనిరి. ఈ ఎన్నికలో శ్రీ వి. ఎల్. శాస్త్రి గారికి ప్రచారము సాగించినందుకు గిట్టని దుండగులెవరో కఱ్ఱలతో బాదిరి. ఈ ఎన్నికలనాడు జస్టిసుకక్ష అల్లరివల్ల శ్రీ కందస్వామిగారికి ఓటు ఇవ్వదలచెడివారు గూడ పోలింగు స్టేషనుకు వెళ్లుటగూడ కష్టమాయెను. కావున వీరు అపజయమొందిరి. అనేకులు శ్రీమా౯గారివద్ద ద్రవ్యసహాయము పుచ్చుకొనువారు. శ్రీ కందస్వామివలె సొమ్ము లాగుకొనువారు మరొకరు లేరని అనేకులు భావించుచుండిరి. వీరికి తంబుశెట్టి వీథిలో ఇల్లుగలదుగాని ఆరోగ్యమునకై సెంటుథామస్ మౌంటున ఒక ఇంటిని నిర్మించుకొని చెన్నపట్టణపు ఇంటిని అద్దెకిచ్చి మౌంటు ఇంటిలో వాసముండెడివారు. తాజెడ్డకోతి వనమెల్లజెరచెనసు లోకోక్తి ప్రకారము శ్రీమా౯గారిని ప్రోత్సహించి, మౌంటులో తన యింటిసమీపమున నొక బంగళా నిర్మించుకొనునట్లుచేసిరి. ఈబంగళాలో శ్రీ అయ్యం గారు పదిరోజులుండినట్లు తోచదు. శ్రీ టి. ఆర్. వెంకట్రామశాస్త్రి జబ్బుగనున్నపుడు ఈ బంగళాలో నుండగా ఒకమారు వారిని నేను సందర్శించినప్పుడు నెందుకు ఈ బంగళాను శ్రీమా౯గారు నిర్మించిరని నాలో నేను ప్రశ్నించుకొంటిని. శ్రీమా౯గారికి సంగీతమున అభిరుచి లేకున్నను శ్రీ సుబ్రహ్మణ్యభారతి పాటలను అప్పుడప్పుడు వినుటవల్ల అరవపాటలపై మోజు ఏర్పడెను. ముఖ్యముగా దేశీయగీతములను (భారతి గారివి) యెవరైన పాడినచో వారిని అభినందించెడివారు. జస్టిసుకక్షవారు అధికారమున యున్నపుడు శ్రీసుబ్రహ్మణ్యభారతిగారి పుస్తకములను వెలివేసిరి. అప్పుడు మదరాసు శాసససభలో కాంగ్రెసు కక్షవారు కొద్దిమంది సభ్యులుగనుండిరి. కాని వీరిలో ప్రముఖులును అనుచరులును అగు శ్రీ సత్యమూర్తిని ఒక నిరసన తీర్మానము ప్రతిపాదింపుమని తానే తీర్మానము వ్రాసియిచ్చి, ఎన్నడును శాసససభకు వెళ్లని శ్రీమా౯గారు ఈ తీర్మాన ప్రతిపాద నప్పుడు అసెంబ్లీన అధ్యక్షుని పీఠముక్రింద ప్రభుత్వోద్యోగులు కూర్చొసుచోట ఆసీనులైరి. సభ ప్రారంభమయి ప్రశ్నోత్తరములు పూర్తికాగానే అధ్యక్షులు శ్రీ సత్యమూర్తిగారిని తీర్మాన మును ప్రతిపాదింపుమని కోరిరి. శ్రీ సత్యమూర్తిగారు లేచి, తన నాయకులేగాక భారతదేశీయమహాసభ నాయకులలో ప్రముఖులైన శ్రీమా౯ యస్. శ్రీనివాసఅయ్యంగారి సమక్షమున తా నీ తీర్మానమును ప్రతిపాదించి, దీనిపై మాట్లాడుటవల్ల తన కెన్నడు లేని గౌరవము లభించెనని చెప్పుచు గంటసేపు జడివాన కురిపించిరి. జస్టిసు కక్షనాయకులు శ్రీ పానగల్లు రాజాగారిని ఉపన్యాసమున శ్రీమా౯ తూలనాడెనని శ్రీ ఎ. రామస్వామిమొదలియారులేచి బుకాయించెను. కాని శ్రీ సత్యమూర్తిగారు వెంటనే, శ్రీమా౯గారి కాలి బూడ్సును తుడుచుటకు గూడ తాహత్తులేనివారు మంత్రులగుట దేశ దౌర్భాగ్యమును సూచించుచున్నదని చెప్పిరి. ఈ తీర్మానమును జస్టిసు కక్షవారు ఓడించిరి కాని, దీని ఫలితముగ ముందు ఎన్నికలలో అనేకస్థానములను కోల్పోయిరనుట నిర్వివాదాంశము. ఎన్నికలప్పుడు శ్రీమా౯గారి కుమారుడేగాక కుమార్తె శ్రీ అంబుజమ్మాళ్ కొంతప్రచారము సాగించిరి. పైకి కనబడకుండ శ్రీ పార్థసారథి (శ్రీమా౯ కుమారుడు) ఎన్నోపనులను నిర్వర్తించుచుండెను. ఈఎన్నికలన్నిటిలోను కాంగ్రెసు అభ్యర్థులు జయమొందిరని ఇదివరకే చెప్పియుంటిని. 1925 సం!!న గాంధీగారు మదరాసునకు వచ్చుట తటస్థించెను. అప్పుడు 3 రోజులు శ్రీమా౯ బంగళాయందు బసపెట్టుకొనిరి. ఒకరోజు సాయంత్రము శ్రీమా౯గారి భార్యను పిలచి అడ్వకేటు జనరలుపదవిని తమ భర్తగారు వదలిపెట్టినందుకు మీకు విచారము కలుగలేదా అని ప్రశ్నించిరి. అందుకు శ్రీమా౯గారి భార్య ఇప్పుడు మాత్రము నాభర్త దర్జాకు ఏలోపము ఉన్నట్లు నాకు కనబడదు అని చెప్పరి. కాంగ్రెసు సేవకులు నాభర్తగారికి రాజోపచారములు గావించుచు వీరిని ఒక ప్రభువుగ భావించు చున్నందున ఎవరికిని ఏవిచారము లేదని చెప్పిన మీదట గాంధీగారు నవ్విరి. గాంధీగారు ఇంటిలోపలి హాలులో ఉన్నపుడు దొడ్డిత్రోవలో కొందరు వారిని సందర్శించుటకు వారియొద్దకు వచ్చిరి. శ్రీ గాంధీగారు నవ్వుచు ముందుహాలున కాపలాగానున్న శ్రీమా౯గారిని గూడ మీరు ఏమార్చి లోపలికి ప్రవేశించితిరా అని వచ్చినవారిని అడిగిరి. దొడ్డిత్రోవన వచ్చినందుకు శ్రీమా౯ ఇంటివారు బాధపడుటనుజూచి శ్రీ గాంధీగారు ఈ బంగళా ఒక ధర్మసత్రముగ కనబడుచున్నపుడు. ఎవరు లోపలికి రారని వారిని ఓదార్చిరి. మరొక పర్యాయము చెన్నపట్టణమునకువచ్చి, శ్రీమా౯ బంగళాన బసచేసినపుడు శ్రీమా౯గారితో ప్రథమమున నేను మీ ఇంటివాకిలి గదిలో నుంటిని. రెండవపర్యాయము నేను ఇచ్చటికి వచ్చినపుడు లోపలి హాలునకు వెళ్లితిని. మూడవ పర్యాయము నేను వచ్చినపుడు నా భార్యను వంట ఇంటికే తీసికొని వెళ్లితిని. కావున విలువ క్రమేణ ఏర్పడినదని తలచుచున్నాను' అనిరి. శ్రీ గాంధీ శ్రీమానుల మధ్య అభిప్రాయభేదములు గలవుకాని శ్రీ గాంధీగారిపై శ్రీ మాణ౯గారికి ఒకమోస్తరు గౌరవముండెడిది. కావుననే అప్పుడప్పుడు వారి గుణాతిశయములను గూర్చి ఇంటికివచ్చినవారితో ముచ్చటించెడివారు. శ్రీ గాంధీగారు తమయింట బసచేసినపుడు శ్రీ గాంధీగారి ప్రక్కన కూర్చొని అన్నిపనులను జూచెడువారు.

జాతీయవాదులు యెవరుగాని కారాగారములను ప్రవేశించుట పనికిమాలినపని అని శ్రీమా౯గారు అభిప్రాయపడుచుండెడివారు. తాను కావలెనని కారాగారప్రవేశము ఎన్నడును కోరననియు, అధికారులు పట్టుబట్టి తన్ను నిర్బంధించినచో విధిలేక కారాగారమున నుందుననియు, తన కెన్నడును కారాగారభయము లేదనియు చెప్పెడివారు. సైమనుకమీషను మదరాసుకు వచ్చినపుడు ఏర్పడిన అల్లరులు చరిత్రాత్మకములైనవి గాన ఆ అల్లరుల వివరములగూర్చివ్రాయుట అనవసరమని తలచుచున్నాను. కమీషనువచ్చినరోజున శ్రీమా౯ ఒక నల్ల జెండాను చేతబట్టుకొని కాంగ్రెసు సేవకులతోను వాలంటీర్లతోను ఒక ఊరేగింపు సాగించిరి. వీరు అనవసరముగా నెవరినిగాని నిర్బంధింప యత్నింపరుకాని ప్రజలు ఉత్సాహపూరితులైనందున అల్లరిజనించి రాళ్లు విసరిరి. 'లాటీచార్జి సాగినచో తా నెంతమాత్రము ఈ సంభవమును చూచువాడను కాను. ఊరేగింపును అధికారులు అడ్డగింతురు కావున ప్రజలందరును నెమ్మెదిగా, కేకలువేయక తనవెంబడి రావలెనని ఆదేశించిరి. కాని ఏమి తటస్థించునో అని అందరును భయపడిరి. మెరీనా సమీపమున యూనివర్సిటీభవనముల దగ్గరనున్న వారధిమీదుగా ఊరేగింపు వెళ్లుచున్నపుడు సాయుధపోలీసులు అడ్డపడి అందరిని వెనుకకు వెళ్లిపొమ్మని కోరిరి. కల్లకపటములు శ్రీమానునందు ఇసుమంతయు కనబడవు గాన ఇంటిలోగాని సభలోగాని ఏమాటలు పల్కుచుందురో వానినే పోలీసు అధికారులయెదుట పల్కిరి. కోపిష్ఠి గావున మండిపడుచు వీరు చెప్పినమాటలు పోలీసు అధికారుల మనస్సులనుగూడ కలవరపెట్టెను. మిత్రుడును విరోధి, ధనవంతుఁడు బీద అనుభేదములు వీరు పాటింపలేదు. మనస్సున తలచినదానిని చెప్పినమీదటనే వీరి కోపము తగ్గును. కాశీవిశ్వవిద్యాలయమునకును, మదరాసు విశ్వవిద్యాలయమునకును, రామనాథపురమునందలి లైబ్రరీ మున్నగువానికిని వీ రిచ్చిన విరాళములగూర్చి చెప్పియుంటిని. తెనుగుదేశము నుండి కాంగ్రెసుకు సంబంధించినవారు ఎవరైనను వీరివద్దకువచ్చి సహాయము కోరినచో వెంటనే గావించెడువారు. మహర్షి శ్రీ బులుసు సాంబమూర్తి, శ్రీమద్దూరి అన్నపూర్ణయ్యగార్లకు వారు కోరినపుడెల్ల గొప్పమొత్తముల నిచ్చిరి. శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల సత్యాగ్రహము సాగించునపుడు నాద్వారా వారికి వేయిరూపాయలు ముట్టజెప్పిరి. శ్రీ ప్రకాశముగారి స్వరాజ్యపత్రిక ఇబ్బందులకు లోనై చిక్కుపడుచున్నప్పుడు నేను 10 వేలు అప్పుగ నిప్పించితినిగాని ఈమొత్తమును స్వరాజ్యకంపెనీవారు తిరిగి వారి కివ్వరైరి.

శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి బందరు జాతీయకళాశాలకు ఏటా గొప్పవిరాళము ఇచ్చుచుండిరి. శ్రీ తెన్నేటి సత్యనారాయణగారు రాజమండ్రిలో శ్రీ విక్రమహాలునకు సహాయము కోరగా 2 వేలుఇచ్చి శ్రీ అణ్ణామలశెట్టిగారిచే 3 వేలు ఇప్పించిరి. ఆంధ్రదేశమందలి ఏపత్రికా విలేఖరిగాని సంస్థగాని వీరిని ద్రవ్యసహాయము కోరినచో వెంటనే వారికోరికలను సఫలము గావించు చుండిరి. కాంగ్రెసు సమావేశములకువెళ్లు కాంగ్రెసు డెలిగేట్లు కొందరికి రైలుఖర్చులకు సొమ్ము నివ్వుమని కోరినపుడెల్ల నిరాఘాటముగ చెక్కు వ్రాసి ఇచ్చుచుండిరి. వీరు కాంగ్రెసున ప్రవేశించినందున వీరి ఆదాయము తగ్గెనే కాని వీరి దానధర్మములు హెచ్చాయను. అయిదారు సంవత్సరములలో రెండులక్షలు ఖర్చుపెట్టిరని వీరికుటుంబీకులు చెప్పగా అనేకులు ఆశ్చర్యపడిరి. శ్రీ పట్టాభిసీతారామయ్యవంటివారు వీరి డబ్బును లాగికొన చూచుచుండిరే కాని కాంగ్రెసు వ్యవహారములలో శ్రీ గాంధీగారినే అనుసరించుచుండిరి. కావున, వారితోనేగాక మరికొందరు తెనుగువారితో తమ యభిప్రాయములను చెప్పెడువారు కారు. వాగ్ధోరణిలో కొన్నిమాటల వల్ల వీరియూహ లిట్టివని వారు తేలిసికొనవలెనేగాని నిశ్చితాభిప్రాయములను గుర్తింపరైరి. వీరి ఆఖరిదశలో శ్రీ న్యాయపతి సుబ్బారావు పంతులు, శ్రీ మోచర్ల రామచంద్రరావుపంతులు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ వేమవరపు రామదాసు, బారిష్టరు శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ మున్నగువారు వీరి నిజస్వభావమును గుర్తించి వీరిని సత్కరించిన సందర్భము లనేకములు నాకు తెలియును గావున ఈ సందర్బమున వెల్లడించు చున్నాను.

