పుట:Prasarapramukulu022372mbp.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

ప్రసార ప్రముఖులు.

ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'జీవనకాలమ్' 16 సంవత్సరాలుగా నిర్వహిస్తూ సామాజిక జీవన సమస్యలను విశ్లేషిస్తున్నారు. 10 కి పైగా నాటకాలు, 20 నాటికలు, 10 నవలలు వ్రాసి సాహితిలోకంలో విశిష్ట స్థానం సంపాదించారు. వంద దాకా చిత్రాలకు సంభాషణలు. కథలు సమకూర్చారు. 1982 నుండి ఎన్నో సంస్థలచే ఉత్తమ నటులుగా బహుమతులు పొందారు. ఇటీవల కాలములో ఈ టీవి జెమినీ టీవీలకు వివిధ కార్య క్రమాలు రూపొందిస్తూ తమ విలక్షతను చాటుకొంటున్నారు గొల్లపూడి. మంచి మిత్రులు మారుతీరావు.

దండమూడి మహీధర్:

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రములో హిందీ స్క్రిప్ట్ రైటర్ గా రెండున్న దశాబ్దాలుగా పనిచేసిన మహీధర్ హిందీలో మంచి రచయిత. అనువాదకు/డుగా మంచి పేరు సంపాదించారు.

కె.చిరంజీవి.

మూడు దశాబ్దాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో నాటక విభాగంలో డ్రామ Voice గా పనిచేసి చిరంజీవి పదవీ విరమణ చేశారు. చక్కటి కంఠ స్వరం గల చిరంజీవి మంచి రచయిత కూడా. నాటకాలు శ్రవ్య మాధ్యమానికి సరి పడేలా రూపొందించడములో సిద్ధహస్తులు. ఆయన 'స్వతంత్ర భారత్ కీ జై' నవల వ్రాశారు. రేడియో నాటికలు ఒక సంకలనంగా ప్రచురించారు. 1994 లో పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిరపడ్డారు. శారదా శ్రీనివాసన్‌తో కలిసి అనేక రేడియో నాటకాలలో పాల్గొన్నారు.

మల్లాది నరసింహశాస్త్రి :

మల్లాది వంశంలో జన్మించిన నరసింహశాస్త్రి అసిస్టెంటు ఎడిటర్ Srciptగా హైదరాబాదు కేంద్రంలో మూడు దశాబ్దాలుగా పనిచేశారు. మల్లాది రామకృష్ణశాస్త్రి కుమారులు వ్వవసాయ విభాగములో శాస్త్రి చక్కటి పేరు తెచ్చుకున్నారు.

విజయవాడలో అనౌన్సర్ గా చేరి స్క్రిప్ట్ రైటర్ గా వ్యవసాయ విభాగములో చేరారు.

1984 లో పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిరపడ్డారు.

దూరదర్శన్ లో అసిస్టెంటు డైరెక్టర్ గా పని చేస్తూన్న శైలజా సుమన్ వీరి కోడలు.

.