సైమను కమీషను

ఈసందర్భమున ఆంధ్రదేశమందలి రాజకీయవేత్తల చర్యలగూర్చి కొంత చెప్పదలచితిని. వీరిలో ప్రముఖులగు శ్రీ బులుసు సాంబమూర్తిగారు సైమను కమీషను బహిష్కారప్రయత్నమున చెన్నపట్టణమున అల్లరిసాగింపదలచిరని అధికారులకు దెలిసెను. కలకత్తా గుంటూరుపట్టణములలో వీరు తీవ్ర ఉపన్యాసములను సాగించిరని బ్రిటిషు అధికారులు తలచినందున మదరాసునకు వీరు తమ అనుచరులతో వచ్చుచుండగా బెజవాడ రైలుస్టేషనున వీరిని పోలీసులు అరెష్టుచేసి బందరునకు తీసికొనివెళ్లి నెలరోజులు రిమాండున ఉంచిరి. ఇందుచే మూలబడియున్న శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య జీవితమున మరొక రాజకీయపరివర్తనము ఏర్పడెను. శ్రీసాంబమూర్తిగారిని కేసువిచారణకై బందరుస సబ్ జైలున యుంచిరి కావున నాడుబందరు తెనుఁగుదేశమందలి సంపూర్ణస్వాతంత్ర్య వాదులకు తీర్థయాత్రాస్థలమయ్యెను. అప్పటివరకు 'పెల్లికికూడ భిక్షముపెట్టని ఈ పట్టాభి' అని అనేకులు భావించుచుండిరి. కాని యిప్పుడు విధిలేక తీర్థయాత్రికులకు ఆతిథ్యము ఒసఁగఁదలఁచి వచ్చెను. బందరున రోజూ సాగుచుండిన సభలకు శ్రీపట్టాభిగారు అధ్యక్షతవహించి పిన్నల పెద్దల సభవారికి నెరుకపరచుచుండిరి. అప్పుడు శ్రీసాంబమూర్తిగారు కారాగారము ప్రవేశింపగానేవీ రాక్రమించియున్న రెండుస్థానములు అనగా, ఆంధ్ర రాష్ట్రకమిటీ అధ్యక్షత, అఖిలభారత వర్కింగు కమిటీ సభ్యత్వము, శ్రీపట్టాభిగారికి సంక్రమించి 'దేవుఁడా' అని సంపూర్ణ స్వాతంత్ర్య ప్రచారము సాగింపవలసివచ్చెను. 1928 సం||న పైసంభవములు జరిగెను. సైమనుకమీషను బహిష్కార ప్రచారము కాంగ్రెసు కక్షవారు సాగింతు రని యధికారులు 144 వ సెక్షను క్రి. ప్రొ. అమలునఁబెట్టిరి. ఆంధ్ర, అరవరాష్ట్రకమిటీలు సంయుక్త సమావేశమొనర్చి శ్రీమా౯గారి సలహామీద సాధకబాధకముల ఆలోచించుకొని, అవసర మేర్పడినచో పై సెక్షసును ఉల్లంఘింప మని అఖిల కాంగ్రెసుకమిటీ సలహా గావించెను. ఆంధ్రకమిటీనిర్వాహకవర్గము బెజవాడలో సమావేశమై 144 వ సెక్షను నుల్లంఘింప తీర్మానించెను. సొంతకారణములవల్ల ఉల్లంఘనము సాగింపలేనివారు రాజీనామా లివ్వవలెనని ఉల్లంఘనమునకు సంసిద్ధులైనవారే ముంచుకు వచ్చి చర్య పూనవలె ననియు తాఖీదు వచ్చెను. కాని ఉల్లంఘనమునకు సంసిద్ధుఁడ నని చెప్పి శ్రీపట్టాభి చెన్నపట్టణమునకు వచ్చెనుగాని అందుకు ముందురోజునకే అరవకమిటీ సమావేశమై అధ్యక్షుని కాస్టింగు వోటుతో 144 వ సెక్షను ఉల్లంఘింపరాదనే తీర్మానమును శ్రీ పట్టాభిగారు తెలిసికొనిరి. వీరేల ముందురోజు సభకు రాలేదో వారికి తప్ప ఇతరులకు తెలియదని శ్రీ కొండా వెంకటప్పయ్య మొరపెట్టెను. 1929 సం|| పై సంఘటన యేర్పడినయెడల కాంగ్రెసు జాతీయవాదు లందరుసు తప్పక సెక్షను ఉల్లంఘింపవలె నని కలకత్తా కాంగ్రెసు శాసించెను. ఇందుకు ముందే పైతీర్మానమునకు కారకులైన శ్రీ సాంబమూర్తిగారు నిర్బంధింపబడినందున తెనుగువారి కిది ఆత్మీయసమస్య ఆయెను. చెన్నపట్టణమున రాజకీయవ్యవహారముల నన్నిటిని శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు ముఖతః సాగించుచుండిరి. తెనుగుదేశమందలి ప్రముఖు లనేకులు నాడు తమ బలగముతో చెన్నపట్టణమున గుమిగూడిరి. వీరిలో శ్రీపట్టాభిగారు ఒకరు. ఇందరు తెలుగువారు చెన్నపట్టణము వచ్చినందున అల్లరు లేర్పడు నని యధికారులు తలచి ఎందులకును మంచిదని ముందునాటి సాయంకాలమే శ్రీ కొండా వెంకటప్పయ్యను, శ్రీపట్టాభిగారిని మరికొందరిని అరెస్టు చేసిరి. కాని వీరినందరిని రాత్రి 10 గం||లకు వదలిపెట్టిరి. తెనుగువారు అరవలకన్న ధైర్యస్థైర్యములుగలవా రని తలచి శ్రీమా౯గారికి మనస్సంకటము కొంత కలిగింప గల్గిరేగాని దీనివల్ల ఏప్రయోజనము లేదని ముందు విశదమాయెను.

ఒకరోజున శ్రీమా౯ డ్రాయింగు రూమున కూర్చొని చదువుకొనుచుండగా ఒక బ్రాహ్మణ బాలుఁడు వారిని సమీపించి యేదైన కొంత సహాయము చేయుమని ప్రార్థించెను. శ్రీమా౯గారు ఆగ్రహపడి బ్రాహ్మణబాలుఁడు బిచ్చమెత్తుట తన కెంతమాత్రము ఇష్టము కా దనియు, తా నే సహాయము కావింప ననియుచెప్పి బయటికి వెళ్లుమనెను. ఆకుఱ్ఱవాడు పట్టుదలతో శ్రీమా౯నెదుట కొంతసేపు నిలఁబడెను. వానివైపుచూడక శ్రీమా౯ ఏదో ఒక పుస్తకమును చదువుచుండిరి. ఆమీద ఆ కుఱ్ఱవానిని ఇంకను ఎందులకై కాచియున్నావు? నీకు నేను సహాయము చేయనని నీవు రాగానే చెప్పితిని గదా ! అనిరి. ఈ పిల్లవాఁడు ఇంగిత జ్ఞానముకలవాఁడు గావున శ్రీమా౯గారికి ఏబదులు చెప్పక నిలఁబడిన మీదట 5 రూపొయనోటు నిచ్చి పంపివేసిరి. ఇంటివారు ఈకుఱ్ఱవాని 4, 5 గంటలు కాచునట్లు చేసినందుకు విచారపడిరి కాని శ్రీమా౯ ఎదుట ఏదియు చెప్పరైరి. వారి అభిప్రాయములకు విరుద్ధముగ ఎవరేది చెప్పినను సహించువారు కారు. వెంటనే కండ్లు ఎఱ్ఱచేసికొని పెద్దగొంతుతో చీవాట్లు పెట్టుదురు కావున, ఎవరును వారిని ఎందును ఎదుర్కొనెడువారుకారు. కుమార్తె శ్రీమతి అంబుజమ్మాళ్ కారాగారము ప్రవేశించుట వీరి కెంతమాత్రము నచ్చలేదు. కుమార్తె శాసనోల్లంఘనము గావింప తలచితినని తండ్రితో చెప్పగానే వీరికి అపరిమితకోపము వచ్చెను. నీ యంతరాత్మ జైలు ప్రవేశింపు మని సూచించినచో అట్లే చేయవచ్చును. గాని ఇతరుల ప్రోత్సాహముగాని నలుగురి మన్ననలకు పాత్రమగుటకుఁగాని నీవు జైలునకువెళ్ల ప్రయత్నింపరాదు. తాను జైలుకు వెళ్లక శ్రీ కె. భాష్యం నీవంటివారిని జైలుకు వెళ్లుమని ప్రోత్సహించుచున్నాఁ డని నాకు తెలిసినది కావున మీ యుభయులవర్తనలు నేను పూర్తిగ గర్హించుచున్నాను అనిరి. అంతటితో తృప్తిచెందక ఎన్నో యితర అంశములనుగూర్చి కుమార్తెతో నాడు ముచ్చటించిరి. స్త్రీలు కుటుంబధర్మమును త్యజించి రాజకీయరంగపోరాటమున పాల్గొన రాదు అనెడి తన దృఢాభిప్రాయమును శ్రీమా౯గారు సూచించిరి. వీరు పురుషులవలె తండ్రి, ఆస్తికి హక్కుసంపాదించుటలో అభ్యంతరము నా కేదియు కనఁబడదు. పురుషులతో సరిసమానముగ పౌరవారసత్వహక్కు లన్నిటిని వీరు సంపాదించుట అవసరమే కాని ఇంటిపనులు మాని తమ బిడ్డలపోషణను ఇతరుల అధీనము కావించి ప్రజాసేవకు ఏస్త్రీగాని దిగుట మన కుటుంబముల పురోభివృద్ధికి ఆటంక మని వీరు భావించెడివారు. భర్తకు సౌకర్యములను గావింపక డ బ్బున్న దని నౌకరులచే అన్నిపనులఁ జేయించుట పతిభక్తికానేరదు.

ఈ పై కారణములవల్లనే శ్రీమతి సరోజినిదేవిని, అనిబిసెంటు మున్నగువారిని శ్రీమా౯ తృణప్రాయముగాఁ జూచెడివారు. స్వరాజ్యకక్ష సంస్థాపనకై శ్రీ సి. ఆర్. దాసుగారు మదరాసురాష్ట్రమునకు వచ్చిరి. శ్రీ సత్యమూర్తి, శ్రీ రంగస్వామి అయ్యం గారు మున్నగు ఆరవప్రముఖులుకొందరు ఒక సభ సాగించి మదరాసురాష్ట్ర స్వరాజ్యకక్షను నిర్మించి ఇందుకు శ్రీ సత్యమూర్తిగారిని కార్యదర్శిగ యెన్నుకొనిరి. శ్రీ వేమవరపు రామదాసుపంతులుగారు తెనుగువారిని కొందరిని ప్రోగుచేసి శ్రీ వి. ఎల్. శాస్త్రిని ఆంధ్రశాఖకు కార్యదర్శి గావించిరి. నేను ఈ రెండు కమిటీలలోను సభ్యుఁడుగ నున్నట్లు జ్ఞాపకము. దైనికపత్రికలేనిది కక్షప్రచారము విరివిగ సాగదుగావున శ్రీ సి. ఆర్. దాసుగారు ఇందుకై అరవ తెలుగురాష్ట్రములలో కొంతసొమ్ము పోగుకావలె నని చెప్పుచు అరవజిల్లాలకు శ్రీరంగస్వామి అయ్యంగారు, శ్రీ సత్యమూర్తిగార్ల వెంటఁబెట్టుకొని ప్రయాణమైరి. ఈ ప్రయాణమున 20 వేలు శ్రీదాసుగారికి ముట్టుటయు, 10 వేలు విరాళములు పంపుదు మని వాగ్దత్తములుగావించుటయు తటస్థించెసు. కాని శ్రీరంగస్వామిఅయ్యంగారు అరవ దినపత్రిక ఆర్థికచిక్కులవల్ల వసూలు కావలసిన పదివేలును వసూలు చేసి స్వదేశమిత్ర౯పత్రికను చక్కగ సాగింపుమని ఆదేశించిరి. శ్రీమా౯ సత్యమూర్తిగారికి న్యాయవాదవృత్తిలో నభిరుచి లేనందున వీరికి సంపాద్యము లేకయుండెను. కొంతకాలము శ్రీమా౯గారు వీరికి నెలకు వందరూపాయలు నిచ్చుచుండిరిగాని శ్రీసత్యమూర్తిగారు తిరునెల్వేలి కాన్ఫరెన్సు ముందురోజున, శ్రీగాంధీగారి సహాయ నిరాకరణమున కనుకూలముగ సుపన్యసించినందుచే శ్రీసత్యమూర్తిగారికి అదిమొదలు ఏసహాయమును గావింపరైరి.

అరవస్వరాజ్యకక్షకు శ్రీ సత్యమూర్తిగారిని కార్యదర్శిగ నెన్నుకోబడినందుమీఁదట వీరికి నెలకు 150 రూసాయలు ఇవ్వ మని శ్రీ సి. ఆర్ . దాసుగారు చెప్పిరి. కావున శ్రీసత్యమూర్తిగారు సంతృప్తితో పాటుబడుటకు ప్రారంభించిరి. శ్రీ వి. రామదాసు పంతులుగారికి న్యాయవాదవృత్తిలో మంచి ఆదాయమేగాక గొప్పభూఆదాయముండుటచే సం||కు భూములవల్ల 10 వేలకు పైగా నికరాదాయ ముండెడిది. ఈ సందర్బమును శ్రీ సీ. ఆర్. దాసు తెలిసికొని ఆంధ్ర రాష్ట్ర స్వరాజ్యకక్ష జమాఖర్చుల నన్నిటిని వారే చక్క బెట్టవలె నని ఆదేశించిరి. శ్రీమా౯గారు అప్పట్లో బెంగుళూరుసకు వేసవి విశ్రాంతికై వెళ్లిరి కావునను శ్రీ రామదాసు, శ్రీ వి. ఎల్. శాస్త్రి, నేను బయలుదేరి శ్రీ సి. ఆర్. దాసు పత్రికకు కొంతద్రవ్యసహాయము కోరుటయే గాక ఉభయులమధ్య నొక సమావేశము సాగింప నిశ్చయించుకొంటిమిగాని నేను శ్రీ సి. ఆర్. దాసు గారిని వెంటఁబెట్టుకొని చెంగల్పట్టు, విళ్లుప్పురము కడలూరు వెళ్ళి అచ్చటనుండి శ్రీ అరవిందఘోష్‌గారి ఆశ్రమము చేరితిమి. అచ్చటనుండి చిత్తూరు, వేలూరుమున్నగు చోట్లు జూచుకొని బెంగుళూరునకు ప్రయాణమగునప్పుడు తంతె నిచ్చెద మని శ్రీరామదాసుగారితోను చెప్పిఁ చెంగల్పట్టు వెళ్లితిమి. మేము వెళ్లినచోట్లలో గొప్ప సభలు సాగుటయు కొంతసొమ్ము పత్రికకు లభించుటయు తటస్థించెను. చిత్తూరున న్యాయవాదిగనుండిన శ్రీ ఎమ్. రంగస్వామిఅయ్యంగారి ఇంటిలో మేము బసచేసి శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారిని మమ్ముల కలుసుకొను మని నేను జూబు వ్రాసితిని. వారు చిత్తూరు క్లబ్బునకు త్వరలో వత్తు ననియు అచ్చట శ్రీ సి. ఆర్. దాసు గారి గౌరవార్డము అతిథి సత్కారముగావింప యత్నింతుననియు ఒక వెండిపళ్లెమునిండ మామిడిపండ్లనుంచి ఒకజాబు వ్రాసిపంపిరి. శ్రీ సి. ఆర్. దాసు, నేను చిత్తూరు మిత్రులు కొందరు క్లబ్బునకు వెళ్లగనే శ్రీ రెడ్డిగారు మిక్కిలి ప్రీతితో శ్రీ సి. ఆర్. దాసుగారిని కారునుండి దింపి క్లబ్బున సుఖాసీనుల గావించి పానీయముల ఫలహారముల వారికి తక్కిన మిత్రులకు నిచ్చి అందరిని సత్కరించిరి. మిత్రులు కొందరు టీపార్టీకాగానే బసలకు వెళ్లిరికాని శ్రీదాసుగారిని ఒక గదిలోనికి తీసికొనివెళ్లి పత్రికకు తాను హెచ్చుగ సొమ్ము ఇవ్వలేని స్థితిలో నున్నా నని రెండువందల రూపాయలనోట్ల మాత్రము నాచేతఁ బెట్టిరీ. చిత్తూరు క్లబ్బునుండి నేను శ్రీ దాసుగారిని శ్రీ మునుస్వామినాయుడుగారియింటికి తీసికొనివెళ్లగా శ్రీ దాసుగారిని ప్రీతిగౌరవములతో ఫలతాంబూల చందనాదులతో సత్కరించిరి. వచ్చినపనిని శ్రీనాయుడుగారితో చెప్పగ వారు విరాళముగ 150 రూపాయలు పత్రికకు నిచ్చిరి. వేంకటగిరిలో వేలకొలది ప్రజలు రైలుకు అడ్డపడి శ్రీదాసుగారిని సభలో సుషన్యసింపుమని మొండిపట్టు పట్టిరికాని ప్రజానీకవర్తనను శ్రీ సి. ఆర్. దాసుగారు గర్హించిరి. అల్లరిహెచ్చి పోలీసులు మే మున్నచోటికి వచ్చి మూకను వెళ్లగొట్టినమీదట మేము గూడూరుకు చేరుకొంటిమి. వేంకటగిరి ప్రజలకు శ్రీ రామదాసుగారిపై అనుమానము జనించి వీరే శ్రీ దాసుగారిమససును మార్చి రని తలచి కాబోలు వీరిపై రాళ్లు విసరిరి.

శ్రీ సీ. ఆర్, రెడ్డిగారు సాయంత్రము సభ ముగియగానే తనబసకు రమ్మని కోరిరి. 6 గం!! లకు ప్రారంభమైన సభ 9 గం|| వరకు సాగెను. కావున మాట తప్పరాదని రెడ్డిగారి బసకు వెళ్లితిమి. కాని వారు నిద్రించుచున్నందున మేము వేంకటగిరికి ప్రయాణము సాగించి 3 గం||లకు గూడూరు చేరితిమి. గూడూరున రాత్రి 3 గం!! గొప్ప సభను శ్రీ పెల్లేటి వెంకటసుబ్బారెడ్డిగారు సమావేశపరచి శ్రీదాసుగారిని సభలో ఉపన్యసింపుమని ప్రాధేయపడిరి. కాని ఉదయము 7 గం||కు . నెల్లూరు సభకు వెళ్లవలసి యున్నందువల్ల వేకువనే బయలుదేరి వెళ్లఁదలచితి మని వారితో చెప్పిన మీఁదట వారుగూడ మాతో నెల్లూరికి వచ్చిరి. వారు 116 రూపాయలు శ్రీ సి. ఆర్. దాసుగారికి నిచ్చిరి. మరికొందరు కొద్ది మొత్తముల మధ్య రాత్రివేళలో శ్రీ సి. ఆర్. దాసుగారిపై గల అభిమానముచే వారికి నిద్రాభంగము గావించి కొద్ది మొత్తముల నిచ్చి గౌరవించిరి. 4 గం||కు గూడురు వదలి 6.30 గ! నెల్లూరు స్టో౯హవుసుపేటలోని రేబాల వారి భవనమునకు వెళ్లి వాకిట కారు నిలిపి నేను లోపలికి వెళ్లి మిత్రులగు శ్రీ సుందరరామిరెడ్డితో శ్రీ సి. ఆర్. దాసుగారు వచ్చిరనియు వారు అతిథిగ నుందు రనియు చెప్పి, నేను, రెడ్డిగారు కారువద్దకువెళ్లి శ్రీ దాసుగారిని దిగఁబెట్టి ఇంటిలో ప్రవేశించితిమి. వెంటనే శ్రీ సి. ఆర్ . దాసుగారు కొంత కాఫీపుచ్చుకొని ఫలహారముల ముట్టకనే 4 కమలాఫలముల నారగించి నెల్లూరు సభకు బయలుదేరిరి. వేసవి కావున 7 గం!! ప్రారంభించిన సభను 9 గం|| పూర్తిగావించి కొంత వసూలైన సొమ్ముతో శ్రీ సుందరరామిరెడ్డిగారి భవనము చేరుకొంటిమి. నేను సి. ఆర్ . దాసుకు కావలసిన భోజనఏర్పాట్ల త్వరలో గావింపు మని సుందరరామిరెడ్డిగారితో చెప్పి వీరికారులో మాబావగారగు శ్రీకాళహస్తి దక్షిణామూర్తిగారింటికి వెళ్లి ఆచ్చట భోజనముచేసి గంటలోగా సి. ఆర్. దాసు బసలో కలుసుకొంటిమి. నెల్లూరు పురప్రముఖులగు శ్రీ ఆమంచర్ల కృష్ణరావు, శ్రీముంగమూరి సుబ్బారావు, శ్రీ టి. వి. శివరామయ్య, శ్రీ ఏనుగ రాఘవరెడ్డి, శ్రీ అణ్ణాస్వామిఅయ్యరు, శ్రీ చెంగయ్యపంతులు మున్నగువారికి వార్త పంపగా వీరందరును శ్రీ సి. ఆర్. దాసుగారి బసకు వచ్చి అందరు కొంతసొమ్ము విరాళముగ పోగుచేసి త్వరలో పంపెదమనియు శ్రీ రాఘవరెడ్డిగారు స్థానికపనుల నిర్వహింతు రనియు చెప్పినమీదట రేబాల వారి కారులో నేను, శ్రీ దాసుగారు కావలికి ప్రయాణము సాగించితిమి. కాని అచ్చట వెళ్లిన రోజుననే పనిముగించుకొని శ్రీ రామదాసు గారికి తంతెనంపి వెంటనే బెంగుళూరునకు రమ్మని కోరితిమి. శ్రీ దాసుగారు నేను బెంగుళూరు చేరుటకుముందే వీరు మైసూరు హోటలున బస కుదుర్చుకొనియుండిరి. శ్రీ దాసుగారి స్నానపానాదులకు అచ్చట అవకాశము తక్కువగా నున్నందున, దివా౯ వి. పి. మాధవరావుగారి భవనమునకు వెళ్లి వారి యింట, శ్రీ దాసుగారికి బస కుదిర్చితిని. నేను శ్రీదాసు బెంగుళూరువచ్చిన వర్తమానము శ్రీమా౯గారికి తెలిసి, మమ్ము వెదకుచు మైసూరు హోటలుకు వచ్చిరి కాని శ్రీ రామదాసుగారు ఆ హోటలుస రెండురోజు లుండుట కేర్పాటు కావించుకొనిరి. కావున నేను, శ్రీ వి. ఎల్. శాస్త్రి శ్రీమా౯గారి బంగాళాకు కారులో వెళ్లితిమి. శ్రీదాసుగారు యెచ్చట నున్నా రని నన్ను ప్రశ్నింపగా వారికి శ్రీ వి. వి. మాధవరావుగారితో బస కుదిర్చితి నని చెప్పితిని. అందువల్లనో ఏకారణమువల్లనో కాని నన్ను తన బంగళాలో బసచేయు మని కోరనందన సమీపమున నున్న శ్రీ అల్లాడి కృష్ణస్వామిగారి బంగాళాకు వి. ఎల్. శాస్త్రిగారును, నేనును వెళ్లి అచ్చట స్నానపానాదులు ముగించుకొని భోజనము చేసితిమి. భోజనము కాగానే శ్రీ వి. ఎల్. శాస్త్రిని శ్రీ దాసు గారివద్దకుఁబంపి, శ్రీ రామదాసుగారు నేను దివాను బహదూరు టి. రంగచారిగారిని సందర్శించి వారితో మాట్లాడి ఆ మీద శ్రీమా౯ గారి ఇల్లు చేరుకొంటిమి. శ్రీ టి. రంగాచారిగారు ఐదువందలు విరాళముగ శ్రీ దాసుగారి కిచ్చిరి. 3 గం|| మొదలు రాత్రి 8 గం|| వరకు నేను శ్రీ దాసుగారికి ఒక గొప్ప మొత్తమును యివ్వమని ఎంతచెప్పినను వినక రాత్రి 9 గం|| పిదప శ్రీదాసుగారిని తన బంగళాకు పిలుచుకొని రమని చెప్పిరి. విరాళముసంగతి వారితో చెప్పెదనన్న మీదట శ్రీరామదాసుగారు, నేను శ్రీదాసుగారి బసకు వెళ్లి బెంగుళూరున ఇద్దరు ప్రముఖుల సందర్శింపగా వారు చెరి వందరూపాయలు నిచ్చిరి. ఆమీద శ్రీ రామదాసుగారిని మైసూరు హోటలున దిగబెట్టి శ్రీ సి. ఆర్ . దాసుగారివద్దకువెళ్లి వారిని, వి. ఎల్. శాస్త్రిని వెంటఁబెట్టుకొని శ్రీమా౯గారి బంగళాకు వచ్చితిమి. శ్రీదాసుగారు యెట్టిఆహారము భుజింతురో ఆసంగతి కస్తూరితోచెప్పగానే పూరీ, పాయసము, బాదంహల్వా మున్నగుపదార్థముల సిద్ధముగావించెను. అన్నము, సాంబారుకలిపిన అన్నమును ఒక గిన్నెలో నుంచెను. అప్పడములు, పెరుగు, పొడి అన్నము, ఊరగాయలు మున్నగువానిని గూడ బల్లమీద నుంచెను. ప్రక్కన కుర్చీన శ్రీమా౯ గారు కూర్చొని శ్రీదాసుగారు ఆహారము పుచ్చుకొనుచుండగా మాట్లాడుటకు ప్రారంభించిరి. అప్పటికి దాదాపు 10 గం|| అయెను కావున, నేను వి. ఎల్. శాస్త్రి, శ్రీ అల్లాడి కృష్ణస్వామిగారి బంగళాకు తిండికై వెళ్లగా 8 గం||లోగా అందరు తిండి తిని పండుకొని రనియు, వంటమనిషి. కూడ వెళ్లె ననియు వాకిట నున్న జవాను చెప్పెను. ఆకలితోబాధపడుచున్న ఉభయులము మేము మరల సీ. ఆర్, గారి బంగళాకు రాగా శ్రీదాసుగారు బసకుబయలుదేరిరి. శ్రీమా౯గారు వారితో ఏమిచెప్పిరో శ్రీదాసుగారు మాతోఁజెప్పరెరి. కాని కొంతకాలమునకుగాని తాను స్వరాజ్యకక్షలో చేరుటకు వీలు కాదని చెప్పినట్లు పిమ్మట మాకు తెలిసెను. శ్రీదాసుగా రున్నచోట నిద్రించుటకు వీలుండెను కాని ఉదయమునుండియు ఇటూ అటూ తిరుగుటచే ఆకలి బాధించుచున్నందున శ్రీ వి. ఎల్'. శాస్త్రి, నేను శ్రీ అల్లాడి బంగళాకు వచ్చి కేకలు వేసి వాకిలితలుపులు తట్టగా కొంతసేపటికి శ్రీ కృష్ణస్వామిగారి భార్య వాకిలితలుపు తీసి మమ్ముల భోజనమైనదా అని ప్రశ్నించిరి. తిండితినలేదని యామెగారితో విధిలేక చెప్పవలసివచ్చెను. మేము పడకలపరచుచుండగా నామె వచ్చి తాను కొంత చారుఅన్నమును సిద్ధము గావింతునని చెప్పి రాత్రి 12 గం|| మాఇద్దరికి అన్నము పెట్టినందున ఆ మీద నిదురపట్టెను. ఈదురవస్థకంతటికిని శ్రీమా౯ కారకులని శ్రీ వి. ఎల్. శాస్త్రి అల్లరి ప్రారంభించెను. వేకువను నాలుగుగంటలకు మే మిద్దరము లేచి నిత్యకృత్యముల తీర్చుకొనుచుండగా శ్రీకృష్ణస్వామిగారి వంటమనిషి కాఫీ తెచ్చియిచ్చెను. నేను త్రాగి శ్రీ సి. ఆర్. దాసుగారి బసకువెళ్లి వారిని వెంటబెట్టుకొని బెంగుళూరుసిటీ రైలుస్టేషనునకు కారు వదలు మని చెప్పుచు మార్గమున శ్రీ రామదాసుగారి హోటలు వద్ద ఆగి రైలుస్టేషను చేరినంతనే కారును వారికై పంపెద మని చెప్పితిమి. అందరము బెంగుళూరునుండి చెన్నపట్టణము చేరుకోగానే మరునాడు శ్రీ రామదాసుగారు తనబంగాళాలో శ్రీ దాసుగారి గౌరవార్థము గొప్పవిందు గావించి ప్రముఖులనేకుల నాహ్వానించిరి. విందుకాగానే అందరము శ్రీమా౯. ఏ. రంగస్వామి అయ్యంగారు బంగాళాకు 3 గం||కు వెళ్లితిమి. శ్రీరంగస్వామిఅయ్యంగారు శ్రీదాసుగారి గౌరవార్డము ప్రముఖులైన కొందరు ఆప్తులను మాత్రమాహ్వానించిరి. పార్టీముగియగానే వసూళ్ల లెక్కల సరిచూచుకోగా 30 వేలు శ్రీ దాసుగారికి ముట్టె నని ఏర్పడెను. నాటిరాత్రి యీసొమ్ముతో శ్రీ సీ. ఆర్. దాసుగారు మదరాసునుండి కలకత్తాకు ప్రయాణమైరి. శ్రీదాసుగారు ముందువెనుక లాలోచింపక తెలవనితలంపుగా బెంగళూరునుండి ప్రయాణమైనందుకు తనకాశ్చర్యము కల్గె నని శ్రీమా౯ చెప్పిరి. శ్రీ సి. ఆర్. దాసుగారిపై శ్రీమా౯ గారికెంత యభిమానముండెనో అంతయభిమానము శ్రీ సుభాషుచంద్రబోసుగారిపై నుండెడిది. వీరుభయుల గుణాతిశయములును స్వార్థత్యాగములఁ గూర్చి పలుమా రారోజులలో శ్రీమా౯ ముచ్చటించెడివారు. స్వరాజ్యకక్ష నిర్మాణముకాగానే శ్రీమా౯గారికిని శ్రీ గాంధీగారికిని మధ్య అభిప్రాయభేదములు ఏర్పడినందుకు కారణము లనేకములు గాని హిందూముస్లిములమధ్య సంధికుదుర్చుటకు శ్రీ దాసుగారికి తనకు తప్ప ఇతరులకు సాధ్యముగాదని శ్రీమా౯గారు శ్రీ గాంధీతో నిష్కర్షగా చెప్పిరి. ఒకప్పుడు ఆలీసోదరులు బ్రతికి యుండగా హిందూమహమ్మదీయుల మధ్య సంప్రతింపులు సాగింప వీరుప్రయత్నించిరి. వీ రప్పుడు శబర్మతీఆశ్రమమునకు వచ్చియుండిరి. రెండుమూడురోజులు సంప్రతింపులు సాగినమీదట సమావేశము ఏ తీర్మానమునకురాక సమాప్తమాయెను. రాజకీయవ్యవహారములలో భిన్నాభిప్రాయములు జనింపలేదు గాని, మసీదుల ముందు హిందువులు మేళము వాయింప రాదనియు బక్రీదునాడు పశువులనుచంపుటకు హిందువులు ఆటంకపరచరాదనియు ఆలీసోదరులు పట్టుపట్టిరి. శ్రీగాంధీగారు ముస్లిములకోరికను సఫలముగావింప సిద్దపడిరేకాని హిందువుల మనోభీష్టములను జార విడచిరి. కావుననే హిందూముస్లిములమధ్య సబర్మతీ ఆశ్రమములో సమైక్యత కష్టసాధ్యమాయె నని శ్రీమా౯గారు వెల్లడించిరి. నాడు ఏర్పడిన విభేదములవలన క్రమేణ కలతలు హెచ్చెను. కాని తా నేవిధముగనైన రాజీ కుదుర్చగలనని చెప్పినను శ్రీ గాంధీగారు ఇందుకు అవకాశ మివ్వరైరి. చట్టప్రకారము ఢిల్లీ అసెంబ్లీలో మహమ్మదీయులకు ఇవ్వబడిన స్థానములకన్న 5 స్థానములు హెచ్చుగ ఇప్పింపబడవలెనని ముస్లిములు చెప్ప సాగిరి. శ్రీమా౯గారు ముస్లీముల కోరికను సఫలముగావింప ఇష్టపడిరికాని శ్రీగాంధీగారు మరల అడ్డు తగిలిరి.

సంపూర్ణస్వరాజ్యము భారతీయుల ఆశయము కావున కాంగ్రెసు ఈకోరికకు అనుగుణముగ ఒక తీర్మానముగావించి ఇందుకై దేశమంతట ప్రచారము సాగింపవలెనని శ్రీమా౯గారు సూచించిన సూచనకు శ్రీగాంధీగారు సమ్మతింపరైరి. సర్కారు ఉద్యోగులను తమపనులు వదలుకొను డనియు, విద్యార్థులు కాలేజీ పాఠశాలలు బహిష్కరింపవలెననియు, న్యాయవాదులు కోర్టులకు వెళ్ల రాదనియు కాంగ్రెసు పలుమారులు తీర్మానించుటయు, ఆమీద దేశమంతట ప్రచారము సాగించుటయు పొరబాటని శ్రీమా౯గారు శ్రీగాంధీగారితో చెప్పిన దానిని వీడి వారు ఈమాటలను పెడచెవిన బెట్టిరి.

రాజకీయవ్యవహారములను మతసాంఘిక వ్యవహారములతో ముడిబెట్టినచో రెండు వ్యవహారములును పాడగునని శ్రీ శ్రీనివాసఅయ్యంగారు శ్రీగాంధీగారికి విస్పష్టపరచిరి. కాని శ్రీగాంధీఅహింసా ప్రచారమును ఎన్నడు మానననియు, తన అంతరాత్మ చెప్పినట్లు కాంగ్రెసు వ్యవహారములను తానే సాగింతుననియు శ్రీ అయ్యంగారితో చెప్పినందున ఉభయులకు ఎందున గాని సమ్మతి, అనుకూలముఏర్పడుట కష్టసాధ్యమాయెను. 1926 సం!!న గౌహతీ కాంగ్రెసునకు శ్రీమా౯గారు అధ్యక్షులుగ ఎన్నుకోబడిరి. ఈకాంగ్రెసు తీర్మానములను శ్రీమా౯ సిద్ధము గావించుచుండగా, శ్రీగాంధీగారివద్దనుండి వీరి కొకయుత్తరము వచ్చెను. ఇందు లోతుతెలియక ఏల నీళ్లలో శ్రీమా౯ దిగుచున్నారని గాంధీ హెచ్చరించెను. శ్రీమా౯గారు తన భార్యను పిలిచి శ్రీగాంధీగారి జాబును చదివి, మీదయ యున్నచో నేను నీళ్లలో మునగననియు, గట్టునకు తలచినపుడు రాగలననియు బదులువ్రాసిన జాబును చదివిరి. గౌహతీ కాంగ్రెసుకు శ్రీమా౯గారి కుమార్తె శ్రీమతి అంబుజమ్మాళ్ వత్తునని ప్రాధేయపడెను. కాని శ్రీమా౯ ఇందుకు సమతింపరైరి. 41 ఏనుగుల ఊరేగింపున శ్రీమా౯గారిని రైలుస్టేషనునుండి కాంగ్రెసు ఆవరణమునకు తీసికొని వెళ్లు ఏర్పాట్లు గావింపబడెను. కావున ఇన్ని ఏనుగులముందు శ్రీమా౯ ఒక ఏనుగుపై ఊరేగించు వైభవమును తాను తప్పక చూచితీరవలయునని ఆమె ఎంత ప్రాధేయపడినను శ్రీమా౯ వినరైరి. ఈలోగా స్వామి శ్రీ శ్రద్ధానందగారిని ఢిల్లీ నగరవీథిన ఒక తురకహంతకుడు కత్తితోపొడిచి చంపెనను వార్త శ్రీమా౯గారికి తెలియగానే గౌహతిలో ఏర్పాటైన ఏనుగుల ఊరేగింపును ఆపివేయుమని గౌహతీ కాంగ్రెసు కార్యదర్శులకు వీరు ఒక తంతెనంపిరి. శ్రీమా౯గారు తమకు లభించు కీర్తిని, గౌరవమును తమ కుటుంబమువారు తనివితీర అనుభవింపవలెనని భావించెడువారు కారు. చెన్నపట్టణములో సాగు సభలకు కూడ వీరు తమ ఇంటివారిని వెంటబెట్టుకొని వెళ్లెడువారు కారు. ఇంటివారు పైకి వెళ్లినచో ఇంటిపనులను క్రమేణ మానుదురనియు, ఇంటిలో దక్షతయుండదనియు చెప్పెడువారు. అట్లు చెప్పిసను ఇంటివారిపై వీరికి ఆపారప్రేమ గలదని ఇంటివారు, పైవారుగూడ గుర్తించిరి. ఇంటిలో నెవరికి జబ్బుచేసినను వెంటనే డాక్టరును పిలిపించి మందిప్పించి గంటకు 4, 5 సార్లు జబ్బెట్లున్నదని జబ్బుపడ్డవారిని ప్రశ్నించుచుందురు. శ్రీమా౯ సేలం విజయరాఘవాచారిగారు నాగపూరు కాంగ్రెసుకు అధ్యక్షులైనపుడు శ్రీమా౯గారిని తప్పక నాగపూరు రమ్మని కోరగా ప్రయాణమునకు సిద్ధ పడిరి. కారుమీద వంటమనిషి, గుమాస్తా శ్రీ రామచంద్రఅయ్యరు. సెంట్రలుకువెళ్లి సామానులుదింపి శ్రీమా౯గారికి సీటు రిజర్వుచేయుటకు యత్నించుచుండగా వీరి మనుమడు కృష్ణస్వామికి (శ్రీ అంబుజమ్మాళ్ కుమారుడు) నాటి ఉదయము జ్వరముతగిలి హెచ్చెను. సాయంత్రము డాక్టరు పరీక్షింపగా 1050 జ్వరమున్నట్లు వెల్లడియాయెను. వెంటనే టెలిఫోనున రామచంద్రయ్యరును సామానులతో వెనుకకు రమ్మనిచెప్పి కారెక్కి యకాయకిన డాక్టరును పిలుచుకొని వచ్చిరి. ఇంటి వా రెంత చెప్పినను ఏదియు వినక, కొంపమునిగెనని అరచు చుండిరి. డాక్టరు ఇచ్చుమందు ఎప్పటివలె పరిశీలించి ఆమీద మనుమనికి ఇచ్చెడివారు. తెలిసీ తెలియని వైద్యులు రోగికి ఆపాయము కలిగింతురని వీరి అభిప్రాయము కావున ఏడాక్టరు ఇంటికి వచ్చినను వారిని ఎన్నియోప్రశ్న లడిగెడువారు. ఎంత ప్రవీణుడైన డాక్టరైనను వీరు అడుగుప్రశ్నలకు తగు సమాధానము ఇవ్వనిచో వారితో గంటసేపు మాట్లాడిగాని డాక్టరును వదలెడివారు కారు. 1930.32 సం||లో శ్రీమా౯ కుమార్తె శ్రీ అంబుజమ్మాళ్ శ్రీగాంధీ కార్యక్రమమున పూర్తిగ పాల్గొనుచు, దూదేకుల మఠస్థులతోకలిసి ప్రచారము సాగించుచుండిరి కావున కుమార్తెతో ప్రీతితో మాట్లాడరైరి. కాని, కుమార్తె ఏఏ చోట్లకు వెళ్లుచున్నదో, ఏ ఏపనుల సాగించుచున్నదో మున్నగు వివరము లన్నిటిని భార్యనడిగి తెలుసుకొనుచుండిరి. కాని ఎన్నడైన కుమార్తె సమీపించినచో కండ్లు ఎఱ్ఱజేసికొని ముఖమును చిట్లించుకొనెడివారు. అప్పట్లో శ్రీ అంబుజమ్మాళ్ తండ్రిగా రున్న చోటికి వెళ్లుటకుగూడ భయపడుచుండెను. కుమార్తె జైలునకువెళ్లు రోజునగూడ తన ఉద్దేశమును శ్రీమా౯గారికిచెప్పలేదు. కాని కుమార్తెను పోలీసులు లాకపునకు తీసుకొనివెళ్లగానే శ్రీమా౯గారి మనస్సుకరగి వెంటనే పోలీసుకమీషనరు. ఆఫీసుకువెళ్లి కుమార్తెను చూచివచ్చిరి. ఆమీద శ్రీ అంబుజమ్మాళ్‌కు శిక్ష విధించి యామెను వేలూరుజైలుకు పంపుచుండగా మరల శ్రీమా౯గారు, వీరి భార్య మరల వెళ్లి కుమార్తెను జూచి వచ్చిరి. ప్రతివారము జైలు ఇంటర్వ్యూకు భార్యతో వేలూరునకు పండ్ల బుట్టలతో వెళ్లెడివారు. మొదటి ఇంటర్వ్యూన కమ్ములదాటి లోపలికి వెళ్లరాదని పోలీసులు అడ్డగించినందున ఇట్టి ఆటంకముల కల్పించినచో తాను కుమార్తెతో మాట్లాడకనే వెళ్లెదనని ప్రయాణమై చెన్నపట్టణము వచ్చిరి. రెండన ఇంటర్వ్యూకు శ్రీమా౯ వేలూరుజైలుకు వెళ్లగా ఇనపకమ్ములు. తీసివేసి నిరాఘాటముగ కుమార్తెదగ్గఱకువెళ్లి మాట్లాడుటకు జైలు అధికారులు అవకాశములు కల్పించిరి. 1927 సం|| మదరాసున కాంగ్రెసు సమావేశమును శ్రీమా౯గారు తమ యాజమాన్యమున మిక్కిలి వైభవముతో జరిపి చాల చోట్లకు వెళ్లి గొప్ప మొత్తమును పోగుచేయుటయేగాక సొమ్ము వృథాగా ఖర్చుగాని ఏర్పాట్లన్నిటిని చేయించిరి. వీరు మధుర, రామనాథపురము, కారైకుడి మున్నగు చోట్లలోఉన్న తమ కక్షిదారుల యిండ్లకు వెళ్లి కాంగ్రెసు ఖర్చులకు విరాళముల నిమ్మని కోరగా వారందరును కలసి 60 వేలు, వసూలుచేసి శ్రీమా౯గారి చేతి కందిచ్చిరి. భారతదేశమునకు సంపూర్ణ స్వరాజ్యమే అవసరమను తీర్మానము ఈ మదరాసు కాంగ్రెసున నెగ్గుటకు శ్రీమా౯గారే కారకులు. విరాళములవల్లను టిక్కెట్లు విక్రయించుటవల్లను దాదాపు 3 లక్షలకు పైగా సొమ్ము లభించెను కాన రెండులక్షలుమాత్రమే ఖర్చుబెట్టి తక్కిన సొమ్ముతో రాయపేటలో 10 నివేశనముల స్థలమును కొనిరి. ఆమీద సుప్రసిద్ధ ఇంజనీరును, మదరాసురాష్ట్ర మాజీ మంత్రియు నగు దివాన్‌బహదర్ ఆర్. ఎన్. ఆరోగ్యస్వామి మొదలారిగారిచే చక్కని ప్లాను తయారుచేయించి కాంగ్రెసు భవనమును చెన్నపట్టణమున నిర్మించి కాంగ్రెసునకు భవనములేదను కొరతను తీర్చిరి. దురదృష్టవశాత్తు 1939 సం||న ఈ భవనమున కాంగ్రెసు వస్తుప్రదర్శనశాల సాగుచుండగా ఎలెక్ట్రిక్ తీగలవల్ల మంటలు ప్రారంభమై యీ భవనము బూడిద పాలాయెను. ఈమదరాసు కాంగ్రెసు సమావేశమగుటకు కొన్నినెలలకు ముందే భారత స్వరాజ్యప్రభుత్వపు ఏర్పాట్లు ఏ తీరుగ నిర్మాణము కావలెనో సూచించుచు ఆ సూచనల నొక పుస్తకరూపకముగ ప్రకటించిరి. కాంగ్రెసు సాగిన పిదప 1928 సం!! ఏప్రెలు నెలలో శ్రీమా౯గారు ఐరోపాకు ప్రయాణమైరి. ఆస్ట్రియా, స్విట్జర్లండు, జర్మనీ, ఫ్రాంసు మున్నగు దేశములలో కొంతకాలము పర్యటించి ఆ మీద ఇంగ్లాందు చేరిరి. రష్యాలో వీరు మార్షల్ స్టాలిన్ అతిథిగ నుండిరి. మాస్కోనగరమున కొన్నిరోజులుండి ఆ నగరమందలి చూడదగిన ప్రదేశము లన్నింటిని చూచిరి. క్రెమ్లిను భవనముననే స్టాలిన్‌ను సందర్శించి రెండుగంటలు వారితో సంభాషించిరి. రూస్వెల్టు, చర్చిలు, స్టాలిన్ ముగ్గురును ఆరోజులలో అందరి దృష్టిని ఆకర్షించుచుండిరి. లండనున పార్లమెంటు సభ్యు లనేకులను కలసికొని అనేక రాజకీయవిషయములగూర్చి వారితో సంభాషించిరి. లండనునుండివెళ్లి వారి దేశస్వాతంత్ర్యమును సంపాదించిన డీవెలరా గారిని డబ్లినున సందర్శించి ఐర్లండున చూడఁదగిన చోట్లుచూచి ప్రజాసామాన్యము ఏస్థితిలో కాలము గడపుచున్నారో ఆ సందర్భములను గుర్తించిరి. శ్రీమా౯గారు ఐరోపా సంచారము ముగించుకొని స్వస్థలమునకు రాగానే సర్వపక్ష మహాసభ తీర్మాన ప్రకారము శ్రీమోతీలాలు శ్రీ నెహ్రూ సిద్ధము గావించిన ప్రణాళిక వెల్లడియాయెను. ఈ ప్రణాళి కలో తా నెంతోకాలముగ చెప్పుచుండిన అభిప్రాయములు కనబడకపోయినందున ఇకను హిందూ ముస్లిముల మధ్య సంధికుదురదని తలచి వీరు నిస్పృహులైరి. మదరాసు కాంగ్రెసున హిందూ ముస్లిముల మధ్య రాజీ కుదిర్చి ఉభయులకు సంతృప్తియగు కొన్ని తీర్మానములను శ్రీమా౯గారు నెగ్గించిరి. కలకత్తా ముస్లింలీగుకూడ మదరాసు కాంగ్రెసు కావించిన తీర్మానములకు సంతృప్తిగాంచెను. శ్రీనెహ్రూ ప్రణాళిక మదరాసు కాంగ్రెసుతీర్మానమునకు భిన్నముగ నుండుటయే గాక, శ్రీ జిన్నా ఆలీసోదరులు మున్నగు ముస్లిం నాయకు లందఱికిని అసంతృప్తిని గలిగించెను. కావున విభేదములు హెచ్చాయెను. ఈ కారణములచే కాంగ్రెసుపై శ్రీమా౯గారికి అసంతృప్తి హెచ్చెను. శ్రీనెహ్రూ ప్రక్కన శ్రీగాంధీకూర్చొని పక్షపాతబుద్ధితో పైతీర్మానములను నెగ్గించిరని శ్రీమా౯గారి దృఢాభిప్రాయము. 1928 సం!! కలకత్తాన సమావేశమైన కాంగ్రెసున పైవిషయముల గూర్చి దీర్ఘోపన్యాసముల గావించి మదరాసు తీర్మానములను శ్రీనెహ్రూ తన రిపోర్టున ఏతీరున దిగ ద్రొక్కిరో దానిని గూర్చి యుద్ఘాటించిరి. పరస్పర అభిప్రాయభేదములవల్ల కలకత్తా కాంగ్రెసున శ్రీగాంధీగారికిని, శ్రీమా౯గారికిని కలతలు హెచ్చాయెను. శ్రీగాంధీగారిని ధిక్కరించి శ్రీమా౯ చెన్నపట్టణము వచ్చిచేరిరి. చెన్నపట్టణమునకు రాగానే అనుచరులను ప్రోగుచేసి కాంగ్రెసునకు సంబంధపడినవారు, శ్రీనెహ్రూ రిపోర్టుకు ప్రతికూలురుఅగు అనేకుల సమ్మతితో కాంగ్రెసున నొక నూతసకక్షను లేవనెత్తిరి. ఈ కక్షకు శ్రీమా౯ అధ్యక్షులుగను, శ్రీ సుభాష్‌చంద్రబోసు కార్యదర్శులుగను యెన్నుకోబడిరి. నూతనకక్ష ఆదర్శమును, కార్యక్రమమును ఆలోచించి సిద్ధముగావించి వీరు ప్రకటించిరి. అన్ని పనులను మాని యీ నూతనకక్షకై రేయింబవళ్లు పాటుబడుటకు ప్రారంభించిరి. తనసేవ, స్వార్థ త్యాగముపడిన కష్టములన్నియు నేల పాలాయె ననియు, సంఘమునకుగాని, దేశముసకుగాని లాభము లేకపోయినదనియు, మిత్రులమని చెప్పు కొందరు నాయకులు కుట్రపన్ని వీరిపనులను చెడగొట్టిరనియు ఇకను కాంగ్రెసుననుండుట నిష్ప్రయోజనమనియు తలచి వీరు కాంగ్రెసుతో సంబంధము వదలుకొనిరి.

శ్రీమా౯గారు కాంగ్రెసును వదలిసమీదట శ్రీగాంధీగారు వీరియుపన్యాసములను, అభిప్రాయములను నిరసించుచు వీరి కొక జాబువ్రాయగా శ్రీమా౯ గారికి కోపమధికమాయెను. కొందరు శ్రీగాంధీగారిని 'మహాత్మా' అని తలచువారు. కాని, డాక్టరు అనిబిసెంటు వారికి ప్రసాదించిన యీ బిరుదునకు వారు తగరని శ్రీమా౯గారు చెప్పుచు శ్రీగాంధీగారి వర్తననుగూర్చి బహిరంగసభలలో చర్చించుటకు ప్రారంభించిరి. శ్రీగాంధీ శాంతస్వభావు లని అనేకులు భావించినది పొరబాటని పై సందర్భమున రూఢి యాయెను. పనికిమాలిన పైజాబును శ్రీగాంధీగారు వ్రాయనిచో శ్రీమా౯గా రెన్నడును కాంగ్రెసును వదలరని నేనేగాక యింకెందరో అభిప్రాయపడితిమి. తా మేకారణములవల్ల కాంగ్రెసును వదలిరో ఏకరుబెట్టుచు 1930 సం||న శ్రీమా౯గారు ఒక ప్రకటన గావించిరి. శాసనోల్లంఘన తీర్మానమును ప్రతిపాదించుటకు కొన్నినెలలకు ముందే నేను కాంగ్రెసును వదలి పెట్టితిని కావున ఇందుకు కారణము క్రింద వివరించెదను:-

“నేను ప్రతిపాదించిన హిందూ ముస్లిము ఒడంబడికను, నేను మదరాసు కాంగ్రెసుస నెగ్గించిన సంపూర్ణ స్వరాజ్య తీర్మానమును కాంగ్రెసును, శ్రీగాంధీ, శ్రీనెహ్రూగారలు దిగద్రొక్కుటవల్ల వీరుభయులు కాంగ్రెసు వర్కింగుకమిటీ సభ్యులుగా నుండుట వల్లను వీరితో గలిసిపనిచేయుటకు నే నెన్నడును ఇష్టపడను. తిరునల్వేలిజిల్లా తిరుక్కురుంగుడిలోను, లాహోరు కాంగ్రెసునను పై సందర్భములను నేను నిరాఘాటముగ వెల్లడించుటయేగాక మరికొన్ని చోట్లలోను, స్వదేశమిత్ర౯ కార్మికుల సంఘుసమావేశమునను నేను నా అభిప్రాయములను వెల్లడించితిని. శ్రీగాంధీగారి కక్షవారికిని, నాకును సంబంధము లాహోరు కాంగ్రెసులోనే వదలి మేము దూరమైతిమి.” శ్రీమా౯గారికి శ్రీగాంధీగారి రాజకీయ కార్యక్రమముపై నమ్మకము లేకున్నను, శ్రీగాంధీగారి అహింసా సిద్ధాంతమును తన జీవితమున ఆచరణలో పెట్టుటకు అంతరాత్మ సూచించినట్లు ఆవరకు శ్రీమా౯ తలచిరి కాని తాను పొరబాటు పడితినని వెల్లడించిరి. శ్రీగాంధీగారి నిజస్వరూపమును తెలుసుకొనలేక చెన్నపట్టణమున స్వదేశీ లీగును నిర్మించి కొంత సొమ్మును వెచ్చించుటయేగాక శ్రీమా౯గారి కుమార్తె అంబుజమ్మాళ్, మరి కొందరు స్త్రీలు పాటుబడుచుండిరి. కాని యెన్నడును తన కుమార్తె అంబుజమ్మాళ్ సాగించు శ్రీగాంధీగారి కార్యక్రమమునకుగాని కృషికిగాని శ్రీమా౯ అడ్డము తగిలినవారుకారు. పనికిమాలిన ఉపన్యాసములను సభలలో సాగించి కారాగారము ప్రవేశింప వద్దని ఆప్పుడప్పుడు కుమార్తెను హెచ్చరించు చుండిరి. శ్రీ అంబుజమ్మాళ్ వేలూరు జైలునుండి విడుదల అయినదిమొదలు శ్రీగాంధీగారితో ఉత్తర ప్రత్యుత్తరములు సాగించుచుండిరి. వార్ధా ఆశ్రమమునకువెళ్లి శ్రీగాంధీని సందర్శించి వారితో కొంతకాలము ఆశ్రమమున నుండుటకు అనుమతి సంపాదించిరి. శ్రీగాంధీగారు హరిజన ప్రచారమునకై చెన్నపట్టణము వచ్చినప్పుడు అంబుజమ్మాళ్ వారిని సందర్శించి వారిని తసయింటికి వెంటబెట్టుకొని వచ్చిరి. వీ రుభయులు సంభాషించినపుడు ఇదివరలో, వీరి మధ్య జనించిన అభిప్రాయములను మాత్రము శ్రీగాంధీగాని. శ్రీమా౯ గాని మార్చుకొనరని నిష్కర్షగ వెల్లడియాయెను. పరస్పర క్షేమలాభముల గూర్చియు, పనికిమాలిన ఇతర సందర్భముల గూర్చియు మాట్లాడిరి కాని ఉభయులమధ్య చీలిక ఏర్పడినందుకు విచారపడిరి.

శ్రీమా౯ కుమార్తె కొంతకాలము శ్రీగాంధీగారివద్ద ఆశ్రమమున వాసముండవలెనని నిశ్చయించుకొనిరి. ఈమె బొంబాయి కాంగ్రెసుకు వెళ్లినపుడు శ్రీగాంధీగారిని సందర్శించి వారి ఆశ్రమవాసిగా కొంతకాల ముండుటకు అనుమతిని సంపాదించిరి. శ్రీ అంబుజమ్మాళ్ తన నగలన్నిటిని శ్రీగాంధీగారికి అందించి వీని విక్రయమువల్ల లభించు సొమ్మును ఆశ్రమ ఖర్చులకు వినియోగించుకొమ్మని చెప్పిరి. ఈనగల ఖరీదు ముప్పదివేలుండుని నేను వింటిని.

ఇంటికి రాగానే తండ్రిగారగు శ్రీమా౯తో పై సందర్బమును చెప్పినప్పుడు వీరు చాల కోపపడి శ్రీ అంబుజమ్మాళును వాగ్దాకు వెళ్లరాదనిరి. కొన్ని రోజులు తిండి తినక మొండిపట్టు పట్టినమీదట కుమార్తెను శ్రీమా౯ గారే వెంటబెట్టుకొని వార్ధా వెళ్లి శ్రీ గాంధీగారికి ఆమెను అప్పగించిరి. శ్రీగాంధీగారికిని, శ్రీమా౯గారికిని కొంతకాలము వైషమ్యములు ఏప్పడియున్నను, శ్రీగాంధీగారు శ్రీమా౯గారిని ప్రీతితో దగ్గరకు పిలచి, కూర్చొమ్మని చెప్పి మిక్కిలి మర్యాదతో వీరితో సంభాషించిరి. మరునాడు శ్రీమా౯గారు చెన్నపట్టణమునకు ప్రయాణమగుచు కుమార్తెను చూచి కంటతడిబెట్టుకొనిరి. కుమార్తె తన ఆరోగ్యమును కాపాడుకొనశక్తిలేనిదనియు, శ్రీగాంధీగారే ఆమెకు అన్నివిధముల సహాయపడవలెననియు చెప్పి రైలు స్టేషనుకు ప్రయాణమైరి. 45 రోజులు శ్రీ అంబుజమ్మాళ్ వార్ధా ఆశ్రమమున నుండిరి. అప్పుడప్పుడు శ్రీమా౯గారు శ్రీగాంధీకిని, కుమార్తెకును జాబులు వ్రాయుచుండిరి. వీరి జాబులకు బదులుగా శ్రీగాంధీ గారు “మీ రెంతమాత్రము విచారపడ నక్కర లేదు. నేను శ్రీ అంబుజమ్మాళును జాగ్రత్తగా చూచుకొనుచున్నాను. త్వరలో ఆమెను తమ వద్దకు పంపెదను.” అని జాబువ్రాసిరి. కాని ఈలోగా తొందరపడి శ్రీమా౯ గారు తన భార్యను వార్ధాకు బంపి కుమార్తెను పిలుచుకొని రమ్మని ఆదేశింపగానే శ్రీగాంధీగారు అంబుజమ్మాళును బంపివేసిరి. ఆమె మరి కొన్ని రోజులు ఆశ్రమమున నుండతలచితినని శ్రీగాంధీగారితో చెప్పగా ఇందుకు వారు ఆవకాశ మివ్వరైరి. కుమార్తె శ్రీమా౯ గారివద్దకు వచ్చిన కొన్నిరోజులకు ఈ క్రిందిజాబును శ్రీగాంధీగారు వ్రాసిరి.

"తమ జాబందినది. మీ కుమార్తె నావద్ద కొన్ని రోజు లున్నందుకు తాము, తమభార్య సంతృప్తి చెందినందుకు కృతజ్ఞుడను. అంబుజమ్మాళ్ ఆశ్రమమున నున్నపుడు అన్ని విధముల ఆమె కాలము వ్యర్ధము కాని మార్గమున గడపునట్లు చేసితిని. ఈమె ముందుకూడ కొంతకాలము శ్రద్ధతో ప్రజాసేవ సాగించునని, ఆశించుచున్నాను.”

శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు నిరంతర సేవవల్ల వేలకొలది భారతీయుల దృష్టిని ఆకర్షింప గల్గిరి, ప్రజాసేవలో స్వార్ణమునకు చోటులేదని గుర్తెరిగిన మహనీయుడీయన. వీరి దేశభకి, వీరి తెలివితేటలు, వీరి తీక్ష్ణ విమర్శనాశక్తి, అకుంఠిత ధైర్య సాహసములు, నిరంతర కార్యదీక్ష ఇతరులయందు కనబడవు. వీరి కుటుంబమువారిపైనే గాక మిత్రులపై వీరికున్న ఆదరణ అపరిమితము, ప్రశంసనీయము. పరోపకారులును, ఉదారులును అగు ఈ గొప్ప వ్యక్తితో కొంతకాలము సహచరుడనుగా నున్నది నా మహాభాగ్యమని తలచుచున్నాను. 1929 సం!! శ్రీమా౯గారు కాంగ్రెసుతో సంబంధము వదలుకొన్నది మొదలు బంగళావదలి ఎచ్చటికి వెళ్లువారు కారు. ఉదయము 6 గంటలకు నిద్రలేచి, అదిమొదలు 9, 10 గంటలవరకు ఇంటికి వచ్చిన వారితో సంభాషించుటయు, ఆమీద పైకి వెళ్లుటయు వీరి పూర్వపు అలవాటు. ఆరోజులలో రేయింబవళ్లు ప్రజాసేవయందే మగ్నులై యుండిరి. ఇట్టివారు రేయింబవళ్లు డ్రాయింగు రూమునందలి పడక కుర్చీన ఆసీనులై గంథావలోకనమునందే కాలము గడపుట ఇంటివారికే గాక పైవారికి ఆశ్చర్యము గలిగించెను. వర్షము తగ్గినను దుమారము తగ్గలేదని కొందరు చెప్పినట్లు వీరు కాంగ్రెసును వదలినను ప్రతీరోజు ఎందరో కాంగ్రెసువాదులు వీరివద్దకు వచ్చుచుండిరి. వీరు కాంగ్రెసున స్వతంత్ర కక్షను లేవ నెత్తినపుడు వందలకొలది జనము వీరివద్దకు వచ్చెడివారు. కాని నగరమున ఒక అంధకారము ఆవరించె నని వీరి అనుచరులు చెప్పెడివారు. కాంగ్రెసు వ్యవహారములలో నాయకత్వము వహింపుమని ఎందరో ప్రాధేయపడిరి కాని శ్రీగాంధీగారి కాంగ్రెసున తాను యెన్నడును జేరననియు, తాను సాగించిన పనులన్నిటిని వారు మట్టిపాలు గావించిరనియు బదులు చెప్పెడివారు. తాను మాత్రము కాంగ్రెసునకు విరుద్ధముగ నెన్నడును వర్తింపసనియు, దేశమునకు స్వాతంత్ర్య మత్యావశ్యకము గావున దానిని సాధించుట తన ఆశయమనియు చెప్పెడివారు. ఉత్తర హిందూస్థానమువారు దక్షిణదేశపువారిని ఒక మోస్తరుగ క్రిందిచూపుతో జూచుచున్నారు గావున, దక్షిణ ఇండియాన యెన్నియో సమస్యలు పరిష్కారము కావలసి యున్నవనియు దక్షిణ వాసులు స్వతంత్రించి కృషిచేయుట యావశ్యకమనియు శ్రీమా౯గారు చెప్పెడివారు. శ్రీ సరోజినీదేవి, శ్రీ జవాహర్లాల్ నెహ్రూ, శ్రీ రాజేంద్రప్రసాద్ గార్లు మదరాసుకు వచ్చినప్పుడు శ్రీమా౯ గారిని వీరి బంగళాలో సందర్శించి రెండు మూడు గంటలు వీరితో సంభాషించిరి. ఎటులైన వీరిని కాంగ్రెసున మరల ప్రవేశపెట్టుటకు తీవ్రప్రయత్నము కావించిరి కాని ఆప్రయత్నము నిష్ఫల మాయెను. అందుచే వీరి అనుచరులగు శ్రీ కె. భాష్యముగారు శ్రీమా౯గారితో సంప్రతింతు నని వారితో చెప్పిరి. కాని భాష్యముగారి మాటలను శ్రీమా౯గారు పెడచెవిని బెట్టిరి.

శ్రీమా౯ మరల కాంగ్రెసున ప్రవేశించనందుకు ప్రబలమైన కారణము లనేకములు గలవు. జాతీయవాదు లనేకులును హిందువులేగాక ముస్లిములు గూడ ఆశించినట్టి సంపూర్ణస్వరాజ్య తీర్మానమును కాంగ్రెసున వీరు నెగ్గించుటయేగాక అనేకసార్లు తిరిగి ప్రచారముగూడ సాగించిరి కావున వీరి సంవత్సరపు కృషి, విఫలమగుట ఒక కారణము. నిజముగా తన్సు, తన ఆదర్శములను ఆదరించునట్లు పైకి కనబడుచు లోలోపల శ్రీగాంధీగారిని బలపరచుచు కొంద రుండుట రెండవకారణము. కాంగ్రెసున క్రింద మీదబడి శ్రీగాంధీగారు తనమాట చెల్లునట్లు చేసికొనిరే కాని వారివలెవర్తించుటకు తనకు సాధ్యము కాకపోవుట మరొక కారణము. వయస్సు హెచ్చుటయు, అపార ఆదాయము తగ్గుటయుకూడ శ్రీమా౯ మరల కాంగ్రెసులో చేరకపోవుటకు కారణములుగ నుండవచ్చును. చాలకాలము వీరితో సంబంధపడియుంటిని గావున వీరి పట్టుదల, మొండితనము మొదలగుసవి స్వాభావికము లని నేను గుర్తింపగలిగితిని. వీరు తా ననుకొన్న పనిని ఏవిధముగనైన చక్కబెట్టినగాని, తానేగాక యితరులను గూడ నిద్రపోనివ్వనివారని చదువరులు గుర్తింపవలెను. కాంగ్రెసును వదలినను ఆఖరువరకు రాజకీయములలో అభిరుచిని వీరు వదలలేదు. రాత్రులలో మదరాసు ఆక్టింగు ప్రధానన్యాయమూర్తియగు శ్రీ వేపా రామేశం, న్యాయమూర్తి శ్రీ ఎమ్. పతంజలి శాస్త్రి మున్నగువారు కొందరు వచ్చి వీరు వెలిబుచ్చు అమూల్య రాజకీయాభిప్రాయములను తెలిసికొనుచుండెడివారు. శ్రీ పతంజలిశాస్త్రిగారు కొంతకాలమునకు ఢిల్లీ సుప్రీంకోర్టున ప్రధానన్యాయమూర్తిపదవిలోనుండగల్గిరి. కావున నిట్టివారు శ్రీమా౯గారి సునితాభిప్రాయములను గుర్తించుటకు యత్నించుటవల్ల శ్రీమా౯ అపార మేధావి అని ఏర్పడుచున్నది. ఒక్కొక్కప్పుడు వీరు ఇంటివారితోను, మిత్రులతోను అంతములేని సంవాదములను సాగించెడువారు కాన ఎన్నడు వీరితో సంభాషింప ఎవరికిని వీలుగాకయుండెడిది. 1930 సం|| ఆఖరున మదరాసు విక్టోరియాపబ్లిక్ హాలులో శ్రీ సేలం విజయరాఘవాచారిగారి ఏబది సంవత్సరముల ప్రజాసేవను కీర్తించుటకై కొందరు ఒక మహాసభను ఏర్పాటుగావించి శ్రీమా౯గారిని ఆ మహాసభకు అధ్యక్షులుగ నుండమని కోరగా వీరందుకు అంగీకరించిరి. నాడు అధ్యక్షులకు సభానంతరమున వందనములు సమర్పించుచు మాజీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ వి. వి. శ్రీనివాసఅయ్యంగారు, ఇకముందు మైలావూరుస శ్రీమా౯గారు ఒక సన్యాసివలె యెందున జోక్యము కలిగించుకొనక కలకాలము గడపరాదనియు, మరల ముందు నిలచి దేశసేవ పూర్తిగా కొనసాగింపవలయుననియు చెప్పిరి. సభ్యులందరు జయ జయధ్వానముల సాగించుచు శ్రీమా౯ వి. వి. శ్రీనివాసఅయ్యంగారి కోరికను తప్పక సఫలము చేయవలెనని ఘోషించిరి. అప్పుడు గూడ శ్రీమా౯గారి మనస్సు మారలేదు గాని 1939 సం!! న మరల పౌరులు ఒక మహాసభను గానించి శ్రీమా౯గారిని నాయకత్వము వహింపు మని ప్రార్థించిరి. స్వదేశమిత్ర౯ పత్రికాధిపతి శ్రీ సి. ఆర్ . శ్రీనివాస౯గారు, ఈ రోజులలో వానప్రస్థాశ్రమమును ఆచరణలో పెట్టువా రెవరులేరనియు, శ్రీమా౯గారు తమ ఉన్నతస్థానమును వెంటనే ఆక్రమింపవలయుననియు సభలో వెల్లడించిరి. ఆమీద ఉపన్యాసము గావించిన శ్రీ కల్యాణసుందరమొదలియారేగాక మరికొందరు ప్రముఖులుగూడ పై అభిప్రాయములనే సూచించిరి. శ్రీమా౯గారు పరిస్థితులను పరిశీలించి ఎన్నడు తనకు ప్రజాసేవ సాగింపవలెనని తోచునో అప్పుడు తాను వచ్చెదనని ఒక ప్రకటన గావించిరి. ఈ ప్రకటనయేగాక పత్రికలలో రోజూ వీరు వ్రాసిన వ్యాసములు ప్రచురణ మగుచుండెను. ఈవ్యాసము లందలి నూతనాదర్శము లన్నియు ప్రజలదృష్టి నాకర్షించి వారిని ఉత్సాహపూరితులను గావించుచుండెను. కాంగ్రెసు మంత్రులను, వారి చర్యలను తీవ్రముగ ఖండించుచు ఉపన్యాసముల గావించుటయేకాక పత్రికలలో గూడ కాంగ్రెసు మంత్రులను తీవ్రముగ విమర్శించుచుండిరి. వేసవిలో వీరితో నేను కొడై కెనాలుకు వెళ్లియుంటిని. హైదరాబాదు నందలి సుప్రసిద్ద బారిష్టరును, రాజకీయ వేత్తయు నగు అక్బరు ఆలీఖానుగారు శ్రీమా౯గారిని సందర్శించుటకై కొడై కెనాలు వచ్చిచేరిరి. శ్రీమా౯గారితో కొన్ని గంటలు సంభాషించిన మీదట ఉభయుల మధ్య హిందూముస్లిము సమస్యనుగూర్చి ఒక ఒడంబడిక కుదిరెను. ఉభయుల సంతకములతో ఆ ఒడంబడికను వెంటనే పుస్తకరూపుమున ప్రచురించిరి. ఇండియా ప్రభుత్వమునందును, రాష్ట్రప్రభుత్వములయందును మంత్రులసంఖ్య సరిసమానముగ నుండవలెనని అందు సూచింపబడెను. అనగా హిందువు లెందరో ముస్లిము లందరు మంత్రులుగా నుండుటకు శ్రీమా౯గారు సమ్మతించిరి. శాసనసభ్యులుగా ఎన్నుకోబడినవారే మంత్రులను ఎన్నుకోవలెనని శ్రీమా౯గారి నిశ్చితాభిప్రాయము. శాసనసభ్యులు సాధారణ ప్రజా ప్రతినిధులు గావున వారిలో అధిక సంఖ్యాకులు మంత్రి పదవులలో సగము ముస్లిముల కిచ్చుటకు ఇష్టపడినచో దీనికి ఎవరును ఆటంకము చెప్పరాదని పై పుస్తకమున వ్రాయబడెను. హిందువులుగాని, ముస్లిములుగాని ప్రత్యేక రాజకీయసభల నిర్మింప రాదనియు, సైన్యమునగూడ పదవులు సగము మహమ్మదీయుల కిచ్చుటకు శాసనసభ్యులు ఇష్టపడినచో ఈ కోరికనుగూడ ఆచరణలో బెట్టవలెననియు మరొక సూచన కావింపబడెను. ఈపై ఒడంబడికను ప్రజలందరు ఆదరించినచో మహామ్మదీయులు పాకిస్థా౯ నిర్మాణ ప్రయత్నమును వదలుకొందు రని శ్రీమా౯గారు అప్పుడు భావించిరి. ఈ ఒడంబడికను ప్రచురించిరేగాని శ్రీమా౯గారు ఇంటినుండి కదలకుండిరి. ఎందరో వీరిని సందర్శించుటకు వచ్చినపుడు పై ఒడంబడికకై దేశమంతట ప్రచారము సాగింపమని ప్రోద్బలపరచిరి కాని వీరు కదలరైరి. వీరికిరాజకీయములలో నున్న అభిరుచి న్యాయవాదవృత్తిలో లేనందున కోర్టుకు వెళ్లరైరి. భారతరాజకీయ పరిస్థితులనుగూర్చి తానొక గ్రంథమును ప్రచురింపదలచి ఎక్స్‌ప్రెసు పత్రికలో తన ఊహలు వెల్లడించుచు రోజూ ఒక వ్యాసము ప్రచురించుచుండిరి. గ్రంథావలోకనమువల్ల సోమరితనము హెచ్చగు చున్నదని తలచి కాబోలు హెన్రీ మెయి౯ రచించిన 'హిందూలా' గ్రంథమును 'హిగి౯ బాదమ్' కంపెనీవారికి సవరించి యిచ్చుటకు సమ్మతించి, ఆ పనిని సంవత్సర కాలములో పూర్తిగావించిరి. దీనివల్ల భారతదేశమందేగాక విదేశములందు గూడ వీరి ప్రతిభ వెల్లడి యాయెను. అప్పట్లో 'ఫార్వర్డు బ్లాకు'ను నిర్మించుటకు శ్రీ సుభాష్‌చంద్రబోసుగారు చెన్నపట్టణమునకు వచ్చి శ్రీమా౯గారిని సందర్శించిరి. ఈ బ్లాకున చేరి నాయకత్వము వహింపవలెనని భక్తి పురస్సరముగ శ్రీ శ్రీనివాసఅయ్యంగారును శ్రీబోసుగారు ప్రార్థించిరి. రాజకీయములలో పూర్వము తనకున్న ఉత్సాహము ఇప్పుడు లేదనియు, ముందువలె శ్రమపడి ప్రచారము సాగించుటకు శక్తి, ఓపిక లేవనియు, ఇట్టి స్థితిలో తాను నాయకుడుగా ఏర్పడినచో నూతన కక్షకు యేమాత్రముబలము చేకూరదనియు వీరు శ్రీ సుభాష్‌గారితో చెప్పిరి. కాని శ్రీసుభాష్ కోరిక ప్రకారము తాను త్రిపురా కాంగ్రెసుకు తప్పకవచ్చి శ్రీబోసుగారి కన్నివిధముల సహాయము గావింతునని మాట యిచ్చిరి. కాంగ్రెసున ఆరోజులలో శ్రీగాంధీగారే గాక శ్రీ రాజేంద్రప్రసాదు, శ్రీ వల్లభాయి పటేలు, శ్రీ రాజగోపాలాచారి మున్నగు వర్కింగు కమిటీ సభ్యులుకూడ శ్రీసుభాష్ గారికి ప్రతికూలురుగ నుండిరి. శ్రీ సుభాష్‌బోసు అధ్యక్షతను శ్రీగాంధీగారి అనుచరులలో ఒకరు 'తూటుపడిన పడవ' అని చెప్పసాగిరి. ప్రముఖులు ఈ వైఖరితో వ్యవహరించు స్థితిలో అనుచరుల అభిప్రాయములనుగూర్చి ఏదియు చెప్ప వీలుగాక యుండెను. శ్రీ సుభాష్ చంద్రబోసుగారి జబ్బు హెచ్చినందుచే వీరు దేశమంతట సంచారము గావించి తన కక్షను బలపరచుకొనుటకు అవకాశము లేకపోయెను. కాంగ్రెసువాదుల ప్రవర్తన అసహ్యము పుట్టించెను. కావున భారతదేశమునకు త్వరలో సంపూర్ణ స్వరాజ్యము లభింపదని తలచి శ్రీమా౯గారు చెన్నపట్టణమునకు మరలిరి. 1939 సం!!న యుద్ధము ప్రారంభ మాయెను. ఈ యుద్ధమున ఇండియాకు గూడ ఎన్నడును లేని విపత్తు సంభవించునని శ్రీమా౯గారు భావించిరి. రోజూ కొంతసేపు రేడియోవద్ద కూర్చొని యుద్ధవార్తల నన్నింటిని గుర్తించి వానిపై తన అభిప్రాయములను ఇంటికీ వచ్చినవారితో చెప్పుచు త్వరలో ఇండియా అధోగతిపాలగునని చెప్పుచుండెడివారు. కాంగ్రెసు జాతీయసైన్యమును నిర్మించుట ఆవశ్యక మని తానెంతోకాలముగ చెప్పుచుంటిననియు, జర్మను ఢాకకు ఎదుర్కొన భారతీయులకు వీలుకాదు కాన అందరును శరణాగతిజొచ్చుట తప్ప గత్యంతరము లేదనియు చెప్పుచుండిరి. కొందరు అనుచరులు ప్రోద్బల పరచగా గొప్ప సభలలో వీ రుపన్యసించుచు పై స్వీయాభిప్రాయములను వెల్లడించిరి. 1941 సం|| ఏప్రెలు మాసప్రారంభమున వీరు కొడైకెనాలుకు ప్రయాణమైరి. నన్నును అచ్చటికి రమ్మనికోరిరి. కాని నేను అంతకుముందే రెండవక్లాసు రైల్వే కౌపనులను కొనియుంటిని గావున వెంటనే నేను ఒక దూర ప్రయాణము వెళ్లి రానిచో కౌపనులు నిరుపయోగ మగునని చెప్పి హుబ్లీమీదుగా బెంగుళూరు వెళ్లితిని. అచ్చటనుండి 'వైట్ ఫీల్డు'కువెళ్లి, అచ్చట రెండుమూడురోజులుండి మదరాసు చేరుకొంటిని. శ్రీమా౯గారు కొడైకెనాలులో జ్వరము తగిలి బాధపడుచు ఇంటికి పిలచుకొనివచ్చిరని తెలిసి వారినిచూచుటకై మైలాపూరుకు వెళ్లితిని. శ్రీమా౯గారు అదివరకు ఎన్నడును ఒంటరిగ కొడైకెనాలు వెళ్లినవారు కారు. ఎన్నిమందు లిచ్చినను జ్వరము తగ్గనందున డాక్టర్లు శ్రీమా౯గారిని మదరాసుకు పిలుచుకొని వెళ్లమని తంతె ఇవ్వగా వీరి కుమార్తె శ్రీఅంబుజమ్మాళ్ వెంటనే కొడైకెనాలు వెళ్లి వీరిని చెన్నపట్టణమునకు తీసికొనివచ్చిరి. వంటమనిషి కస్తూరి గూడ వీరితో ప్రయాణమాయెను గావున 8 గంటలలోగా శ్రీమా౯ గారు "అంజద్ బాగు” బంగళాన వచ్చిచేరిరి. వీరిని చూచుటకువెళ్ళిన నాలుగైదు రోజులకు ముందే వీరు చెన్నపట్టణమునకు వచ్చిరనియు, జ్వరబాధ తగ్గనందున పడకలో నుండియే తాను తలచిన ఏర్పాట్లన్నియు గావించిరనియు శ్రీమా౯గారి అల్లుడు నాతోచెప్పి నన్ను శ్రీమా౯గారివద్దకు తీసికొని వెళ్లెను. అనుకొన్న పనులన్నియు. పూర్తిచేసితిననియు, దేహయాత్ర, చాలించుటకు, సంసిద్ధముగ నున్నాననియు చెప్పుటకు ప్రారంభింపగానే వీరి కుమార్తె, భార్య మున్నగువారు భయపడవలసిన అవసరము లేదని యెంత చెప్పినను వినరైరి. అయిదారు రోజులుగా భగవద్గీతలోని 12.వ అధ్యాయమును చదువుమని యెవరితోనైనచెప్పి వారు చదువుచుండగా ఆశ్లోకములను వినుచుండెడివారు. తనకు ఇక ఏచికిత్స గావింపరాదని నిష్కర్షగా కుటుంబమువారితో చెప్పిరి. వారు గొప్ప డాక్టర్లను రప్పింపగా శ్రీమా౯గారు. డాక్టర్లతో "నాకు ఇకను జీవింపవలెననెడి ఆశలేదు. తాము వెళ్లవచ్చును” అని చెప్పి వారిని పంపివేసిరి. "సర్వ ధర్మా౯ పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజ" అను శ్లోకమును పలుమారు స్మరించువారు. రెండు మూడు సార్లు నేను “సెలవు పుచ్చుకొని మరల వచ్చేద" నని చెప్ప యత్నించితినిగాని అందుకు సమ్మతింపరైరి. నే నున్నచో నిరంతరము మాట్లాడుచుందురని వీరి భార్య, కుమార్తె భావింతురని నాకుతెలిసియు లేచివెళ్లుటకు శ్రీమా౯గారు సమ్మతింపరైరి. నే నేదియుచెప్పక కూర్చుండినను వీరు ఏవృత్తాంతము గూర్చియో కేకలు పెట్టుచుండిరి. 5 నిమిషములు వీరు కన్నులుమూసికొనిన మీదట నిద్రపోవుచున్నారని తలచి వీరి సెలవులేకనే వీరి గదివదలి ఇల్లు చేరుకొంటిని. మరునా డుదయము (19-4-41) నేను స్నానముచేయుచుండగా, 8 గం!కు కాబోలు, శ్రీ ఎన్. డి. వరదాచారిగారు టెలిఫోనుద్వారా శ్రీమా౯గారు ఉదయము 6 గం||లకు మరణించి రనువార్తను తెలియజేయగానే దిక్కుతోచక కొంతసేపు ఇంటివద్దనెయుండి ఆమీద మైలాపూరుకువెళ్లి శ్రీమా౯గారి శవముసు జూచి కంట తడిబెట్టుకొంటిని. ఇంటిలో మనుమడు, మనుమరాండ్రు, నుండుటచే వారి భోజనమునకు ఇబ్బంది కలుగునని తలచి కాబోలు శ్రీ అయ్యంగారి కుమారుడు శ్రీ పార్థసారథి దహనక్రియలను వెంటనే ప్రారంభించెను. మెరినాచివర పోలీసు ఆఫీసు ప్రక్కన మైలాపూరువాసులకు శ్మశానము. కావున శ్రీమా౯గారి కళేబరము శ్మశానము చేరువరకు అచ్చట నుంటిని. ఆవరకు బ్రాహ్మణుల శవములకు దహనకర్మ జరుపుటకు ప్రత్యేక స్థలముండెడిది కాదు. కాని రెండురోజులు ముందరనే ఒక భాగము బ్రాహ్మణులకై ప్రత్యేకింపబడుటయు అందు శ్రీమా౯గారి శవము ప్రథమమున దహనమగుటయు చూచి, చచ్చినను వీరికి పూజ్యత తగ్గలేదని ఆందరును భావించిరి.


★ ★ ★

అనుబంధము

1926 వ సంవత్సరమున గౌహతీ కాంగ్రెసుకు అధ్యక్షతవహించినపుడు శ్రీమా౯ శ్రీనివాసఆయ్యంగారుగావించిన ప్రసంగములోని ముఖ్యాంశములను కొన్నిటిని ఈ క్రింద వ్రాయుచున్నాను.

శాసనసభాకార్యక్రమము.

జాతీయవాదులు చిరకాలమునకు ముందే నీర్ణయించుకొన్న ఏర్పాట్ల ప్రకారము దేశాభివృద్దికి అధికారులు ఏ ఆటంకముగాని కల్పించినచో వా రెందుకు నెదుర్కొనవలెను. జాతీయాశయములు పెంపొందబడుటకు శాసనసభలలో అనుకూలముండిననే వానిద్వారా కృషి సాగింపవలెను. ఎందుసను అధికారుల నిరంకుశవర్తనకు ప్రజాప్రతినిధులగు శాసనసభ్యులు లొంగక ధైర్యసాహసములతో దేశ స్వాతంత్ర్యమునకు నిరంతరము ప్రచారముసాగింపవలెను.

కేంద్రఅసెంబ్లీలోను, రాష్ట్రశాసనసభలలోను కాంగ్రెసు జాతీయవాదుల సిద్ధాంతములకు విరుద ముగ అధికారులు అడ్డముతగిలినచో వీరు యెదుర్కొనుటయే గాక సామాన్యప్రజలుగూడ అధికారుల నెదుర్కొనునట్లు చేయవలెను. శాసనసభ్యులు ఈక్రింది అంశములను ముఖ్యముగ గమనింపవలెను: -1. కాంగ్రెసుకోరిన ఆశయములను సఫలము చేయక ప్రభుత్వము కాలహరణముచేసినచో మనలో ప్రముఖులెవరును పదవులను స్వీకరింపరాదు. 2. మసము కోరు స్వరాజ్యమును ఇచ్చుటకు సర్కారు సమ్మతించువరకు బడ్జెటు చర్చలలో శాసనసభ్యులు పాల్గొనక శాసనసభనుండి లేచివెళ్లవలెను. 3. తన ఆధిక్యతను చిరస్థాయి గావించుకొనుటకు ప్రభుత్వము ప్రేరేపించు బిల్లుల నన్నింటిని మూలపడవేసి ఆప్రేరేపణను నెగ్గకయుండునట్లు చేయవలెను. 4. వ్యవసాయ, వర్తక, ఆర్థిక, కార్మిక వ్యవహారములలో దేశము ముందడుగు వేయుటకు శాసనసభలలో తీర్మానములను ప్రతిపాదించుటయేగాక అవి నెగ్గుటకు ప్రయత్నింపవలెను. 5. గ్రామరైతులు, వ్యవసాయదారులు మున్నగు వారి పరిస్థితులు చక్కబడుటకు నిరంతరము పాటుపడవలెను. 6. జమీందారుల ఎస్టేట్ల కాజేయక ఎస్టేటురైతులకు సౌక ర్యము కలిగించుటయే శాసనసభ్యులు ఆదర్శముగా నుంచుకొనవలెను. 7. భూస్వామి, రైతు, యజమాని, కార్మికుడు - వీరిమధ్య విభేదములు తొలగుటకును, వ్యవసాయము, వర్తకము వృద్ధియగుటకును అందరును పాటుపడవలెను.

సైన్యనావికశాఖలు

ఈశాఖలను భారతీయులు నిర్వహింపలేరని ఉదాసీనముగనున్నచో పైవారెవరైన మనదేశముమీదికి దాడివచ్చిన యెడల దేశము ఆధోగతిపాలగును. కావున కొందరైనను బ్రిటిషుసైనికులుగాను, నావికులుగాను శిక్షణపొంది అవసరమైనపుడు దేశసంరక్షణమునకు తోడ్పడవలెను. ప్రభుత్వము యువకులను యుద్ధభటులగావింప ఇష్టపడనియెడల వారిస ప్రోద్బలపరచు కృషి ప్రారంభింపవలెను. బ్రిటిషు ప్రభుత్వము అన్నివిధములగు సంరక్షణము గావించునని కొందరు నమ్ముట పొరపాటు. స్వాతంత్ర్యము లభించినచో వెంటనే దేశసంరక్షణకు శక్తిలేక కలవరముగూడ జనింప వీలున్నదిగావున భారతీయు లందరును దేశసంరక్షణకై అధిక కృషిసాగించుట నేడవసరము. చారిత్రకపరిశీలనలవల్ల భారతీయ ఓడలు, నౌకలు విదేశములకు నెమ్మదిగ వర్తకము సాగించుటయేగాక ఎచ్చటనైన పోరాటము సంభవించినప్పుడు అందు పాల్గొని భారతీయులలో ముఖ్యముగ మహారాష్ట్రులు విజయమొందినట్లు తెలియుచున్నది. భారతదేశచరిత్రను భాతీయులే సమగ్రముగ వ్రాసినగాని ప్రజలలో దేశభక్తి ఏర్పడదనియు, ముఖ్యముగ పాఠశాలలలోను కళాశాలలలోను భారతీయ ప్రాచీనఔన్నత్యమును సూచించు పుస్తకములను యువకులు చదుపునట్లుజేయుట దేశీయనాయకుల విధియనియు తలచుచున్నాను. జపానువంటి చిన్న దేశము, చైనావంటి పెద్దదేశము తమ దేశసంరక్షణకై ఇటీవల అన్నిఏర్పాట్లను గావించుకొన్నపుడు మనము యేల ఊరకుండవలెనని నేను ప్రశ్నించుచున్నాను. ఎవరుకాని వారిదేశమును సంరక్షించుకొను సామర్థ్యములేనిచో అట్టి దేశమునకు స్వాతంత్ర్యము లభించినను నిష్ప్రయోజనమనునది నా దృఢనమ్మకము.

ప్రభుత్వోద్యోగములు:- భారతీయులలో ఆంగ్ల విద్యగడించినవారు అనేకులు బీదలుగావున ప్రభుత్వాదాయమువల్ల పేదరికమును పోగొట్టు కొనుటకు సర్కారు ఉద్యోగముల నపేక్షించు చున్నారు. నౌకరులు యెల్లప్పుడును దాస్యమునకే కాని దేశస్థితిగతి చక్కబడుటకు తోడ్పడరు.

ఇకముందు కాంగ్రెసు మంత్రులకును, ఇతరకక్షలవారి మంత్రులకును ఏలాటి భేదముండదు. కావున వీరిలో నెవరుకాని జాతీయాదర్శములకు విరుద్దముగ పర్తింప నవకాశముండదని అందరును గుర్తింపవలెను. ఈమంత్రులు ఏవియో కొద్దిశాసనములను గావింప వీలగునే కాని దేశాభివృద్ధికి అనువగు శాసనములను గావింప వీరికి ఏమాత్రము వీలుండదు. ప్రజాప్రతినిధులసంఖ్య శాసనసభలలో హైచ్చగును కావున ప్రజాభీష్టములను నెరవేర్చుటకు ఇకముందు కొంత అవకాశముగలదు. పదవులను స్వీకరించుటవల్ల ఏ ప్రయోజనములేదని శాసనసభ్యులు గుర్తించి ప్రజాశయములను అమలునబెట్టుటకు నిరంతరము పాటుపడవలెను. హిందూమతము ఇతర మతములకన్న గొప్పదికావున సంస్కృతమున చక్కనిఅభినివేశము గల వేదాంతులు జాతిమతవిభేదములను పాటింపక వ్యవహరించెడివారని మన ప్రాచీనచరిత్ర దృగ్గోచరముగావించుచున్నది. అస్పృశ్యులు తమంతట తాము కొంత విద్యనేర్చి తక్కినకులముల వారితో సమాన ప్రతిపత్తి కావలెనని కోరినచో ఇందుకు నెవరును అడ్డురారు. కాని పైవారిని వీరికి అనుకూలములను గల్పింపుమని పోద్బలపరచినచో అస్పృశ్యత యెన్నటికిని తొలగదని నాకు తోచుచున్నది. ఏజాతివారు కాని కులమువారుకాని తాము భారత పుత్రులని భావింపవలెనేగాని విభేదములను పాటించుటచే దేశము ఔన్నత్యము పొందదని గుర్తింపవలెను. ఇంగ్లాందున ఆంగ్లేయులు, స్కాట్లండువారు, వేల్సువారు కలరు కాని రాజకీయవ్యవహారములలో వీరందరు ఏకముగ వర్తించుచు వారి స్వభాషలను, ఆచారవ్యవహారములను కాపాడుకొనుచున్నారు. ఇదేమోస్తరుగ భారతీయులు వర్తింప యత్నింపవలెను.

దక్షిణాఫ్రికాలో శ్రీగాంధీగారు అస్పృశ్యతను తొలగించునట్లు భారతీయు లనేకులు తలచుట పొరబాటు. శ్రీ లాలా లజపతిరాయి, శ్రీ గోక్లే మున్నగు మహనీయుల మాటలను పెడచెవినిబెట్టి శ్రీగాంధీగారు జనరల్ స్మట్సుతో గావించుకొన్న ఒడంబడిక ఫలితముగ తెల్లవారున్నచోట నల్లవా రుండరాదని దక్షిణాఫ్రికా వాసులు పట్టుబట్టి యున్నారు. ఎంతోకాలముగ అచ్చట యుంటున్న హిందూమహమ్మదీయులు త్వరలో ఇండియాకు ప్రయాణము కావలెనని యేర్పడెను. కావున జుతిమత విభేదములకు ప్రాముఖ్యత నిచ్చినచో భారతీయులు ఆధోగతి పాలగుదు రనుటకు సందేహములేదు. నేడు గాకున్నను అచిరకాలమున మనకు స్వాతంత్ర్యము లభించును. కావున సామాన్యవిభేదములను గొప్ప గావించినచో భారతదేశము అభివృద్ధి చెందజాలదు. శ్రీగాంధీగారు మతమును రాజకీయ వ్యవహారములతో ముడిపెట్టుటచే దేశముసకు అనేక కష్టనష్టములు నేడు సంభవించెను. టర్కీన కెమల్ పాషా మతమును దూరముగబెట్టి రాజ్యాంగ వ్యవహారములలో వీని కేజోక్యము లేక చేసినందుచే టర్కీ భావిస్థితి చక్కబడెను, నేటి పరిస్థితిలో యేసిద్ధాంతములకు చోటులేదు. కొందరికి స్వాతంత్ర్యము లభించినను అది నిష్ప్రయోజనము. భారతదేశ స్వాతంత్ర్యమే మన లక్ష్యముగానుంచుకొని రేయింబవళ్లు పాటుపడినగాని మనము మనదేశము అత్యున్నతస్థితికి రాదని మరల విన్నవించుచున్నాను. చెన్నపట్టణమున 1910 సం!! ప్రాంతమున తెనుగు వకీళ్లు కొందరు మాత్రమే హైకోర్టున న్యాయవాదులుగనుండిరి. వీరిలో శ్రీపేరి నారాయణమూర్తిగారు కీర్తిగడించి గొప్ప అప్పీళ్ల చేపట్టుచు అరవలచే గౌరవింపబడుచుండిరి. శ్రీవేపా రామేశముగారుకూడ అప్పటికే బి. ఏ., బి. ఎల్., పరీక్షలో అగ్రగణ్యులై న్యాయవాదులైరి కాని వీరికి ఫైలు తక్కున కావున కొంతకాలమునకు గవర్నమెంటు ప్లీడరైరి. శ్రీపేరి నారాయణమూర్తిగారు. నెలకు 4, 5 వేలు ఆర్జించుచు పైకి వచ్చిరి. శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరుగారి ప్రోత్సాహమున శ్రీ బి. ఎన్. శర్మగారు. విశాఖపట్టణమువదలి మద్రాసుకు వచ్చిరి కాని, వీరి ఆర్జనకూడ తక్కువగ నుండెను. హైకోర్టు ఒరిజనల్ సైడున శ్రీరంగాపఝల శ్రీరామశాస్త్రిగారు కొంత ప్రాముఖ్యతకు వచ్చిరి కావున వీరు విజయనగరము సంస్థానము దావాను విశాఖపట్టణము జిల్లాకోర్టులో దాఖలుచేయుటకు మరికొందరు వకీళ్లతో నియమింపబడిరి. కొంతకాలము ముందు విజయనగర సంస్థానాధీశుల వంశావళిని నాతండ్రిగారు ముద్రించియుండిరి. కావున దాని తాలూకు వ్రాత కాపీలను (ఒరిజనల్సు) ఇప్పింపమని కోరిరి. వెదకి యిచ్చెదనని చెప్పగా రెండుమూడురోజుల తర్వాత వచ్చెదమనియు పై కాగితములను తప్పక జాగ్రత చేసియుంచుమనియు చెప్పి వారు వెళ్లిరి. శ్రమపడి ఆ కాగితము లన్నిటిని యిచ్చుటకు యత్నించితిని. కాని కొన్ని దొరకనందున తక్కినవానిని శ్రీరామశాస్త్రిగారు మరల నావద్దకు వచ్చినపుడు ఇచ్చితని. ముఖ్యమైన కాగితములు, 1, 2 తప్ప తక్కినవన్నియు దొరకినందుకు వారు సంతృప్తిచెంది విజయనగరము సంస్థానముకేసు విశాఖపట్టణము కోర్టున విచారణకు వచ్చినపుడు నేనచ్చటికివచ్చి తప్పక సాక్ష్యమివ్వవలెనని నొక్కి చెప్పిరి. కోర్టున సాక్ష్యమిచ్చుటకు నా కలవాటులేనందున నన్ను తొలగింపమని యెంత చెప్పినను వారు వినరైరి. కేసు విచారణకు వచ్చుటకు ముందు సాక్షి సమ్మను వచ్చుననియు, మదరాసు నుండి రాకపోకలకు రైలుఖర్చులేగాక బత్తాకూడ నిప్పింపబడుననియు చెప్పిరి. నేను నిశాఖపట్టణమునకు రాగానే ఏయంశములగూర్చి నేనెట్లు సాక్ష్య మివ్వవలెనో ఆసందర్భములను తానుగాని, యితర వకీళ్లు గాని నాకు బోధపరతురని శ్రీశాస్త్రిగారు చెప్పి వెళ్లిరి. ఆమీద కొన్నిసంవత్సరములకు నాకు విశాఖపట్టము కోర్టునుండి సమ్మను వచ్చినందున విధిలేక అచ్చటికి వెళ్లవలసి వచ్చెను. 2, 3, రోజులలో నా సాక్ష్యము పూర్తియగునని నేను తలచితిని కాని నెలరోజులకుపైగా నే నచ్చటవుండవలసిన పరిస్థితి నేర్పడెను. కాని అన్నపానాదు లన్నిటికి సంస్థానము బంగళాలో నాకు ఏర్పాట్లు చేసిరి. కాని, ఆలావు తిండి తినలేక ఆజీర్ణమువల్ల కొన్నిరోజులు బాధ పడవలసి వచ్చెను. విశాఖపట్టణముననున్న సంస్థాన డాక్టరుచికిత్సవల్ల అనారోగ్యము తగ్గెను కాని ఆ ప్రాంతపు తిండి జతపడనందున సంస్థాన ఉద్యోగితో మదరాసు భోజనమున కేర్పాటు కావింపుమని కోరగా త్వరలో అట్లే గావింతునని వారుచెప్పిరి. కేసువిచారణను శ్రీమా౯ యస్. శ్రీనివాసఅయ్యంగారు ప్రారంభించి పదిరోజులు వాదించిరి. మొదటిసాక్షి నేను కావున శ్రీమంథా సూర్యనారాయణపంతులుగారు సాక్ష్యమున నేను చెప్పవలసిన యంశములను నాకు తెలియబరచిరి. వీరు విజయనగరము వకీళ్లలో ప్రముఖులనికూడ నాకు తెలిసెను. మరునాడు సోమవారము కాబోలు శ్రీసూర్యనారా యణవంతులుగారితో నేను జిల్లాకోర్టుకు వెళ్లితిని. 12 గంటలకుమీదన శ్రీమా౯ అయ్యంగారు కోర్టునకు రాగానే కోర్టు గుమాస్తాలు నన్ను బోను నెక్కించిరి. శ్రీమా౯గారు నన్నడిగిన ప్రశ్నల కన్నింటికిని ప్రత్యుత్తరము చెప్పినమీదట రెండు గంటలలో నాసాక్ష్యము పూర్తిఆయెను. కాని కోర్టుఉద్యోగి నాసాక్ష్యము టైపు అగుచున్నదనియు, దానిని కోర్టున నాయెదుట చదివినమీదట అందు చేవ్రాలుచేసి వెళ్లవలెననియు, ఏవైన పొరబాట్లున్న కోర్టున చెప్పవలెననియు సూచించెను. ఏవో రెండువాక్యములను నేను చెప్పలేదని కోర్టునచెప్పగానే కోర్టుఉద్యోగి ఆవాక్యములను కొట్టివేసి, నావాఙ్మూలము చివర సంతకము చేయుమన్నందునచేసితిని. దేవుడా ! అని కోర్టుహాలు వదలి కోర్టువసారాకు రాగానే త్రోవలో వకీళ్లతో మాట్లాడుచుండిన శ్రీమా౯ అయ్యంగారు నన్నుపిలిచి నావలె నితరులుకూడ సాక్ష్యమిచ్చినచో కేసు కొన్నిమాసములలో పూర్తియగునని వకీళ్లతో చెప్పగా వింటిని. ఈ లోగా విజయనగరము బసలోనున్న సంస్థానఉద్యోగి కాఫీ మున్నగు ఫలహారములతో అచ్చటికివచ్చి కోర్టువెనుక నొకగదిలో వీనినుంచి నన్నొకగదిలో కూర్చోబెట్టి శ్రీమా౯గారి వంటమనిషితో "వారికి కావలసిన కాఫీ ఫలహారములను కుంపటిపై సిద్ధము గావింపు"మనిచెప్పెను. వంటమనిషి. అన్నిటిని అర్థగంటలో సిద్ధముగావించి సంస్థానఉద్యోగికి వార్త పంపగనే 5, 6 మందివకీళ్లు నేనున్న గదిలోనికివచ్చిరి. శ్రీమా౯గారు రానందున వారిని పిలుచుకొని సంస్థానోద్యోగి రాగానే అందరము ఫలహారములను పుచ్చుకొన ప్రారంభించితిమి. చివరకు అందరము లేచి వెళ్లుచుండగా సంస్థానఉద్యోగి ఎంతోభయపడుచు నాకు అచ్చటితిండి సరిపడక జబ్బుచేసినందున శ్రీమా౯గారి వంటలో కొంత నాకుతిండిపెట్టమని శ్రీమా౯గారితో చెప్పగ వా రిందుకు సమ్మతించి వంటవాని పిలిచి నాకు కావలసినట్లు అన్నముపెట్టుమని చెప్పిరి. ఆమీద నేను శ్రీసూర్యనారాయణ పంతులను మదరాసు వెళ్లుటకు అనుమతికోరుచు ఇంకను నే నేన్నిరోజు లచ్చటనుండవలసియుండునని ప్రశ్నింపగా 2, 3 రోజులలో జడ్జిగా రీసందర్భమును తెలియజేయుదురని చెప్పిరి. నాటిరాత్రి మొదలు శ్రీ అయ్యంగారికి తయారగుభోజనమున చారు, పులుసు మున్నగునవి లభించెను కావున క్రమేణ నీరసము తగ్గి నేను ఆరోగ్యవంతుడనైతిని. మొదటిరోజున వంటమనిషి శ్రీమా౯గారు భుజించినమీదట నా కన్నముపెట్టెను. ఈసంగతి వారు మరునాడు తెలిసికొని నాకుకూడ రెండుపూటల తనతోపాటు విస్తరి వేయుమని తెలియజేసిరి కావున నెమ్మదిగ కొన్ని రోజులు విశాఖపట్టణమున శ్రీమా౯గారి సాన్నిధ్యమున తిండితినుచు సాయంత్రము వకీళ్లతోపాటు అక్కడి బీచికి వెళ్లుచుంటిని. పదిరోజులమీదట నేను మదరాసుకు వెళ్లవచ్చుననియు, మరల సమ్మను వచ్చినచో అప్పుడు రావలెననియు చెప్పిరి. నాటి మధ్యాహ్నము కోర్టున వికీళ్లనందరిని సందర్శించి నేను మరునాటి యుదయము ప్రయాణమగుచున్నానని వారితో చెప్పి శెలవుపుచ్చుకొంటిని. రాత్రి 7 గంటలకు శ్రీమా౯గారితో తిండితినుచు నేను చెన్నపురికి వెళ్లుచున్నాననిచెప్పగా నొపుట్టుపూర్వోత్తరములను విచారించి యెన్నియోప్రశ్నలవేసిరి. ఇట్లుండగా శ్రీగురుజాడ అప్పారావుగారు శ్రీమా౯గారితో మాట్లాడుటకు వీరి బసకువచ్చిరి. నేను బయటికివెళ్లితినిగాని శ్రీ అప్పారావుగారు నన్ను పిలిచి శ్రీమా౯గారితో "వీరితండ్రి గొప్పసంస్కృతాంధ్ర విద్వాంసుఁడు. చెన్నపట్టణమున ప్రథమమున ఒక ముద్రాక్షరశాల నిర్మించి అనేక సంస్కృతాంధ్ర గ్రంథములను సంస్కరించి ముద్రించిరి. వీరు మొట్టమొదట శ్రీమద్రామాయణము, అమరముటీక, భారతము భాగవతము మున్నగు గ్రంథములను ముద్రించుటచే తెనుగు ప్రాంతమున అపార కీర్తిగడింపగల్గిరి. నన్ను శ్రీ ఆనందగజపతి మహారాజువారికి నెరుకపరచి నాచదువుకు సహాయము. చేసిరి,” మున్నగు సంగతులు చెప్పగానే శ్రీమా౯గారు నన్ను కుర్చీమీద కూర్చొనుమనిచెప్పి, తాను చెన్నపట్టణమునకుతరలిరాగానే అప్పుడప్పుడు కనబడుచుండుమని చెప్పిరి.

||

శ్రీమా౯గారు అడ్వకేటు జనరలుపదవిని వదలిన మీదట మదరాసు యూనివర్శిటీ ప్రతినిధిగ మదరాసు శాసనసభను ప్రవేశింప నిశ్చయించుకొనిరి. ఈ ఎన్నికలకు పట్టభద్రులు ఓటర్లు కావున అరవ జిల్లాలలోని ఓట్లు హెచ్చుగ తనకు లభించుననియు, తెనుగుజిల్లాల ఓట్లను అచ్చటచ్చట కొందరు వకీళ్లు సంపాదింతురు కాని ప్రత్యేకముగ ఒకమనిషి అవసరమనియుతలచి కాబోలు నన్ను ఈపనికి నియమించిరి. నాస్వంతఖర్చులతో అనేకులకు జాబులు వ్రాయుటయేగాక స్వయముగా కొన్నిచోట్లకువెళ్లి దాదాపు వెయ్యి ఓట్లకుపైగా నేను సంపాదింపగల్గితిని. తక్కిన వారికన్న ఈపని నేను చక్కగ నిర్వహించితిననియు, తనకు సంతృప్తి కలిగినదనియు శ్రీమా౯గారు చెప్పిరి. ఈయెన్నికలో వీరు జయమొందినమీదట శ్రీ కె. భాష్యముగారు వీరిగౌరవార్థము గొప్పవిందు గావించిరి. దానికి నేను వెళ్లియుంటిని. శ్రీమా౯గారు నన్నుచూడగనే దూరముగ కూర్చొనరాదనిచెప్పి వెంటబెట్టుకొనివెళ్లి తనప్రక్కన కూర్చొనుమనిరి. ఇందుచే వీరికి నాపైప్రీతి యేర్పడెనని తలచితిని.

1920 సం||న బందరు వాస్తవ్యులు శ్రీకోపల్లె కృష్ణరావుపంతులుగారి శ్రోత్రియగ్రామమగు అరియలూరును కొనుటకు యత్నించితిని. నావద్ద పైకము లేనందున శ్రీ వి. ఎల్. శాస్త్రిగారిని శ్రీమా౯గారితో మాట్లాడమని పంపితిని. శ్రీశాస్త్రి ఇరువదివేలు నాకు అప్పుకావలెనని చెప్పగానే తప్పక ఈ సొమ్మునిచ్చుటకు అభ్యంతరములేదనిచెప్పి కొన్ని రోజులకు సొమ్మునిచ్చిరి. అదిమొదలు ప్రతినెల నేను వారికి వడ్డీచెల్లించుచు కొంతకాలమునకు అప్పు పూర్తిగ చెల్లించితిని. తనవద్ద అప్పు పుచ్చుకొన్న వారిలో నేనొక్కడనే మాటతప్పక అప్పుతీర్చితినని. వీరు ఇతరులతో చెప్పుచుండిరని వింటిని. కావున నాపై వీరికి నమ్మకము యేర్పడెనని విస్పష్టమాయెను.

వీరితో దూరప్రయాణములు సాగించునప్పుడు వీరి జూనియర్లగు శ్రీ కే. భాష్యమువంటి వారు వీరివద్ద సొమ్ముపుచ్చుకొని ఖర్చుపెట్టెడివారు. వారు వీరిచ్చిన సొమ్మునకు లెక్క చెప్పుటలేదనియు, నన్నీపనిని చూడుమనియు వీరు చెప్పుచుండిరికాని శ్రీ కే. భాష్యము వంటివారికి అసంతృప్తి కలుగునని తలచి నే నీపనికి పూనుకోనైతిని. తన జూనియర్లు పైకి ఎచ్చటికైన వెళ్లి తనసొమ్ము వృథాగాఖర్చు గావించుచున్నారని వీరు కేకలువేయుచుందురు. కాని నేను వినివిననట్లు వర్తించుచుంటిని. మా ప్రయాణములలో గయా కాంగ్రెసు ప్రయాణము, అమృతసర ప్రయాణము దీర్ఘ కాలముసాగెను. గయలో 10 రోజులును, అమృతసరమున దాదాపు నెలరోజులును ఉండుట తటస్థించెను. గయలోని వర్తమానములగూర్చి యిదివరకే చెప్పియుంటిమి. పంజాబుఅల్లరులు కాగానే ఇండియాగవర్నమెంటువిధిలేక లార్డు హంటర్ యాజమాన్యమున ఒక కమీషను నిర్మించెను. ఇందుకు ముందుగ కాంగ్రెసువారు శ్రీ సి. ఆర్. దాసు, శ్రీగాంధీ, జస్టిస్ తయాబ్జి మున్నగువారిని ఒక కమిటీగానిర్మించి పంజూబు దురంతముులగూర్చి విచారణసాగింప నేర్పాట్లుగావించిరి కాని శ్రీ సి. ఆర్. దాసుగారు బడిరి హంటర్ కమిటీన సాక్షుల పరీక్షించుటకై ఆదేశింప కావున శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారు కాంగ్రెసు విచారణకమిటీసభ్యులైరి. ప్రతిరోజు 10 గంటలు మొదలు 4 గంటలవరకు హంటర్ కమిటీ సాగుటయు, ఆమీద 5.30 మొదలు 7 గం!! వరకు అమృతసరము సిక్కు దేవాలయమున కాంగ్రెసు విచారణకమిటీ సాగుటయు తటస్థించెను. రెండు కమిటీలకును శ్రీమా౯గారు హాజరగుచుండిరి. కాంగ్రెసు కమిటీ విచారణలో వీరు ప్రాముఖ్యత వహింపవలసివచ్చెను. ఈరెండు కమిటీలకు నన్ను వెంటరమ్మని వీరు కోరినందున నేనును వెళ్లుచుంటిని. హంటర్ కమిటీన నాకు పనిలేదు కావున అప్పుడప్పుడు మోటారు కారున నేను విశ్రాంతిపుచ్చుకొనుచుంటిని. కాంగ్రెసు కమిటీన రికార్డులన్నిటిని జాగ్రతగ నా స్వాధీనమున యుంచుకొనమని శ్రీమా౯గారి ఆదేశము కావున ఇందుకు సమ్మతించితిని కాని ఈపని అతికష్టముగా నుండెను. సి. ఐ. డి. లు కొన్ని కాగితములను నావద్ద లాగికొనుటకు యత్నించుటచే అనేక కష్టములకు పాలైతిని. చలిప్రదేశము కావున చీకటిపడగానే ఒకటి రెండుసార్లు మూత్ర విసర్జనమునకు అవసర ముండెడిది. దేవాలయ ఆవరణములో మరుగుదొడ్డి లేదు కావున పైకివెళ్లవలసినదిగ నేర్పడెను. అప్పుడు నావద్దనున్న కాకితములను కట్టగట్టి ఒకపెట్టెలోనుంచి వెళ్లుటకు అవకాశము లేకపోయెను. కాకితములను చంకబెట్టుకొని వెళ్లినచో వాటిని లాగికొందురేమో* అనుభీతి జనించెను. రెండు రోజులు ఇబ్బందిపడిన మీదట శ్రీమా౯గారితో నా కష్టములను చెప్పుకొంటిని. వెంటనే వీరు కమిటీ కార్యదర్శియగు పండిట్ కే. సంతానముగారితో ఒక ఇనుపపెట్టెను తెప్పించి నాకిమ్మని చెప్పిరి. ఈపెట్టెరాగానే అందు కాకితములనుంచి తలచినపుడు పైకి వెళ్లుచుంటిని. ఈకమిటీల విచారణలలో నేను హాజరైనందుచే నాకు చక్కని అనుభవము అలవడెను. కొంతకాల మునకు నేను ఇండియ౯బ్యాంకింగు కమిటీ నెదుటను, కో ఆపరేటివ్‌కమిటీ ముందటను సాక్ష్యమివ్వ వలసివచ్చినపుడు పై యనుభవము మిక్కిలి ఉపకరించెను. కావున చక్కనిసాక్ష్యము నివ్వగలిగితిని. అమృతసరమున చలి, మంచు అపరిమితము కావున చెన్నపట్నముచేరగనే జబ్బునపడితిని కాని కొన్ని రోజులకు ఆరోగ్యము ఏర్పడెను.


★ ★ ★

త్రిలిఙ్గ రజతోత్సవసందర్భమున

శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఆయ్యంగారు పంపిన

సందేశము.

తెనుగుత్రిలిఙ్గవారపత్రిక రజతోత్సవసందర్భమున శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులవారికి కానుక సంచిక సమర్పింతు రని విని సంతోషించుచున్నాను. మేము ఇరువురమును చాలకాలముగ స్నేహితులమై యుండుటచేత ఆయన, ఆయన, శీలము ఆయన సేవ వీనినిగురించి తగినరీతిని వర్ణించుట నాకు కష్టము. విస్తారమై, సత్కార్యాచరణమున వీరు చూపిన నిరాడంబరత్వమును అప్రతిమానము. బలవంతుడు, పేద అను భేదముచూడక పాత్రులయినవారు ఏదర్జావారైనను, ఈయన వారికి గావించిన యెన్నో మేళ్లను వారికి వీరియందుకల కృతజ్ఞతాపూర్వకమైన అనురాగమును వీరికి ఉత్తమ మైన స్మరణ చిహ్నములు. ప్రాతకాలపుశీలములోని ఏ సుగుణములు మనము నేడు మఱచిపోయి ఎక్కువ ఎక్కువగా నష్టపడుచున్నామో అట్టి సుగుణముల యెడల వీరు వీడరానిభక్తి కనబరచిరి. స్నేహము నకు నిజమైన అర్థము నెఱింగిన బహు కొద్ది మందిలో ఈయన గణింపదగినవాడు. స్వోత్కరాభిలాషలేక సత్యముగ పత్రికాప్రచురమునకును దేశమునకును సేవచేసినవాడు. చూపునకు ఈయన బహు సాధువు ; కాని సునిశితమైన బుద్ధివైశద్య మితనియందుగలదు. నిర్ణయముల చాకచక్యమున్నది. నైతికోత్సాహమును వితరణదృష్టియు గలవారు. తెలుగు, సంస్కృతవాఙ్మయములయెడలను ప్రాచీన భారత ఆదర్శముల యెడలను వీరికి తన్మయత్వము కలదు. వీరి జీవితమునకు ఈ ఆదర్శములే మార్గదర్శకతారలు.

ఈరజతోత్సవ సందర్బమున త్రిలిఙ్గకును శ్రీవావిళ్ల వేంకటేశ్వరకళాస్త్రులకును నా హృదయపూర్వక అభినందనములు సమర్పించుచున్నాను. వారికి ఆరోగ్యమును, సౌఖ్యమును గలిగి ఇతోధికముగా సేవచేయుటకు అవకాశము కలుగుగాక !

శ్రీమతి యస్. అంబుజమ్మాళ్ నా షష్ట్యబ్దపూర్తి ఉత్సవము నాడు నన్ను ప్రశంసించుచు పంపినజాబు:-

తమ షష్ట్యబ్దిపూర్త్యుత్సవములకు వచ్చి యానందించు భాగ్యము లేకపోయినందులకు చింతిల్లుచున్నాను. తే 4 ది నాటి పత్రికలలో నీ విషయ మును చదువగా నీ యుత్సవప్రసక్తి తెలిసినది. నాతమ్ముడు శ్రీ ఎస్. పార్థసారథి చెన్నపురమునలేడు. కొడైకెనాలుకు వెళ్లియున్నాడు. అతనికి మీ యాహ్వానము అందియుండదు.

నేను మీకేమి సందేశ మంపగలను ? మిూరు మాతండ్రి, కీ. శే. ఎస్. శ్రీనివాసఅయ్యంగారుగారికి పరమాప్తులుగ నుంటిరి. స్వయముగా సంస్కృతమున పాండితి వెలయుటచే ఆయన మీ భాషాసేవ గుర్తింపగలిగి సుమారు ముప్పదేండ్లు తమయందు విశ్వాసము వహించియుండిరి. తమ రింకను అమూల్యమగు భాషాసేవ యొనర్పగల్గుటకు శ్రీమన్నారాయణుడు మీకు దీర్ఘాయు వొసంగు గాక ! మీ విశాలహృదయమును, వదాన్యతయు నితోధికముగ వర్ధిల్లుగాక !




చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్‌సన్స్‌వారిచే

'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము. -1955